ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి మరియు అమెరికా అధ్యక్షుని మధ్య టెలిఫోన్ సంభాషణ

Posted On: 04 APR 2020 9:58PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు అమెరికా అధ్యక్షుడు గౌరవనీయులు డోనాల్డ్ ట్రంప్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.   ప్రస్తుతం విజృంభిస్తున్న కోవిడ్-19 మహమ్మారి గురించీ,  ప్రపంచ శ్రేయస్సు, ఆర్ధిక వ్యవస్థపై దాని ప్రభావం గురించీ, ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారు.    

అమెరికాలో సంభవించిన ప్రాణ నష్టానికి ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వ్యాధితో బాధపడుతున్నవారు త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.  

రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక సంబంధాల గురించి నొక్కి చెబుతూ,  ఈ అంర్జాతీయ సంక్షోభాన్ని అధిగమించడానికి అమెరికాతో  భారత్  సంఘీభావాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.   కోవిడ్-19 వ్యాప్తిని నిశ్చయంగాసమర్ధంగా తిప్పి కొట్టడానికి భారత్- అమెరికా భాగస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఇరువురు నాయకులు అంగీకరించారు

ఈ మహమ్మారి కారణంగా తలెత్తే ఆరోగ్య, ఆర్ధిక ప్రభావాలను తగ్గించడానికి తమ తమ దేశాల్లో చేపట్టిన చర్యలను పరస్పరం తెలియజేసుకున్నారు. 

ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజల మానసిక, శారీరిక ఆరోగ్య పరిరక్షణకు, యోగ, ఆయుర్వేద (సంప్రదాయ భారతీయ మూలికా మందుల విధానం) వంటి వైద్య విధానాల ప్రాముఖ్యత గురించి ఇరువురు నాయకులు చర్చించారు. 

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్-19 సంక్షభం నేపథ్యంలో, తమ రెండు దేశాలకు చెందిన అధికారులు సన్నిహితంగా కొనసాగాలని వారు అంగీకరించారు.  

***


(Release ID: 1611242) Visitor Counter : 213