ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుల మధ్య టెలిఫోన్ చర్చలు.
Posted On:
04 APR 2020 10:00PM by PIB Hyderabad
బ్రెజిల్ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ జెయిర్ మెసియాస్ బొల్సొనారోతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. కోవిడ్ -19 మహమ్మారి విస్తరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల గురించి ఇరువురు నేతలు చర్చించారు. కోవిడ్ -19 కారణంగా బ్రెజిల్ దేశంలో మరణించినవారికి ప్రధాని శ్రీ మోదీ నివాళి ఘటించారు. ఈ కష్టకాలంనుంచి బ్రెజిల్ పౌరులు బైటపడాలని కోరుతూ భారతీయులందరూ ప్రార్థనలు చేస్తున్నారని ప్రధాని అన్నారు.
కోవిడ్ -19 సంక్షోభాన్ని తగ్గించడానికి ఇరు దేశాల మధ్యన సన్నిహిత సహకార ప్రాధాన్యత గురించి, ద్వైపాక్షికంగాను, బహుముఖీన సంస్థాగతంగానూ అది కొనసాగాల్సిన ఆవశ్యకత గురించి ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. కోవిడ్ -19 సంక్షోభం సమసిపోయిన తర్వాత అంతర్జాతీయంగా వుండాల్సిన మానవీయ కేంద్రిత భావనలు, ఆలోచనల గురించి ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.
ఈ కష్టకాలంలో భారతదేశం ధైర్యంగా నిలబడి బ్రెజిల్‌కు తగిన సహాయం అందిస్తుందని ఆ దేశ అధ్యక్షులతో ప్రధాని అన్నారు. కోవిడ్-19 నిరోధానికి, తద్వారా వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఇరు దేశాల అధికారులు నిరంతరం సంప్రదింపులు చేసుకుంటారని ఇరువురు నేతలు అన్నారు.
ఈ ఏడాది జరిగిన భారతదేశ రిపబ్లిక్ ఉత్సవాల్లో బ్రెజిల్ అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేశారు. ఇందుకుగాను మరోసారి ప్రధాని తన కృతజ్ఞతలు తెలిపిఆరు. భారతదేశం బ్రెజిల్ దేశాల మద్యన స్నేహసంబంధాలు పెరగడంపట్ల ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాది బ్రిక్స్ దేశాలను ముందుకు నడిపించడానికిగాను బ్రెజిల్ నాయకత్వ పటిమను ప్రదర్శించిందని అన్న ప్రధాని ఈ విషయంలో బ్రెజిల్ అధ్యక్షులకు అభినందనలు తెలిపారు.
(Release ID: 1611230)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam