విద్యుత్తు మంత్రిత్వ శాఖ
5 ఏప్రిల్ 2020న రాత్రి 9 గంటలకు విద్యుత్ దీపాలన్నీ ఆర్పివేస్తే గ్రిడ్లపై భారం తగ్గినా కూడా విద్యుత్ గ్రిడ్లు స్థిరంగా ఉండడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు మరియు చర్యలు తీసుకోబడతాయి
Posted On:
04 APR 2020 3:56PM by PIB Hyderabad
5 ఏప్రిల్ 2020న రాత్రి 9.00 గంటల నుండి 9.09 నిమిషాల వరకు దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా విద్యుత్ దీపాలన్నీ ఆర్పివేయవలసిందిగా దేశ ప్రధాన మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ప్రజలందరూ ఒకేసారి విద్యుత్ దీపాలు ఆర్పివేసినట్లైతే విద్యుత్ గ్రిడ్లపై భారం తగ్గి అస్థిరత ఏర్పడుతుందని మరియు విద్యుత్ ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఏర్పడటం వలన విద్యుత్ ఉపకరణాలకు హాని కలిగే అవకాశముందని కేంద్ర విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భయాన్ని తొలగించడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ తగిని చర్యలను తీసుకుందని, భారత విద్యుత్ గ్రిడ్లు దృఢమైనవి మరియు స్థిరమైనవని, ఆ సమయంలో విద్యుత్ హెచ్చుతగ్గులను నియంత్రించడానికి తగిన ఏర్పాట్లను మంత్రిత్వ శాఖ తీసుకుంటున్నదని తెలిపింది.
దేశ ప్రధాన మంత్రి ఏప్రిల్ 5న గృహాల్లోని విద్యుత్ దీపాలను మాత్రమే ఆర్పివేయమని విజ్ఞప్తి చేసారు కానీ వీధుల్లోని విద్యుత్ దీపాలు లేదా కంప్యూటర్లు, టీవి, ఫ్యాన్లు, రిఫ్రిజరేటర్లు మరియు ఏసిల వంటి మిగతా విద్యుత్ ఉపకరణాలను నిలిపివేయమని కోరలేదని మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ఆసుపత్రులు, ప్రజల ఎక్కువగా ఉపయోగించు ప్రదేశాలు, మునిసిపల్ సేవలు, కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు వంటి అత్యవసర ప్రదేశాల్లో విద్యుత్ దీపాలు ఆర్పివేయవలసిన పని లేదని, అవి వెలుగుతూనే ఉంటాయని, గృహాల్లో మాత్రమే విద్యుత్ దీపాలు ఆర్పవలసిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజల రక్షణ కొరకు స్థానికంగా వీధి దీపాలను ఆర్పకుండా అలాగే ఉంచాలని స్థానిక సంస్థలను కోరింది.
(Release ID: 1611090)
Visitor Counter : 245
Read this release in:
Assamese
,
Hindi
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Bengali
,
English
,
Urdu
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam