సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ సమయంలో దివ్యాంగులకు కనీస సహాయ సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా హోం మంత్రిత్వశాఖను కోరిన డిపార్టమెంట్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ (డిఇ పిడబ్ల్యుడి)
Posted On:
28 MAR 2020 12:33PM by PIB Hyderabad
పామాజిక న్యాయం , సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన డిపార్టమెంట్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ (డిపిపి డబ్ల్యుడి), లాక్ డౌన్ సమయంలో దివ్యాంగులైన వారికి కనీస మద్దతునిచ్చే సేవలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇందుకు సంబంధించి హోం మంత్రిత్వశాఖ కార్యదర్శిక ఒక లేఖ రాస్తూ , సంక్షోభ సమయాలలో దివ్యాంగుల పరస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపింది. వారి వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి తగిన మద్దతు రక్షణ కొనసాగించాలన్నారు. వీరిలో చాలామంది తమ రోజువారి జీవికకు కేర్ టేకర్లపైన, పని వారిపైన ఆధాపరడి ఉన్నారని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో దివ్యాంగులకు సేవలు అందించే వారు వీరి ఇళ్లకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
సామాజిక దూరం నిబంధనలు పాటించడం తప్పనిసరి అయినప్పటికీ, అదేసమయంలో అత్యవసర సహాయ చర్యలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపింది.
దివ్యాంగులకు సేవలు అందించే వారు, పనివారికి ప్రాధాన్యతా పద్ధతిన పాస్ లు మంజూరు చేసే విధంగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని లేఖ రాశారు. అవసరమైతే దివ్యాంగులకు సంబంధించిన వ్యవహారాలు చూసే వారినుంచి సమాచారాన్ని సరిచూసుకోవచ్చని తెలిపింది. దివ్యాంగులకు సంబంధించి ఆయా ప్రాంతాలలో అవసరాలను తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించే విధంగా స్థానిక పోలీసులను ఆదేశించాలని కోరారు.
(Release ID: 1608823)
Visitor Counter : 118
Read this release in:
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Odia
,
Tamil
,
Kannada