మంత్రిమండలి

వస్త్రాలు, ఇతర జౌళి ఉత్పత్తుల ఎగుమతిపై పన్ను రాయితీ పొడిగింపునకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

Posted On: 25 MAR 2020 3:39PM by PIB Hyderabad

  ‘కేంద్ర, రాష్ట్ర పన్నులు-రుసుములలో రాయితీ’ (RoSCTL)ని 2020 ఏప్రిల్ 1 నుంచి కొనసాగించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ‘ఎగుమతి చేసిన వస్తువులపై సుంకాలు-పన్నుల మినహాయింపు పథకం (RoDTEP)లో విలీనం చేసేదాకా ఈ రాయితీ కొనసాగింపు పథకం అమలులో ఉంటుంది. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన వస్త్రాలు, ఇతర జౌళి ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించిన RoSCTL పథకం శాతాలు, మార్గదర్శకాలలో ఎలాంటి మార్పు లేకుండా 2020 ఏప్రిల్‌ 1 నుంచి RoDTEPలో అది విలీనమయ్యేదాకా కొనసాగుతుంది. ప్రస్తుతం ఏ ఇతర వ్యవస్థ కిందా లభించని పన్ను/సుంకాల రాయితీలను RoSCTL  కింద మార్చి 31 తర్వాత కూడా కొనసాగించడం వల్ల జౌళిరంగం మరింత స్పర్థాత్మకం కాగలదన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

*****



(Release ID: 1608122) Visitor Counter : 92