ప్రధాన మంత్రి కార్యాలయం
సుదీర్ఘ పోరాటంలో జనతా కర్ఫ్యూ తొలి అడుగు మాత్రమే: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
22 MAR 2020 9:46PM by PIB Hyderabad
కోవిడ్-19పై సుదీర్ఘ పోరాటంలో జనతా కర్ఫ్యూ తొలి అడుగు మాత్రమేనని, మనమింకా చాలాదూరం పయనించాల్సి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. అలసత్వానికి ఏమాత్రం తావివ్వరాదని ప్రజలను హెచ్చరిస్తూ- ఒక్కరోజు స్వీయ నిర్బంధాన్ని విజయంగా పరిగణించి వేడుక చేసుకునే వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా “దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తే ఎంతపెద్ద సవాలునైనా సమష్టిగా తిప్పికొట్టగల సమర్థులమని దేశవాసులంతా ఇవాళ నిరూపించారుకున్నారు” అని ఆయన ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీచేసే సూచనలను ఇదే సంకల్పంతో ప్రజలంతా తూచా తప్పకుండా పాటించాలని కోరారు. దేశవ్యాప్తంగా దిగ్బంధం ప్రకటించిన రాష్ట్రాలు, జిల్లాల్లో నివసించే ప్రజలు ఎంతమాత్రం ఇల్లు కదలవద్దని, అదే సమయంలో ఇతర జిల్లాలవారు కూడా అత్యంత అవసరమైతే తప్ప గడపదాటి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
***
(रिलीज़ आईडी: 1607970)
आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam