మంత్రిమండలి

2018-19 లో స్వదేశ్ దర్శన్ స్కీము లో మంజూరు చేసిన 10 పథకాల కు 627.40 కోట్ల రూపాయల మేరకు నిధుల ను ఇచ్చేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

2019-20 లో నూతన పథకాల ను మంజూరు చేయడానికి మరో 1854.67 కోట్ల రూపాయలు విడుదల చేస్తారు

प्रविष्टि तिथि: 24 DEC 2019 4:24PM by PIB Hyderabad

స్వదేశ్ దర్శన్ స్కీము లో 2019-20 సంవత్సరం లో నూతన పథకాల ను మంజూరు చేసేందుకు అదనం గా 1854.67 కోట్ల రూపాయల తో పాటు 2018-19 సంవత్సరం లో మంజూరు చేసినటువంటి 10 పథకాలకు 627.40 కోట్ల రూపాయల మేరకు నిధుల ను విడుదల చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

స్వదేశ్ దర్శన్ స్కీము లో భాగం గా, భారతదేశాన్ని  ఒక ప్రపంచ శ్రేణి పర్యటక గమ్యస్థానం గా తీర్చి దిద్దేటందుకు కీలకమైన పర్యటక మౌలిక సదుపాయాల ను నిలుకడతనం కలిగినటువంటి రీతి లో మరియు అన్ని ప్రాంతాల కు ప్రాధాన్యం ఉండే తీరు న పర్యటన మంత్రిత్వ శాఖ అభివృద్ధిపరుస్తున్నది.  కీలకమైన పర్యటక మౌలిక సదుపాయాల ను వృద్ధిపరచడం వల్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టే పథకాల లో పెట్టుబడి పెట్టేందుకు ప్రైవేటు రంగాని కి ఉత్ప్రేరకం లభించినట్లు అవుతుంది.  అంతే కాక, ఇది పర్యటకుల కు మొత్తంమీద చక్కనైనటువంటి అనుభూతి ని మిగిల్చి ఆయా పర్యటక క్షేత్రాల కు యాత్రికుల రాక ను పెంచుతూ, రాబడి లో, ఉద్యోగ కల్పన లో వృద్ధి కి కూడా దారి తీస్తుంది.

పూర్వరంగం

2014-15 లో బడ్జెటు ప్రకటనల కు తరువాయి గా పర్యటన మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ స్కీమ్ (సెంట్రల్ సెక్టర్ స్కీమ్) ను 2015 జనవరి లో ప్రవేశపెట్టింది.  ఈ స్కీము లో భాగం గా అభివృద్ధిపరచడం కోసమని 15 సర్క్యూట్ ల ను గుర్తించడం జరిగింది.  ఆయా సర్క్యూట్ లు ఏవేవి అంటే హిమాలయన్ సర్క్యూట్, నార్త్ ఈస్ట్ సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్, కృష్ణా సర్క్యూట్, కోస్టల్ సర్క్యూట్, డిజర్ట్ సర్క్యూట్, ట్రైబల్ సర్క్యూట్, ఇకో సర్క్యూట్, వైల్డ్ లైఫ్ సర్క్యూట్, రూరల్ సర్క్యూట్, స్పిరిచువల్ సర్క్యూట్, రామాయణ సర్క్యూట్, హెరిటేజ్ సర్క్యూట్, తీర్థంకర్ సర్క్యూట్ తో పాటు సూఫీ సర్క్యూట్ లు.


**


(रिलीज़ आईडी: 1597553) आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam