మంత్రిమండలి
అంతరిక్ష శాస్త్ర రంగంలో ఇండియా థాయ్ ల్యాండ్ దేశాల మధ్యన కుదిరిన అవగాహన ఒప్పంద పత్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
प्रविष्टि तिथि:
12 JUN 2019 8:10PM by PIB Hyderabad
అంతరిక్ష శాస్త్రం/ అంతరిక్ష భౌతిక శాస్త్రం / వాతావరణ శాస్త్ర రంగాల్లో ఇండియా, థాయ్ లాండ్ దేశాల మధ్యన కుదిరిన అవగాహన ఒప్పంద పత్రానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఎంఓయు కారణంగా ఇరు దేశాల మద్యన శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారం, శిక్షణ పెరుగుతుంది. ఇరు దేశాలు ఉమ్మడిగా శాస్త్ర సాంకేతిక సౌకర్యాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. తద్వారా ఇరుదేశాల మధ్యన శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఫలితాలు వస్తాయి. మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది.
ఈ ఎంఓయు మీద సంతకాలు 2018 నవంబర్‌లో జరిగాయి.
***
(रिलीज़ आईडी: 1574506)
आगंतुक पटल : 93