57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ప్రపంచ సినీ రంగ సహకారాలను ప్రోత్సహించటంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వేవ్స్ ఫిల్మ్ బజార్

భారత సినీరూపకర్తలను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించేందుకు 20వ ఎడిషన్… రేపు గోవాలో ప్రారంభోత్సవ వేడుక

నాడు పోస్టు చేయడమైనది: 19 NOV 2026 8:22PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2339170Views: 13

2007లో 18 దేశాల నుంచి 204 మంది ప్రతినిధులతో సాధారణ సమావేశంగా మొదలైన ఫిల్మ్ బజార్... 2025 నాటికి 40కి పైగా దేశాల నుంచి 2,500 మందికిపైగా ప్రతినిధులను ఆహ్వానించే ప్రముఖ అంతర్జాతీయ వేదికగా ఎదిగింది. ఇది భారతీయ సినిమాను ప్రపంచ సినీ పరిశ్రమతో అనుసంధానించే కీలక వేదికగా మారింది. 20 ఏళ్ల ప్రస్థానంలో సృజనాత్మక సహకారాలను ప్రోత్సహించటం, నూతన కథలను ప్రదర్శించటం, భారతదేశ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను చూపటం వంటి రెండు దశాబ్దాల ప్రయాణాన్ని వేవ్స్ ఫిల్మ్ బజార్-2026 ఘనంగా జరుపుకుంటోంది.

సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ) నిర్వహించే ఈ వేవ్స్ ఫిల్మ్ బజార్... భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి)లో భాగం. విస్తృతమైన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌లో అంతర్భాగంగా ఉంది. 'క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్' దార్శనికతతో ఈ వేదిక భారతదేశ సృజనాత్మక సామర్థ్యాన్ని అంతర్జాతీయ అవకాశాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. సహ నిర్మాణం, నిధుల సమీకరణ, పంపిణీ, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా లక్ష్యాన్ని సాధిస్తుంది.

నవంబర్ 20, 2026న తాజ్ సిడాడే డి గోవా హారిజాన్‌‌లోని ది బాల్‌రూమ్‌లో వేవ్స్ ఫిల్మ్ బజార్ 20వ ఎడిషన్ ప్రారంభమవుతుంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ స్వాగతోపన్యాసం చేస్తారు. అనంతరం ఫెస్టివల్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ గోవారికర్ గౌరవ అతిథి ప్రసంగం చేస్తారు. ఎన్ఎఫ్‌డీసీ చైర్మన్ శ్రీ జి. కృష్ణకుమార్ ప్రారంభోపన్యాసం చేయగా... సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ సింగ్ కూడా పాల్గొంటారు. లాంఛనప్రాయ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఫిల్మ్ బజార్ బృందం 'నావిగేటింగ్ వేవ్స్ ఫిల్మ్ బజార్' అంశంపై ప్రెజెంటేషన్ ఇస్తుంది.

కథలకూ, ఇతర అవకాశాలకు వేదిక

నెట్‌వర్కింగ్ వేదికగా కాకుండా… సినీ రూపకర్తలు, నిర్మాతలు, పెట్టుబడిదారులు, పంపిణీదారులు, సేల్స్ ఏజెంట్లు, ఫెస్టివల్ ప్రోగ్రామర్లను అనుసంధానించే వ్యవస్థీకృత మార్కెట్ ప్లేస్‌గా ఎదిగింది. నిర్మాణ దశల్లో ఉన్న వివిధ చిత్రాలకు ఇది అండగా నిలుస్తోంది. ముఖ్యంగా ఎన్ఎఫ్‌డీసీ స్క్రీన్ రైటర్స్ ల్యాబ్, కో-ప్రొడక్షన్ మార్కెట్, వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రాజెక్టులకు మద్దతునిస్తుంది. వీటితో పాటు ప్రాజెక్టుల ఆవిష్కరణ, పరిశ్రమతో అనుసంధానం, నూతన సహకార అవకాశాలను ప్రదర్శన గది, మార్కెట్ ప్రదర్శనలు, ఎంపిక చేసిన బీ2బీ సమావేశాలు, అవగాహన సదస్సులు మరింత సులభతరం చేస్తాయి.

56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)తో పాటు నవంబర్ 20 నుంచి 24 వరకు గోవాలో జరిగిన 2025 ఎడిషన్‌కు 40కి పైగా దేశాల నుంచి 2,500 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 320 ప్రాజెక్టులను ప్రదర్శించగా, 220 మందికి పైగా కొనుగోలుదారులతో 1,200కు పైగా వ్యక్తిగత వ్యాపార సమావేశాలు జరిగాయి. ఈ వేదికకు అనుబంధంగా జరిగిన సుమారు రూ.100 కోట్ల విలువైన ఎంఓయూలతో కలిపి, వ్యాపార చర్చలు, సంప్రదింపుల మొత్తం విలువ దాదాపు రూ.1,050 కోట్లు ఉంటుందని అంచనా.

వేవ్స్ బజార్: వ్యాపార వేదిక ఒక్కటే కాకుండా ప్రజల చెంతకు కళాత్మకత

ఏటా జరిగే ఫిల్మ్ బజార్‌ను దాటి వేవ్స్ బజార్ ద్వారా వేవ్స్ కార్యక్రమం మరింత విస్తరించింది. జనవరి 2025లో ఇది ప్రారంభమైంది. ఏడాది పొడవునా పనిచేసే అంతర్జాతీయ బీ2బీ వేదిక ఇది. సినిమా, టెలివిజన్, ఓటీటీ, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, సంగీతం, ఇతర సృజనాత్మక రంగాలను కవర్ చేస్తూ… సృష్టికర్తలను, వ్యాపారాలను ఆసక్తి గల కొనుగోలుదారులు, భాగస్వాములతో కలుపుతుంది.

ఇది ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలకు విస్తరించటం వల్ల మన దేశంలోని సృజనాత్మక సంస్థలకు నూతన అవకాశాలు పెరిగాయి. గేమ్స్‌కామ్, టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, వెనిస్, మిప్‌కామ్ వంటి ప్రపంచస్థాయి వేదికల్లో పాల్గొనటం వల్ల విదేశీ భాగస్వాములతో సంబంధాలు బలోపేతం అయ్యాయి.

ఈ కార్యక్రమాలు భారత సృజనాత్మకతను కళా నైపుణ్యం నుంచి వ్యాపారం దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగం. దీనివల్ల కంటెంట్ క్రియేషన్, మేధో సంపత్తి, సృజనాత్మక రంగాల్లో ప్రపంచంలోనే ప్రధాన కేంద్రంగా భారత్ స్థానం మరింత బలపడుతుంది.

వేవ్స్ ఫిల్మ్ బజార్ ఇరవయ్యేళ్ల ప్రస్థానంలో స్వతంత్ర సినీ రూపకర్తలు, ప్రాంతీయ భాషా చిత్రాలు, నూతన ప్రతిభావంతులకు ఇది వేదికగా నిలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లను చేరుకోవటానికి, నూతన భాగస్వామ్యాలు ఏర్పరచుకునేందుకు, మన కథలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేర్చేందుకు ఇది సహకరిస్తోంది.

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2339170
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026