హోం మంత్రిత్వ శాఖ
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సీఏపీఎఫ్‌లు, సీపీఓలకు చెందిన 490 మంది సిబ్బందికి 2026 సంవత్సరానికి ‘కేంద్ర గృహమంత్రి దక్షత పతకం’ ప్రదానం
అత్యుత్తమ పనితీరును గుర్తించి, ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహిస్తూ, సంబంధిత అధికారులు, సిబ్బంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ‘కేంద్ర గృహమంత్రి దక్షత పతకం’
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో ప్రారంభించిన ఈ పతకం పోలీసు సిబ్బంది మనోధైర్యాన్ని మరింత పెంపొందించనుంది
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది అక్టోబర్ 31న ‘కేంద్ర గృహమంత్రి దక్షత పతకం’ ప్రకటింపు
నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2026 9:55AM by PIB Hyderabad
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌లు), కేంద్ర పోలీసు సంస్థలకు (సీపీఓలు) చెందిన 490 మంది సిబ్బందికి 2026 సంవత్సరానికి ‘కేంద్ర గృహమంత్రి దక్షత పతకం’ ప్రదానం చేశారు. అత్యుత్తమ పనితీరును గుర్తించడం, ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, సంబంధిత అధికారులు, సిబ్బంది మనోధైర్యాన్ని పెంపొందించడం ఈ పతకం లక్ష్యం.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో ప్రారంభించిన ‘కేంద్ర గృహమంత్రి దక్షత పతకం’ పోలీసు సిబ్బంది అందరి మనోధైర్యాన్ని మరింత పెంపొందిస్తుంది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2024 ఫిబ్రవరి 1న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ పతకాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పోలీసు బలగాలు, భద్రతా సంస్థలు, నిఘా విభాగాలు, ప్రత్యేక శాఖలు, కేంద్ర పోలీసు సంస్థలు (సీపీఓలు), కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్‌లు), జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ), అస్సాం రైఫిల్స్ సిబ్బందికి ఈ పతకాన్ని ప్రదానం చేస్తారు. అలాగే ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో (కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో) విశేష ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ శాస్త్రవేత్తలకు ఈ పతకం అందజేస్తారు. కార్యకలాపాల్లో అత్యుత్తమ ప్రతిభ, దర్యాప్తులో విశిష్ట సేవలు, అసాధారణ పనితీరు, నిఘా సేవల్లో అచంచలమైన ధైర్యసాహసాలు, ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో ప్రభుత్వ శాస్త్రవేత్తలు అందించిన ప్రశంసనీయమైన సేవలను గుర్తించి ఈ పతకాన్ని ప్రదానం చేస్తారు.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఈ పతకాన్ని ప్రకటిస్తారు.
అవార్డు గ్రహీతల జాబితా మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.. https://www.mha.gov.in
***
(రిలీజ్ ఐడి: 2330785)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Gujarati
,
Kannada
,
Assamese
,
Bengali
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Punjabi
,
Tamil
,
Malayalam