భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ఈ రోజు అంటే 26.09.2026న మధ్యాహ్నం 3 గం.లకు సమావేశమైన ఎన్నికల సంఘం: సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు

నాడు పోస్టు చేయడమైనది: 26 SEP 2026 5:36PM by PIB Hyderabad

    i. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్‌లో భాగంగా మ్యాపింగ్ కాని, సమాచారంలో తేడాలు ఉండటం లాంటి కారణాలతో నోటీసులు అందుకున్న వారి ఇళ్లను బీఎల్‌వోలు స్వయంగా సందర్శించి అవసరమైన పత్రాలను సేకరిస్తారు. ఆ తర్వాత ఈఆర్‌వో నిర్ణయం కోసం వాటిని ఈసీఐనెట్‌లో అప్‌లోడ్ చేస్తారు. అలాంటి వ్యక్తులు విచారణ కోసం ఈఆర్‌వో లేదా ఏఈఆర్‌వో కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. కేవలం ఈఆర్‌వో నిర్ణయించిన ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆన్‌లైన్ విధానానికి ప్రాధాన్యమిచ్చి విచారణ నిర్వహిస్తారు. అవసరమైతే ఓటరు తరఫున విచారణకు హాజరయ్యేందుకు వారి కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడికైనా విచారణకు అధికారం ఇవ్వొచ్చు. అలాగే ఆన్‌లైన్ విచారణకు అవసరమైన సౌకర్యాలను మరింత బలోపేతం చేయాలి.

 

        ii. అవసరాన్ని బట్టి నైట్ షెల్టర్లలో నివసించే వారు, కార్మికులు, పేదలు, నిరాశ్రయులు, ఇతరుల కోసం డీఈవోలు (జిల్లా ఎన్నికల అధికారులు) సరిపడినన్ని హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేయాలి/ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలి.

 

       iii. ఎస్ఐఆర్‌ కోసం ఫారం-6కు జత చేసిన డిక్లరేషన్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది. ఎస్ఐఆర్ జరగని సమయంలో ఈ ఫారాలను వర్తించే నియమాల (ఓటరు నమోదు నియమాలు-1960) ప్రకారం ఉపయోగిస్తారు.

       iv. క్షేత్రస్థాయి అధికారులకు వారి చట్టబద్ధమైన అధికారాలకు అనుగుణంగా ఈసీఐనెట్‌ పోర్టల్‌కు హోదా ఆధారిత అనుమతి ఉంటుంది. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఈసీఐనెట్ ఉందో లేదో నిర్దారించడానికి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ (డీఈసీ) నేతృత్వంలో ఏర్పాటైన, ఐఐటీ/ఐఐఎంకు చెందిన స్వతంత్ర నిపుణుడితో కూడిన కమిటీ సమీక్షించి నివేదికను సంఘానికి అందజేస్తుంది. గడచిన కొన్ని నెలలుగా రాష్ట్రాల సీఈవోలు అందిస్తున్న సూచనల ఆధారంగా పోర్టల్‌ను ఆధునికీకరించారు. క్షేత్రస్థాయి అధికారులకు మరింత సౌలభ్యం అవసరమైతే దాన్ని కూడా అమల్లోకి తీసుకువస్తారు. ఇకపై ఐటీ మాడ్యూళ్లు, పోర్టళ్లకు సంబంధించిన కొత్త విధానాలను కమిషన్ ఆమోదించే ముందు అధికారుల కమిటీ (సీవోవో)లో చర్చిస్తారు.

 

        v. ఢిల్లీ సీఈవో విజ్ఞప్తి మేరకు క్లెయిములు, అభ్యంతరాల దాఖలు గడువును 2026 అక్టోబర్ 30 వరకు, నోటీసులు, క్లెయిములు, అభ్యంతరాల పరిష్కార గడువును 2026 నవంబర్ 30 వరకు పొడిగించింది. అదేవిధంగా, మహారాష్ట్ర సీఈవో వినతి మేరకు ఆ రాష్ట్రంలో క్లెయిములు, అభ్యంతరాల దాఖలు గడువును 2026 అక్టోబర్ 12 వరకు పొడిగించింది. అక్కడ నోటీసులు, క్లెయిములు, అభ్యంతరాల పరిష్కార గడువును 2026 నవంబర్ 10 వరకు పొడిగించింది.

 

       vi. కమిషన్ నిర్వహించే సమావేశ అజెండాను ముందుగానే ప్రకటిస్తారు. సమావేశ నివేదికను జారీ చేస్తారు.

 

      vii. అధికారులందరి ఏపీఏఆర్‌లు (వార్షిక ప్రదర్శన మదింపు నివేదికలు) నిర్దేశిత కాలపరిమితి లోగా అంటే ప్రతి ఏటా డిసెంబర్ 31 లోపు పూర్తవుతాయి.

 

     viii. విదేశీ పర్యటనల నిమిత్తం అధికారులు ముందుగానే కమిషన్ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది.

 

       ix. కమిషనర్లు జారీచేసిన అన్ని ఆదేశాలను కమిషన్ అధికారులు కచ్చితంగా పాటించాలి.

2. బీహార్,పశ్చిమ బెంగాల్ సహా 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ఇప్పటికే పూర్తయింది. ఈ ప్రక్రియలో లేదా ఆ తర్వాత ఎవరి పేరైనా ఓటర్ల జాబితాలో చేరకుండా మిగిలిపోయినా, యువత/తొలిసారి ఓటు హక్కు పొందే వారైనా సరే తమ పేర్లను ఓటర్ల సవరణ ప్రక్రియలో నమోదు చేసుకోవడానికి సంబంధిత ఈఆర్‌వోకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను సులభతరం చేయాలని సీఈవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి ఓటర్ల నమోదు కోసం తక్షణమే ప్రత్యేక డ్రైవ్‌ను సీఈవోలు, డీఈవోలు, ఈఆర్‌వోలు ప్రారంభిస్తారు.

 

3. మరింత స్పష్టం చేసిన అంశాలు

 

                            i. క్యాబినెట్ కార్యదర్శికి రాసిన లేఖ కమిషన్ విధానపరమైన అంశాలకు లేదా విభాగానికి సంబంధించినది కాదు. అది ఈసీఐలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న అధికారి పనితీరుకు సంబంధించినది. సంబంధిత అధికారి జారీ చేసిన పని పునర్విభజన ఉత్తర్వులు వాస్తవానికి ఇద్దరు కమిషనర్ల ఆదేశాల అనంతరం అమలు కాలేదు. అలాగే ఐటీ విభాగంపై డీఈసీ పర్యవేక్షణను ఎన్నడూ ఉపసంహరించలేదు.

 

                           ii. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్‌తో సహా అనేక నిర్ణయాలను గత కొన్ని నెలల్లో కమిషన్ తీసుకుంది. బీహార్‌తో మొదలుపెట్టి, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ సహా మిగిలిన 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 24.6.2025న జారీ చేసిన ఎస్ఐఆర్ ఉత్తర్వులను కమిషన్ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనిని 27.5.2026న జారీ చేసిన ఆదేశాల్లో భారత సుప్రీంకోర్టు సమర్థించింది. కమిషన్ ఏకగ్రీవ ఆమోదంతోనే 27.10.2025న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్ఐఆర్ షెడ్యూల్ జారీ అయింది. మిగిలిన 19 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 14.05.2026న షెడ్యూల్ జారీ అయింది. మూడో దశలో మిగిలిన 12 రాష్ట్రాల్లోనూ తుది జాబితా ప్రచురణ పూర్తయిన అనంతరం మాత్రమే ఓటర్ల తుది సంఖ్య తెలుస్తుంది.

 

                          iii. మిగిలిపోయిన ఓటర్ల నుంచి ఫారాలను సేకరించేందుకు ఇంటింటికీ వెళ్లాలని బీఎల్‌వోలను గోవా సీఈవో ఆదేశించారు. నమోదు కోసం 97 మందిలో 81 మంది ఓటర్లు ఫారం-6ను సమర్పించారు.

 

4. 26.09.2026న నిర్వహించిన కమిషన్ సమావేశంలో నిర్ణయాలకు అనుగుణంగా ఈ పత్రికా ప్రకటన జారీ చేయడమైనది. దీనిని కమిషన్ ఆమోదించింది.

 

2026 సెప్టెంబర్ 26 మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ ఎస్ఎస్ సంధు, డాక్టర్ వివేక్ జోషి

 

****

 


(రిలీజ్ ఐడి: 2315362) సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam