సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

6 కోర్సులకు ఉపకార వేతనాలు... కథా రచయితలకు ఐఐసీటీ, నెట్‌ఫ్లిక్స్ మద్దతు

నాడు పోస్టు చేయడమైనది: 26 AUG 2026 12:40PM by PIB Hyderabad

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ), నెట్‌ఫ్లిక్స్ సంస్థలు... ఒక సంవత్సరం డిప్లొమానాలుగుఆరు నెలల సర్టిఫికెట్ కోర్సులతో కూడిన ఆరు ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌ల కోసం 80 శాతం వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, 100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను ప్రకటించాయి.

ఇంటరాక్టివ్ కామిక్స్-సీక్వెన్షియల్ ఆర్ట్స్విజువల్ ఎఫెక్ట్స్ మాస్టరీలలో డిప్లొమాలు... వర్చువల్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కంటెంట్ క్రియేషన్మీడియా టెక్ వర్క్‌ఫ్లోఆర్ట్ ఆఫ్ క్యారెక్టర్ యానిమేషన్-స్పోర్ట్స్గేమింగ్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికేట్ కోర్సులు ఈ ఉపకార వేతన పథకం కింద చేర్చిన ఆరు ప్రోగ్రామ్‌లలో భాగంగా ఉన్నాయి.

2026 ఆగస్టు 5న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీనెట్‌ఫ్లిక్స్ సహ-సీఈవో శ్రీ టెడ్ సరండోస్‌ల మధ్య జరిగిన సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడిందికథలు అద్భుతంగా వర్ణించి చెప్పగల గొప్ప సంప్రదాయంఅసాధారణ సృజనాత్మకత కలిగిన ప్రతిభావంతులు భారత్ సొంతమనీ... కంటెంట్ సృష్టికి ప్రపంచ కేంద్రంగా మన దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి వీరిని వినియోగించుకోవచ్చని శ్రీ మోదీ వ్యాఖ్యానించారుభారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థకు కీలక చోదకంగా పనిచేసే యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్-కామిక్స్ (ఏవీజీసీరంగంలో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలతో తదుపరి తరం కథకులను సన్నద్ధం చేయడం ద్వారా... భారతీయ సృజనాత్మక ప్రతిభావంతులను తీర్చిదిద్దడంలో పెట్టుబడి పెట్టాలనే లక్ష్యంతో నెట్‌ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ ఇనిషియేటివ్‌ను ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులుఉద్యోగస్తులకూ ఈ ఉపకార వేతనాలు అందుబాటులో ఉంటాయి.

ఐఐసీటీ అందించే విజువల్ ఎఫెక్ట్స్ మాస్టరీమీడియా టెక్ వర్క్‌ఫ్లో ప్రోగ్రామ్‌ల పాఠ్యప్రణాళికను... నెట్‌ఫ్లిక్స్ అందించిన సూచనలతోసమకాలీన పరిశ్రమ వర్క్‌ఫ్లోలుప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా రూపొందించారు.

సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిఐఐసీటీ బోర్డు ఛైర్మన్ శ్రీ చంచల్ కుమార్ మాట్లాడుతూ... "భారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ కీలక దశలో ఉందిసాంకేతికత కథలను సృష్టించే విధానాన్ని మారుస్తున్నందునతదుపరి తరం ప్రతిభను తీర్చిదిద్దే సంస్థలూ దానికి అనుగుణంగా పరిణామం చెందాలిదేశంలోని అపారమైన సృజనాత్మక ప్రతిభకువేగంగా మారుతున్న ప్రపంచ ఏవీజీసీ-ఎక్స్ఆర్ పరిశ్రమ అవసరాలకు మధ్య వారధిగా ఐఐసీటీని రూపొందించారుఆ వారధిని నిర్మించడంలో ప్రముఖ ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యాలు కీలకంఇటువంటి సహకారాలు పరిశ్రమ పరిజ్ఞానాన్ని తరగతి గదిలోకి తీసుకువస్తాయిభారత ప్రతిభను రేపటి సృజనాత్మక శ్రామిక శక్తిగా తీర్చిదిద్దడంలోనూ సహాయపడతాయి."

ఐఐసీటీ సీఈవో డాక్టర్ విశ్వాస్ డియోస్కర్ మాట్లాడుతూ... "ఐఐసీటీ వంటి సంస్థ ఉద్దేశం నైపుణ్యాలను అందించడంతో పాటుఅభివృద్ధి చెందుతున్న పరిశ్రమ విధానానికి ఆ నైపుణ్యాలు ఉపయోగపడేలా ఉండేలా చూడటంనెట్‌ఫ్లిక్స్‌తో ఈ సహకారం ఆ పరిశ్రమ దృక్పథాన్ని నేరుగా మా పాఠ్యప్రణాళిక రూపకల్పన విధానంలోకి తీసుకువస్తుందినిర్మాణాత్మక విద్యనుపరిశ్రమ ప్రత్యక్ష సహకారాన్నిఆర్థిక వనరుల లభ్యతను అనుసంధానించడం ద్వారా... అభివృద్ధి చెందుతున్న భారత సృజనాధారిత ఆర్థిక వ్యవస్థకు దోహదపడేందుకు సిద్ధంగా ఉన్న ప్రతిభావంతుల బలమైన వ్యవస్థను రూపొందించాలనే లక్ష్యాన్ని మేం నిర్దేశించుకున్నాంఅని అన్నారు.

దేశంలోని ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగం కోసం భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తిని నిర్మించేందుకుపరిశ్రమకు అనుగుణమైన ప్రతిభను అభివృద్ధి చేసే దిశగా ఎఫ్ఐసీసీఐ-ఐఐసీటీనెట్‌ఫ్లిక్స్ సంయుక్త సహకారం ఒక సానుకూల మార్పును సూచిస్తుందని ఎఫ్ఐసీసీఐ ఏవీజీసీ-ఎక్స్ఆర్ ఫోరమ్ ఛైర్మన్ ముంజల్ ష్రాఫ్ అన్నారు.

భారత ప్రభుత్వ సమాచారప్రసార మంత్రిత్వ శాఖమహారాష్ట్ర ప్రభుత్వంఎఫ్ఐసీసీఐసీఐఐల భాగస్వామ్యంతో స్థాపించిన ఐఐసీటీ... యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్రంగంలో భారత జాతీయ స్థాయి అత్యుత్తమ కేంద్రంగా ఉందిప్రస్తుతం ఈ సంస్థ ముంబయిలోని పెడ్డర్ రోడ్ చిరునామాలో గల ఎన్ఎఫ్‌డీసీ కాంప్లెక్స్ నుంచి కార్యకలాపాలు సాగిస్తోందిగోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో దీనికి సంబంధించిన 10 ఎకరాల శాశ్వత ప్రాంగణం అభివృద్ధి దశలో ఉందిఉపకారవేతనాలుప్రోగ్రామ్‌లను గురించిన మరింత సమాచారం కోసం iict.orgని సందర్శించండి.

 

* * *


(రిలీజ్ ఐడి: 2303561) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Tamil , Kannada , Malayalam