ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌లలోని ఎనిమిది జిల్లాల పరిధిలో నాలుగు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం; భారతీయ రైల్వే నెట్‌వర్క్ దాదాపు 410 కి.మీల మేర పెంపు
రూ. 9,450 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు 2030-31 నాటికి పూర్తి కానున్నాయి
प्रविष्टि तिथि:
19 AUG 2026 3:18PM by PIB Vijayawada
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, ఈ రోజు రూ. 9,450 కోట్ల అంచనా వ్యయంతో రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు ఇవే:
-
ఖరగ్‌పూర్ - భద్రక్ (రాణితాల్) 4వ లైన్ - 173 కి.మీ (పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా)
-
భద్రక్ - హరిదాస్‌పూర్ 4వ లైన్ - 75 కి.మీ (ఒడిశా)
-
గుమ్మిడిపూండి - గూడూరు 3వ మరియు 4వ లైన్ - 90 కి.మీ (ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు)
-
కటక్ - పారాదీప్ (బడాబంధ) 3వ మరియు 4వ లైన్ - 72 కి.మీ (ఒడిశా)
లైన్ సామర్థ్యం పెరుగుదల వల్ల రవాణా సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది, ఫలితంగా భారతీయ రైల్వే కార్యచరణ సామర్థ్యం, సేవల విశ్వసనీయత మెరుగుపడతాయి. ఈ మల్టీ-ట్రాకింగ్ ప్రతిపాదనలు రైలు కార్యకలాపాలను సులభతరం చేయడానికి, రద్దీని తగ్గించడానికి దోహదపడతాయి. సమగ్ర అభివృద్ధి ద్వారా ప్రాంతీయ ప్రజలకు ఉపాధి/స్వయం ఉపాధి అవకాశాలను పెంచి, వారిని “ఆత్మనిర్భర్”గా మార్చేలా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ‘నవ భారత్’ విజన్‌కు అనుగుణంగా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి.
సమగ్ర ప్రణాళిక, వాటాదారుల సంప్రదింపుల ద్వారా మల్టీ-మోడల్ కనెక్టివిటీ, లాజిస్టిక్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో పిఎం-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఆధారంగా ఈ ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. ఇవి ప్రజలు, వస్తువులు మరియు సేవల రవాణాకు అంతరాయం లేని అనుసంధానాన్ని అందిస్తాయి.
పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 08 జిల్లాల పరిధిలో ఉన్న ఈ 04 (నాలుగు) ప్రాజెక్టులు భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను దాదాపు 410 కిలోమీటర్ల మేర పెంచుతాయి. ప్రతిపాదిత మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులు దాదాపు 60 లక్షల జనాభా ఉన్న సుమారు 6,448 గ్రామాలకు కనెక్టివిటీని పెంచుతాయి.
ఈ ప్రతిపాదిత సామర్థ్యం పెంపుదల వల్ల కుల్దిహా వన్యప్రాణుల అభయారణ్యం, భితార్కనిక జాతీయ ఉద్యానవనం, మా భద్రకాళి ఆలయం, మా ధమరాయ్ ఆలయం, పంచలింగేశ్వర్ ఆలయం, తాల్సరి-ఉదయ్‌పూర్ మరియు చాందీపూర్ బీచ్, పులికాట్ సరస్సు, నెలపట్టు పక్షుల అభయారణ్యం, లార్డ్ వీరరాఘవ పెరుమాళ్ ఆలయం, గడ కుజంగ జగన్నాథ ఆలయం, సరళ ఆలయం, ధవళేశ్వర్ ఆలయం, లలితగిరి (బౌద్ధ క్షేత్రం) వంటి దేశంలోని అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుంది.
బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్, ఇనుము మరియు ఉక్కు, కంటైనర్, ఆటోమొబైల్, ఆహార ధాన్యాలు మొదలైన సరుకుల రవాణాకు ఈ ప్రాజెక్టులు అత్యంత కీలకమైన మార్గాలు. సామర్థ్యం పెంపుదల పనుల వల్ల ఏటా అదనంగా 76 మిలియన్ టన్నుల (MTPA) సరుకు రవాణా జరుగుతుంది. పర్యావరణ అనుకూలమైన, శక్తివంతమైన రవాణా మార్గమైన రైల్వేలు, వాతావరణ లక్ష్యాలను సాధించడంలో, దేశ లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది చమురు దిగుమతిని తగ్గించడమే కాకుండా (~13 కోట్ల లీటర్లు) CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది (~65 కోట్ల కిలోలు), ఇది 2.60 కోట్ల చెట్లను నాటడంతో సమానం.
***
(रिलीज़ आईडी: 2301185)
आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam