జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత చేనేత రంగంలో అత్యుత్తమ విజయాలను గుర్తిస్తూ

జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈ నెల 7న చేనేత పురస్కారాలు-2025 ప్రదానం చేయనున్న భారత రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 04 AUG 2026 6:53PM by PIB Hyderabad

జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా భారత రాష్ట్రపతి ఈ నెల 7న ప్రతిష్ఠాత్మక చేనేత పురస్కారాలను ప్రదానం చేస్తారు.

కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్సీనియర్ అధికారులుచేనేత పరిశ్రమ ప్రతినిధులుప్రముఖ నేత కార్మికులుడిజైనర్లుఎగుమతిదారులుకళాకారులుఇతర విశిష్ట అతిథులూ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

దేశపు గొప్ప చేనేత సంప్రదాయాలను పరిరక్షించడంప్రోత్సహించడంఅభివృద్ధి చేయడం కోసం విశేష కృషి చేసిన మొత్తం 22 మంది పురస్కార గ్రహీతల్లో... ముగ్గురికి సంత్ కబీర్ చేనేత పురస్కారాలు19 మందికి జాతీయ చేనేత పురస్కారాలను అందిస్తారు.

చేనేత రంగంలో విశేష సేవలకు గుర్తింపు

చేనేత రంగానికి అనుబంధంగా ఉన్న నేతపనిఆవిష్కరణలుడిజైన్ రూపకల్పనమార్కెటింగ్ కార్యక్రమాలుఅంకురసంస్థలుఉత్పత్తిదారుల కంపెనీల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తిస్తూ... సంత్ కబీర్ చేనేత పురస్కారాలుజాతీయ చేనేత పురస్కారాలు-2025 గ్రహీతల వివరాలను జౌళి శాఖ ప్రకటించింది.

జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమానికి చెందిన చేనేత మార్కెటింగ్ సహాయం (హెచ్ఎమ్ఏవిభాగం కింద ఈ పురస్కారాలను ఏర్పాటు చేశారుచేనేత రంగంలో చేసిన విశిష్ట కృషికి జాతీయ స్థాయి అత్యున్నత గుర్తింపును ఈ పురస్కారాలు సూచిస్తాయి.

భారత చేనేత వారసత్వాన్ని గణనీయంగా బలోపేతం చేయడం సహా దేశీయఅంతర్జాతీయ మార్కెట్లలో దాని సామర్థ్యాన్ని పెంపొందించిన వ్యక్తులుసంస్థలను గౌరవించేందుకు గానూ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు.

ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పార్లమెంట్ సభ్యులుప్రభుత్వ ఉన్నతాధికారులుపరిశ్రమ నిపుణులువిద్యాసంస్థలుఎగుమతిదారులుడిజైనర్లుచేనేత కార్మికులు హాజరవుతారని భావిస్తున్నారు.

చేనేత పురస్కారాలు

చేనేత రంగంలో విశేష కృషిఆవిష్కరణలునిరంతర నిబద్ధతను ప్రోత్సహించడమే చేనేత పురస్కారాల ఉద్దేశంఇవి అత్యుత్తమ హస్తకళా నైపుణ్యంసాంప్రదాయిక నైపుణ్యాలను పరిరక్షిస్తూనే ఆధునిక పద్ధతులను అవలంబించడంఉత్పత్తి వైవిధ్యండిజైన్ ఆవిష్కరణనేత కార్మికుల సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తిస్తాయి.

సంత్ కబీర్ చేనేత పురస్కారం

ఈ పురస్కారం... భారత నేత సంప్రదాయాల పరిరక్షణప్రోత్సాహం కోసం అసాధారణ పనితనంజీవితకాల అంకితభావం ప్రదర్శించిన చేనేత కార్మికులకు గుర్తింపునిచ్చే జాతీయ స్థాయి అత్యున్నత పురస్కారం.

అసాధారణ నైపుణ్యాలుఆవిష్కరణలుచేనేత రంగానికి నిరంతర సహకారంసాంప్రదాయిక నేత పద్ధతులకు ప్రోత్సాహంకళాకారులకు మార్గదర్శనంసమాజ అభివృద్ధి కోసం చేసిన కృషి ఆధారంగా పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తారు.

ఈ పురస్కారంతో అందించేవి-

  • బంగారు నాణెం

  • తామ్రపత్రం

  • శాలువా

  • సర్టిఫికెట్ 

జాతీయ చేనేత పురస్కారం

చేనేత రంగంలో అత్యుత్తమ సృజనాత్మకతనాణ్యతఆవిష్కరణఅత్యుత్తమ పనితీరును కనబరిచిన చేనేత కార్మికులుఇతర సంబంధిత వ్యక్తులను ఈ జాతీయ చేనేత పురస్కారంతో గౌరవిస్తారు.

భారత విభిన్న చేనేత సంప్రదాయాలను పరిరక్షిస్తూనే... హస్తకళఉత్పత్తి రూపకల్పనమార్కెట్ విస్తరణలో ప్రమాణాలను నిరంతరం ఉన్నతీకరించడానికి కళాకారులనుసంస్థలను ప్రోత్సహించడమే ఈ పురస్కార లక్ష్యం.

ఈ పురస్కారంతో అందించేవి-

తామ్రపత్రం

శాలువా

సర్టిఫికెట్ 

ఎంపిక ప్రక్రియ

జోనల్ కార్యాలయంప్రధాన కార్యాలయంకేంద్ర స్థాయి ఎంపిక కమిటీలతో కూడిన కఠినమైన బహుళ-స్థాయి మూల్యాంకన ప్రక్రియ ద్వారా నేత విభాగంలో పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తారుఈ కమిటీల్లో అనుభవజ్ఞులైన నిపుణులుసాంకేతిక నిపుణులుప్రభుత్వ ఉన్నతాధికారులు ఉంటారువీరు నిర్దేశించిన అర్హత ప్రమాణాలుమూల్యాంకన పారామితుల ఆధారంగా నామినేషన్లను పరిశీలిస్తారు.

డిజైన్ రూపకల్పనమార్కెటింగ్అంకురసంస్థలుఉత్పత్తిదారుల కంపెనీలకు సంబంధించిన కేటగిరీల కోసం నామినేషన్లను తుది ఆమోదానికి ముందు ప్రధాన కార్యాలయ కమిటీకేంద్ర స్థాయి కమిటీ ద్వారా ఒక క్రమపద్ధతిలో మూల్యాంకనం చేస్తారు.

చేనేత రంగంలోని అన్ని విభాగాల్లో పారదర్శకతనిష్పాక్షికతనిజమైన శ్రేష్ఠతకు గుర్తింపును ఈ ఎంపిక విధానం నిర్ధారిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2294578) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Gujarati , Kannada , Malayalam