మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు - 2026’.. నామినేషన్ల తుది గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు
జాతీయ పురస్కారాల వెబ్‌సైట్ https://awards.gov.in ద్వారానే నామినేషన్లు సమర్పించాలి
प्रविष्टि तिथि:
31 JUL 2026 2:03PM by PIB Hyderabad
‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు (పీఎమ్‌బీఆర్‌పీ)- 2026’కు ఆన్‌లైన్లో నామినేషన్లను దాఖలు చేయడానికి ఆఖరి తేదీని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ పొడిగించింది. ఇంతకు ముందు ఈ గడువును 2026 జులై 31గా ఖరారు చేయగా, తాజాగా 2026 ఆగస్టు 31గా ఖాయం చేశారు. పీఎమ్‌బీఆర్‌పీ నామినేషన్ల ప్రక్రియ జాతీయ పురస్కారాల వెబ్‌సైట్ ( (https://awards.gov.in) ద్వారా 2026 ఏప్రిల్ 1న మొదలైంది.
సాహసం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగం, సైన్స్, టెక్నాలజీ రంగాలలో అసాధారణంగా రాణించి విజయాలు సాధించిన బాలలకు ఈ పురస్కారాలను ఇస్తారు.
భారత్‌లో నివసించే పౌరులలో 5 ఏళ్ల వయసు పైబడిన వారు, 2026 జులై 31 నాటికి 18 ఏళ్ల వయసు మించని వారు ఈ పురస్కారాలకు అర్హులు. స్వీయ నామినేషన్లను గాని, లేదా పౌరుల్లో ఎవరైనా సిఫార్సు చేసిన మేరకు గాని.. నామినేషన్లను జాతీయ అవార్డుల పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.
మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి జాతీయ పురస్కారాల వెబ్‌సైట్ https://awards.gov.in ను సందర్శించవచ్చు.
***
(रिलीज़ आईडी: 2292567)
आगंतुक पटल : 8