ప్రధాన మంత్రి కార్యాలయం
2026 కామన్వెల్త్ క్రీడల్లో రజత పతక విజేత సర్వేశ్ కుశారే.. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
28 JUL 2026 2:10PM by PIB Hyderabad
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల హై జంప్ పోటీలో రజత పతకాన్ని గెలుచుకున్న సర్వేశ్ కుశారేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
సర్వేశ్ కుశారే దృఢ సంకల్పాన్నీ, అనేక సార్లు అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్న తీరునీ ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ విజయం అసాధారణ విజయమని ప్రధాని అన్నారు.
సర్వేశ్‌ను చూసి భారత్ ఆనందిస్తోందని శ్రీ మోదీ అన్నారు. రాబోయే కాలంలో కూడా సర్వేశ్ కుశారే మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని అభిలషించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:
‘‘2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల హై జంప్ పోటీలో అద్భుతమైన మరో రజత పతకాన్ని సర్వేశ్ కుశారే గెలుచుకున్నారు. ఆయన దృఢ సంకల్పంతో పాటు, వరుసగా శ్రేష్ఠ ప్రదర్శనను కనబరుస్తున్న తీరు ప్రశంసనీయం. ఈ అసాధారణ విజయానికి గాను ఆయనకు అభినందనలు. ఆయనను చూసి భారత్ సంతోషిస్తోంది. ముందు ముందు ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2290449)
సందర్శకుల సూచీ సంఖ్య : : 42
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam