మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు-2026... నామినేషన్లకు ఆహ్వానం దరఖాస్తు దాఖలుకు తుది గడువు జులై 31

నాడు పోస్టు చేయడమైనది: 02 JUL 2026 1:10PM by PIB Hyderabad

‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు (పీఎమ్ఆర్‌బీపీ)-2026’కు నామినేషన్లను పంపించాల్సిందిగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరోసారి కోరింది. దరఖాస్తులను పంపించడానికి ఆఖరి తేదీ 2026 జులై 31. పీఎమ్ఆర్‌బీపీకి నామినేషన్లను ఆన్‌లైన్‌లో https://awards.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

క్రీడలు, సామాజిక సేవ, విజ్ఞ‌ానశాస్త్రం, సాంకేతిక విజ్ఞ‌ానం, పర్యావరణం, కళలు, సాంస్కృతిక రంగాలలో అసాధారణంగా రాణించి విజయాలు సాధించిన 5- 18 ఏళ్ల వయసున్న వారిని గౌరవించడానికి ఏర్పాటు చేసిన విశిష్ట పురస్కారాలు ఇవి. క్లిష్ట పరిస్థితులలో అమిత ధైర్య సాహసాలను కనబరిచిన వారికి కూడా ఈ పురస్కారాలను అందిస్తారు.

ఈ అవార్డుకు అర్హత ఉందని భావిస్తున్న అభ్యర్థులను- పౌరులు, పాఠశాలలు, సంస్థలు నామినేట్ చేయవచ్చు. బాలలు తమను తాము కూడా నామినేట్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరణ ఈ కింది విధంగా ఉంది:

· తుది గడువు: 2026 జులై 31

· పద్ధతి: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి

· వెబ్‌సైటు: https://awards.gov.in

దరఖాస్తుదారులు ప్రాథమిక వ్యక్తిగత వివరాలను పేర్కొనడంతో పాటు నామినేషనును దాఖలు చేస్తున్న పురస్కారం ఏ కేటగిరీదో కూడా ప్రస్తావించి ఇటీవలి ఫోటోను, సహాయక దస్తావేజులను అప్‌లోడ్ చేయాలి. వారు తమ విజయాన్నీ, అది చూపిన ప్రభావాన్నీ వివరించే కథనాన్ని (ఇది 1000 పదాల లోపు ఉండాలి) కూడా సమర్పించాలి.

పురస్కారాలకు యోగ్యులైన వారిని గుర్తించి నామినేట్ చేయాల్సిందిగా స్కూళ్లను, యువజన బృందాలను, ఎన్‌జీఓలను, పంచాయతీలను, వ్యక్తులను మంత్రిత్వ శాఖ కోరుతోంది.

రండి.. మనమందరం కలిసి భారత్‌‌లో అతి పిన్న వయస్సులో అసాధారణ విజయాలను సాధించిన వారికి తగిన గుర్తింపు వచ్చేట్లు చూద్దాం.

 

***


(రిలీజ్ ఐడి: 2280300) సందర్శకుల సూచీ సంఖ్య : : 73