ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ ఇన్నొవేట్స్ ప్రసంగ ముఖ్యాంశాలను ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 JUN 2026 8:05PM by PIB Hyderabad
ఫ్రాన్స్‌లో భారత్ ఇన్నొవేట్స్ కార్యక్రమం సందర్భంగా తాను చేసిన ప్రసంగం ముఖ్యాంశాలను ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ వరుసగా కొన్ని సందేశాలను పొందుపరుస్తూ:
‘‘భారత్ రండి.
మాతో కలిసి పనిచేయండి.
భారత్‌లో డిజైన్ చేయండి.
భారత్‌లో అభివృద్ధి చేయండి.
ప్రపంచానికి అవసరమైన పరిష్కారాలను కనుగొనండి.
‘‘నూతన ఆవిష్కరణలు భారత్ డీఎన్ఏలోనే ఉన్నాయి.
భారతదేశ యువత అనేక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు సారథులుగా ఉన్నారు. వారు ప్రపంచానికి ఎదురవుతున్న తీవ్ర సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటున్నారు.
‘‘విశ్వసనీయంగా ఉంటూ, అన్ని వర్గాలకూ సమానంగా అందగలిగే, మానవజాతి హితంతో పాటు అంతర్జాతీయ ప్రయోజనాలకు అంకితం చేయదగిన సాంకేతికతల కోసం ప్రపంచం ప్రస్తుతం ఎదురుచూస్తోంది.
‘‘ఈ తరుణంలో, భారత్ ప్రాధాన్యం సుష్పష్టం... మానవాళి కోసం ఉద్దేశించిన సాంకేతికత, మానవ ప్రయోజనాలకు ప్రాధాన్యాన్నిచ్చే నూతన ఆవిష్కరణలు.
‘‘పెద్ద ఎత్తున, శరవేగంగా నూతన ఆవిష్కరణలకు భారత్ నడుం బిగించింది.
దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నూతన ఆవిష్కరణలకు భారత్ సిద్ధంగా ఉంది.
ప్రపంచ అవసరాలకు ప్రాధాన్యాన్నిస్తూ, భారత్ నూతన ఆవిష్కరణల మార్గంలో ముందుకు సాగుతోంది’’
అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2272884)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam