సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
జైసల్మేర్‌లోని రామ్‌గఢ్‌లో 20 కిలోవాట్ల ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్‌మిటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్
రేడియో ప్రసారాలు ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా, ప్రభావవంతంగా కొనసాగాలంటే ‘డిజిటల్ ఫస్ట్’, ‘హైపర్-లోకల్’ విధానాలను అవలంబించాలి: శ్రీ వైష్ణవ్
సరిహద్దు ప్రాంతాల్లో ప్రసార మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ... ‘కాశ్మీర్ నుంచి కచ్’ వరకు అనుసంధానతను పెంపొందించే ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడమే కొత్త ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్ లక్ష్యం
प्रविष्टि तिथि:
11 JUN 2026 3:57PM by PIB Hyderabad
కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ నేడు జైసల్మేర్‌లోని రామ్‌గఢ్‌లో 20 కిలోవాట్ల ఆకాశవాణి ఎఫ్ఎం ట్రాన్స్‌మిటర్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

ఈ కొత్త ట్రాన్స్‌మిటర్ చేరికతో రాజస్థాన్‌లోని ఎఫ్ఎం ట్రాన్స్‌మిటర్ల సంఖ్య 39కి చేరుకుంది. సరిహద్దు ప్రాంతమైన రామ్‌గఢ్‌లోని ఈ ట్రాన్స్‌మిటర్ 80 కిలోమీటర్ల పరిధిలో రేడియో ప్రసారాలు అందేలా చూస్తుంది. దీని ద్వారా జైసల్మేర్ జిల్లాలోని దాదాపు 20,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రజలకు ప్రసారాలు అందుతాయి. ఇది ఆ ప్రాంత ప్రజలకు వివిధ రకాల సమాచార, విద్యా, వినోద కార్యక్రమాలను అందుబాటులోకి తెస్తుంది.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రసార భారతి పనితీరులో, ఆలోచనా విధానంలో మార్పులు రావాలని పిలుపునిచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక యుగంలో రేడియో ప్రసారాలు ప్రజలకు మరింత దగ్గరగా, ప్రభావవంతంగా ఉండాలంటే అవి ‘డిజిటల్ ఫస్ట్’ (డిజిటల్ మాధ్యమాలకు ప్రాధాన్యత), ‘హైపర్-లోకల్’ (స్థానిక అంశాలకు పెద్దపీట) విధానాలను అవలంబించాలని చెప్పారు. ఈ మార్పు కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక కళాకారులను, చేతివృత్తుల వారిని ఈ ప్రసార వ్యవస్థలో భాగస్వామ్యం చేయడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు.
జైపూర్‌లో త్వరలో ఏర్పాటు కానున్న ఏఐ డేటా సెంటర్ గురించి కూడా కేంద్రమంత్రి ప్రస్తావించారు. ఇది భవిష్యత్తుకు బలమైన పునాదిగా, సాంకేతిక పురోగతి దిశగా తీసుకున్న కీలక చర్యగా ఆయన అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో ప్రసార భారతి ఛైర్మన్ ప్రసూన్ జోషి మాట్లాడుతూ... ఆకాశవాణి, దూరదర్శన్ వంటి సంస్థలకు ఉన్న నిరంతర ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సంస్థలు సమాజ మూలాలతో ముడిపడి ఉన్నాయని, విస్తృతమైన ప్రజానీకానికి సమాచారాన్ని చేరవేయడంలో, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

సరిహద్దు ప్రాంతాలలో ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ప్రసారాల పరిధిని బలోపేతం చేయడమే ఈ కొత్త ట్రాన్స్‌మిటర్ లక్ష్యం. ఇది కేవలం జైసల్మేర్‌కే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా సేవలను అందిస్తూ, సరిహద్దు కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల్లో కీలక ముందడుగుగా నిలుస్తుంది. ఈ ప్రయత్నం ‘కాశ్మీర్ నుంచి కచ్’ వరకు ప్రత్యేక ప్రసార మౌలిక సదుపాయాలను విస్తరించాలనే దార్శనికతకు అనుగుణంగా ఉంది. ఇది మొత్తం సరిహద్దు ప్రాంతంలో ప్రసార సేవలను క్రమపద్ధతిలో విస్తరించేలా నిర్ధారిస్తుంది.
ఈ కార్యక్రమంలో ప్రసార భారతికి చెందిన యువ అధికారులతో శ్రీ వైష్ణవ్ ముచ్చటించారు. ఆకాశవాణి జైపూర్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలో రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి హీరాలాల్ నగర్, జైపూర్ ఎంపీ మంజు శర్మ, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ పాల్గొన్నారు. జైసల్మేర్ ఎంపీ ఉమేదరమ్ బెనివాల్ కూడా ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా చేరారు.
***
(रिलीज़ आईडी: 2271742)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam