హోం మంత్రిత్వ శాఖ
ఎన్నికైన పీఎంగా దేశంలో సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవ చేస్తూ చరిత్రాత్మక ఘనతను సాధించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
భారతదేశ ఆత్మగౌరవ పునరుజ్జీవం, సాంస్కృతిక పునరుద్ధరణ, వలసవాద మనస్తత్వం నుంచి విముక్తికి గుర్తుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన
దేశ పౌరులకు భద్రత కల్పించటం, వారు కోల్పోయిన ఆత్మ గౌరవాన్ని, హుందాతనాన్ని తిరిగి అందించటమే పీఎం మోదీ విజయం
సంకల్పం నుంచి విజయానికి, సేవ నుంచి సుపరిపాలనకు సాగిన ప్రయాణానికి ప్రతీక పీఎం మోదీ నాయకత్వం
పీఎం మోదీ నాయకత్వంలో ఆత్మవిశ్వాసం, అభివృద్ధి, ప్రపంచ ప్రతిష్ఠలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన భారత్
प्रविष्टि तिथि:
10 JUN 2026 3:43PM by PIB Hyderabad
ఎన్నికైన ప్రధానమంత్రిగా దేశంలో సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవ చేస్తూ చరిత్రాత్మక ఘనతను సాధించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు. "దేశంలో సుదీర్ఘ కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా ప్రజలకు సేవ చేస్తూ చరిత్రాత్మక ఘనతను సాధించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు, అభినందనలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన.. భారతదేశ ఆత్మగౌరవ పునరుజ్జీవనం, సాంస్కృతిక పునరుద్ధరణ, వలసవాద మనస్తత్వం నుంచి విముక్తికి గుర్తుగా నిలిచింది. కొత్త పార్లమెంటు భవనం నిర్మితమైంది. మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. మాతృభాషలో వైద్య, ఇంజినీరింగ్ విద్యకు మార్గం సుగమం అయింది. ఆత్మనిర్భర్ భారత్ ప్రతి భారతీయుడి సంకల్పంగా మారింది. ఈ 12 ఏళ్ల కాలంలో దేశ సరిహద్దులు మరింత సురక్షితంగా మారాయి. కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దైంది. రామ మందిరం నిర్మితమైంది. నక్సలిజం, ఉగ్రవాదంపై నిర్ణయాత్మక విజయాన్ని పొందాం. ప్రతి ఉగ్రవాద ఘటనకు తగిన రీతిలో స్పందిస్తూ బలంగా ఎదుర్కొన్నాం. అదే సమయంలో దేశ ప్రజల సామూహిక శక్తి.. న్యూనతా భావం నుంచి బయటపడి వారసత్వం, సంస్కృతి, సామర్థ్యాల పట్ల గర్వించటం నేర్చుకుంది. దేశ పౌరులకు భద్రతను కల్పించటంతో పాటు వారు కోల్పోయిన ఆత్మ గౌరవాన్ని, హుందాతనాన్ని తిరిగి అందించటమే మోదీ జీ సాధించిన అతిపెద్ద విజయం. నేడు ప్రతి అంతర్జాతీయ వేదికపై పూర్తి ఆత్మవిశ్వాసంతో నవ భారతం గుర్తింపును చాటుకుంటోంది. సమర్థవంతమైన, దృఢమైన, పరివర్తనాత్మక భారత్ ఎదుగుదలను ప్రపంచం చూస్తోంది".
"మోదీ జీ నాయకత్వం సంకల్పం నుంచి విజయానికి, సేవ నుంచి సుపరిపాలనకు సాగిన ప్రయాణానికి ప్రతీక. ఆయన నాయకత్వంలో ఆత్మవిశ్వాసం, అభివృద్ధి, ప్రపంచ ప్రతిష్ఠలో కొత్త ప్రమాణాలను భారత్ నెలకొల్పింది" అని మరో పోస్టులో కేంద్రమంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2271221)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam