ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

22వ ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ క్రీడల్లో


19 పతకాలు గెలిచిన భారత బృందానికి ప్రధాని అభినందనలు

प्रविष्टि तिथि: 01 JUN 2026 12:47PM by PIB Hyderabad

22వ ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ క్రీడల్లో అద్భుతంగా రాణించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఛాంపియన్‌షిప్‌లో 10 స్వర్ణాలతో సహా 19 పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.

భారతీయ యువ అథ్లెట్ల సంకల్పాన్నీప్రతిభనీ ఈ విజయం ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి అన్నారుభవిష్యత్తులో మరింత మంది క్రీడాకారులు తయారయ్యేందుకు ఈ విజయాలు భారతీయ యువతకు స్ఫూర్తినిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా అన్నారు:

‘‘22వ ఆసియా అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో 10 స్వర్ణాలతో సహా 19 పతకాలు గెలిచిన భారత బృందానికి అభినందనలుభారతీయ యువ క్రీడాకారుల సంకల్పాన్నీప్రతిభనీ ఈ అత్యుత్తమ ప్రదర్శన ప్రతిబింబిస్తోందిభవిష్యత్తులో మరింత మంది క్రీడలవైపు వచ్చేందుకు భారతీయ యువతకు ఈ విజయాలు స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నాను.’’

***


(रिलीज़ आईडी: 2267476) आगंतुक पटल : 124
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Tamil , Kannada , Malayalam , Assamese , Bengali , Bengali-TR , Odia , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Gujarati