ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మణిపూర్‌లోని ఇంఫాల్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 13 SEP 2025 6:26PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

భారత్ మాతా కీ జై!

గౌరవ మణిపూర్ గవర్నర్ శ్రీ అజయ్ భల్లా గారూరాష్ట్ర పరిపాలన యంత్రాంగంలోని ఇతర అధికారులూమణిపూర్ సోదరీ సోదరులారా... అందరికీ నమస్కారం.

మణిపూర్ అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలుశంకుస్థాపనలు ఈ రోజు జరిగాయిఈ ప్రాజెక్టులు మీ జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయిఇక్కడి మౌలిక సదుపాయాలను అవి బలోపేతం చేస్తాయిఈ నేల బిడ్డలైన మణిపూర్ యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.

మిత్రులారా,

ఈ రోజు ప్రారంభించిన పనుల్లో రెండు ప్రాజెక్టులు చాలా ప్రత్యేకంఅవి రూ. 3,600 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన ‘మణిపూర్ పట్టణ రహదారుల ప్రాజెక్టు’రూ. 500 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన మణిపూర్ ఇన్ఫోటెక్ అభివృద్ధి ప్రాజెక్టుఈ ప్రాజెక్టులు ఇంఫాల్‌లో రహదారి మౌలిక సదుపాయాలను బలోపేతం చేసిమణిపూర్ ఉజ్వల భవితకు కొత్త శక్తినిస్తాయిఈ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా మణిపూర్ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలుశుభాకాంక్షలు.

మిత్రులారా,

స్వాతంత్ర్యానంతరం దేశంలోని ఉత్తరదక్షిణ ప్రాంతాల్లోని ముఖ్య నగరాలు అభివృద్ధి చెందాయిఅక్కడ ప్రజల కలలు నెరవేరి యువతకు కొత్త అవకాశాలు అందాయిఇప్పుడు తూర్పుఈశాన్య ప్రాంతాలదే ఈ 21వ శతాబ్దంఅందుకే భారత ప్రభుత్వం మణిపూర్ అభివృద్ధికి నిరంతరం ప్రాధాన్యమిస్తూ వస్తోందిఫలితంగా మణిపూర్ వృద్ధి రేటు స్థిరంగా పెరుగుతోంది. 2014కు ముందు మణిపూర్ వృద్ధి రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండేదికనీసం ఒక శాతం కూడా ఉండేది కాదుకానీ నేడు మణిపూర్ మునుపటి కన్నా ఎన్నో రెట్లు వేగంగా పురోగమిస్తోందిమణిపూర్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఓ కొత్త శకం మొదలైందిమణిపూర్‌లో జాతీయ రహదారులు సహా రోడ్ల నిర్మాణం అనేక రెట్లు వేగం పుంజుకోవడం సంతోషాన్నిస్తోందిరాష్ట్రవ్యాప్తంగా గ్రామాలను రోడ్లతో అనుసంధానించే పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

మిత్రులారా,

ఎన్నో అవకాశాలు నిండిన నగరం ఇంఫాల్మన యువత కలలను నెరవేర్చిదేశాభివృద్ధిని వేగవంతం చేసే వికసిత భారత నగరాల్లో ఇంఫాల్ ఒకటిగా నేను భావిస్తున్నానుఇదే దృక్కోణంతో స్మార్ట్ సిటీ మిషన్ కింద అనేక ప్రాజెక్టులను ఇక్కడ పూర్తిచేశాంవందల కోట్ల రూపాయల విలువైన అనేక ఇతర ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి.

మిత్రులారా,

ఇంఫాల్‌లో అయినామణిపూర్‌లోని ఇతర ప్రాంతాల్లో అయినా.. అంకుర సంస్థలకూసాంకేతికత ఆధారిత పరిశ్రమలకూ కొత్త అవకాశాలు లభిస్తున్నాయిఐటీ ప్రత్యేక ఆర్థిక మండలి ఈ అవకాశాలను బలోపేతం చేస్తుందిఇందులో మొదటి భవనం ఇప్పటికే పూర్తయిందిమణిపూర్‌లో కొత్త సచివాలయ భవనం కోసం చాలా కాలంగా డిమాండ్ ఉందిఇప్పుడు ఈ భవనం కూడా సిద్ధమైంది. ‘‘పౌరుడు దేవుడితో సమానం’’ అన్న నాగరిక దేవో భవ స్ఫూర్తిని ఇది మరింత బలోపేతం చేస్తుంది.

మిత్రులారా,

మణిపూర్ నుంచి మన ప్రజలు చాలామంది కలకత్తాఢిల్లీ నగరాలకు ఎక్కువగా ప్రయాణిస్తుంటారుఅక్కడ వారికి అందుబాటు వ్యయంతో వసతి సదుపాయాన్ని కల్పించడం కోసం రెండు నగరాల్లో మణిపూర్ భవనాలను నిర్మించాంఈ భవనాలు ముఖ్యంగా మణిపూర్ ఆడబిడ్డలకు ఎంతగానో సహాయపడతాయిఅక్కడ పిల్లలు సురక్షితంగా ఉంటేఇక్కడ తల్లిదండ్రుల ఆందోళన కూడా తగ్గుతుంది.

మిత్రులారా,

మా ప్రభుత్వం పూర్తి సున్నితత్వంతో వ్యవహరిస్తూ మీ జీవితాల్లో కష్టాలను తగ్గించడానికి కృషి చేస్తోందిమణిపూర్‌లోని అనేక ప్రాంతాలు వరదల వల్ల తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయని నాకు తెలుసుఈ సవాలును పరిష్కరించడం కోసం కూడా అనేక ప్రాజెక్టులపై ప్రభుత్వం పనిచేస్తోంది.

మిత్రులారా,

ఆర్థిక వ్యవస్థలో మన తల్లులుఅక్కాచెల్లెళ్లూ ముందుండి నడిపించే రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటిఇమా కీథెల్ సంప్రదాయం దీనికి గొప్ప నిదర్శనంమహిళా శక్తిని భారత్ అభివృద్ధికీఆత్మనిర్భర్ భారత్‌కూ కీలక చోదక శక్తిగా నేను భావిస్తానుమనమిక్కడే మణిపూర్‌లో ఈ స్ఫూర్తిని చూస్తున్నాంఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మహిళల కోసం ప్రత్యేక మార్కెట్లైన ఇమా మార్కెట్ల నిర్మాణాన్ని ప్రారంభించాంఈ రోజు నాలుగు ఇమా మార్కెట్లను కూడా ప్రారంభించడం సంతోషాన్నిచ్చే విషయంఈ మార్కెట్లు మణిపూర్ అక్కాచెల్లెళ్లకు ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయి.

మిత్రులారా,

ప్రతి పౌరుడికీ జీవన సౌలభ్యాన్ని అందించడం మా లక్ష్యంమణిపూర్‌కు వస్తువులను తీసుకురావడంలో అత్యంత కష్టతరమైన రోజులను మనం చూశాంనిత్యావసర వస్తువులు సామాన్య కుటుంబాలకు అందనంత దూరంలో ఉండేవికొన్నేళ్లుగా మా ప్రభుత్వం మణిపూర్‌ను ఆ కష్టాల నుంచి విముక్తి చేసిందిమీకు మరో శుభవార్త.. మీ పొదుపును పెంచిమీ జీవనాన్ని మరింత సులభతరం చేయాలని మా ప్రభుత్వం ఆకాంక్షిస్తోందిఅందుకే ఇప్పుడు జీఎస్టీని గణనీయంగా తగ్గించాందీనివల్ల మణిపూర్ ప్రజలకు రెట్టింపు ప్రయోజనం చేకూరుతుందిసబ్బుషాంపూహెయిర్ ఆయిల్దుస్తులుపాదరక్షల వంటి నిత్యావసర వస్తువులన్నీ చవకగా మారుతాయిసిమెంటుఇళ్ల నిర్మాణానికి వాడే వస్తువుల ధరలు కూడా తగ్గుతాయిహోటళ్లుఆహారంపై జీఎస్టీని కూడా ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందిదీంతో అతిథిగృహాల యజమానులుటాక్సీ డ్రైవర్లుదాబాల యజమానులకు లబ్ధి చేకూరడమే కాకుండా.. ఇక్కడ పర్యాటక రంగ వికాసానికీ అది తోడ్పడుతుంది.

మిత్రులారా,

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప వారసత్వం మణిపూర్‌కు ఉందిఎంతో లోతుగా పాతుకుపోయిన బలమైన సాంస్కృతిక మూలాలు మణిపూర్ సొంతంభరతమాత కిరీటంలో కలికితురాయి మణిపూర్అందుకే నిరంతర అభివృద్ధితో మణిపూర్ ప్రతిష్ఠను మనం మరింత ఇనుమడింపజేయాలిమణిపూర్‌లో హింస ఏ రూపంలో జరిగినా అది అత్యంత దురదృష్టకరంఅది మన పూర్వీకుల ప్రతిష్ఠకు కళంకం మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలకు చేసే అన్యాయం కూడాఅందుకే మనమంతా కలిసి మణిపూర్‌ను శాంతిఅభివృద్ధి పథంలో ముందుకు నడపాలిభారత స్వాతంత్య్ర పోరాటంలోదేశ రక్షణలో మణిపూర్ సేవల నుంచి మనం స్ఫూర్తిని పొందాలిఈ మణిపూర్ గడ్డపైనే భారత జాతీయ సైన్యం తొలిసారిగా భారత పతాకాన్ని ఎగురవేసిందిభారత స్వాతంత్య్రానికి ద్వారంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మణిపూర్‌ను అభివర్ణించారుఅసంఖ్యాక వీరుల త్యాగాలకు ఈ నేల సాక్షిగా నిలిచిందిఅలాంటి మణిపూర్‌ యోధులందరి స్ఫూర్తితో మన ప్రభుత్వం ముందుకు సాగుతోందిమన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందిఅండమాన్నికోబార్ దీవులని హారియట్ శిఖరాన్ని మణిపూర్ శిఖరంగా పేరు మార్చిందిమణిపూర్ స్వాతంత్య్ర సమరయోధులకు 140 కోట్ల భారతీయుల తరఫున అర్పించిన నివాళి ఇది.

మిత్రులారా,

నేటికీ మణిపూర్‌ ముద్దుబిడ్డలెందరో దేశంలోని వివిధ చోట్ల భారతావనిని కంటికి రెప్పలా కాపాడుతున్నారుఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సేనల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందిమన సైనికుల ధైర్యసాహసాలకు పాకిస్థాన్ సైన్యం కకావికలమైపోయిందిభారత్ సాధించిన ఈ విజయంలో మణిపూర్‌ వీరపుత్రులువీరవనితల సాహసమూ ఉందిఅద్భుతమైన సాహసాన్ని ప్రదర్శించి అమరుడైన వీరుడు దీపక్ చింగాఖమ్‌కు నేడు నివాళి అర్పిస్తున్నానుఆపరేషన్ సింధూర్ వేళ ఆయన చేసిన అత్యున్నత త్యాగాన్ని దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది.

మిత్రులారా,

2014లో నేనిక్కడికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పానుఅది నాకిప్పటికీ గుర్తుందిమణిపురి సంస్కృతి లేకుండా భారతీయ సంస్కృతి అసంపూర్ణమనీమణిపూర్ క్రీడాకారులు లేకుండా భారతీయ క్రీడారంగమూ అసంపూర్ణమే అనీ నేనన్నానుమువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడేందుకు సర్వస్వాన్నీ అంకితం చేసే యువత మణిపూర్ సొంతంహింస అనే చీకట్లలో ఈ అస్తిత్వాన్ని అణచివేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తావివ్వొద్దు.

మిత్రులారా,

క్రీడారంగంలో ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతున్న నేటి తరుణంలో.. మణిపూర్ యువతపై బాధ్యత మరింత పెరిగిందిఅందుకే దేశంలో మొదటి ‘జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం’ కోసం భారత ప్రభుత్వం మణిపూర్‌ను ఎంచుకుందిఖేలో ఇండియాటార్గెట్ ఒలింపిక్ పోడియం పథకాల ద్వారా.. మణిపూర్‌కు చెందిన ఎందరో క్రీడాకారులను నేడు ప్రోత్సహిస్తున్నాంమణిపూర్ యువత కోసం ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నాంపోలో క్రీడను ప్రోత్సహించడం కోసం ప్రపంచంలోనే ఎత్తయిన పోలో విగ్రహంతో ‘మార్జింగ్ పోలో కాంప్లెక్స్’ను ఇక్కడ నెలకొల్పాంఈ గడ్డపై జన్మించిన ఒలింపియన్ల గౌరవార్థం ‘ఒలింపియన్ పార్కు’ను కూడా ఏర్పాటు చేశాంకొన్ని రోజుల కిందటే ప్రభుత్వం జాతీయ క్రీడా విధానాన్ని (ఖేలో భారత్ నీతిప్రకటించిందిమున్ముందు మణిపూర్ యువతకు దీంతో అపారమైన ప్రయోజనం చేకూరుతుంది.

మిత్రులారా,

మణిపూర్‌లో శాంతినీ స్థిరత్వాన్నీ నెలకొల్పేందుకుఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకుశిబిరాల్లో తలదాచుకోవాల్సి వచ్చిన ప్రజల కోసం సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందినిర్వాసితులైన వారి కోసం 7,000 కొత్త గృహాలను మంజూరు చేసిందిఇటీవలే కేంద్ర ప్రభుత్వం మణిపూర్ కోసం దాదాపు రూ. 3,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించిందినిరాశ్రయులైన వారికి సాయమందించేందుకు ఇందులో రూ. 500కోట్లకు పైగా కేటాయించిందిహింసతో ప్రభావితమైనవారు వీలైనంత త్వరగా సాధారణ జీవితాన్ని ప్రారంభించేలా చూడడమే మాకు అత్యంత ప్రధానమైన అంశంమణిపూర్ పోలీసుల కోసం కొత్తగా నిర్మించిన ప్రధాన కార్యాలయం కూడా ఈ విషయంలో మీకెంతగానో సహాయపడుతుంది.

మిత్రులారా,

నేపాల్‌లోని సోదరీ సోదరులతోనూ ఈ మణిపూర్ పుణ్యభూమి నుంచి నేను మాట్లాడదలిచానుహిమాలయాల ఒడిలో ఒదిగి ఉన్న నేపాల్.. భారత్‌కు మిత్రదేశంసత్సంబంధాలున్న దేశంఉమ్మడి చరిత్రవిశ్వాసాలతో ముడిపడి ఉన్న మనం.. సమష్టిగా ముందుకు సాగుతున్నాంనేడు 140 కోట్ల భారతీయుల తరఫున.. నేపాల్ మధ్యంతర ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సుశీల గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానుఆమె నేతృత్వంలో శాంతిస్థిరత్వంసౌభాగ్యం దిశగా నేపాల్ అడుగులు వేస్తుందన్న విశ్వాసం నాకుందినేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టడం మహిళా సాధికారతకు అత్యుత్తమ ఉదాహరణఅస్థిరత నెలకొన్నప్పటికీ.. ప్రజాస్వామ్య విలువలకే పెద్దపీట వేసిన నేపాల్‌లోని ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

నేపాల్‌లో ఇటీవలి పరిణామాల్లో ఎవరూ పెద్దగా దృష్టి సారించని మరో అద్భుతమైన అంశాన్ని గమనించానురెండు మూడు రోజులుగా నేపాల్ యువత అత్యంత పవిత్రతఅంకితభావంతో వీధులను శుభ్రం చేస్తూరంగులు వేస్తూ కష్టపడి పనిచేస్తోందినేను కూడా సామాజిక మాధ్యమాల్లో వారి చిత్రాలను చూశానువారి సానుకూల దృక్పథంకార్యాచరణ కేవలం స్ఫూర్తినివ్వడమే కాదు.. నేపాల్‌లో సరికొత్త ఉషోదయానికి స్పష్టమైన సంకేతాలునేపాల్ ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ 21వ శతాబ్దంలో ఏకైక లక్ష్యంతో మన దేశం పురోగమిస్తోందిఅదే ‘వికసిత భారత్’మణిపూర్ అభివృద్ధి కూడా ఈ లక్ష్య సాధనకు అత్యావశ్యకంఅపరిమితమైన సామర్థ్యం నిండి ఉన్న రాష్ట్రం మన మణిపూర్అభివృద్ధి మార్గం నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు తప్పుకోవద్దుఇదే మన కర్తవ్యంమణిపూర్‌లో సామర్థ్యానికి కొదువ లేదుమనం చేయాల్సిందేమిటంటే.. చర్చలను బలోపేతం చేయడంకొండ ప్రాంతాలూలోయ ప్రాంతాల మధ్య సామరస్యమనే బలమైన వారధిని నిర్మించాలిదేశ పురోగతికి బలమైన కేంద్రంగా మణిపూర్ నిలుస్తుందన్న దృఢమైన నమ్మకం నాకుందిఈ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలు.

ఇప్పుడు నాతో కలిసి నినదించండి:

భారత్ మాతా కీ జై.

భారత్ మాతా కీ జై.

భారత్ మాతా కీ జై.

ధన్యవాదాలు.

***


(రిలీజ్ ఐడి: 2254877) సందర్శకుల సూచీ సంఖ్య : : 7