ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: ఢిల్లీలో జరిగిన క్రిషి కార్యక్రమంలో రైతులతో ప్రధానమంత్రి సంభాషణ

నాడు పోస్టు చేయడమైనది: 12 OCT 2025 6:45PM by PIB Hyderabad

ప్రధానమంత్రిరామ్-రామ్!

రైతురామ్-రామ్నేను హర్యానాలోని హిసార్ జిల్లా నుంచి వచ్చానునేను కాబూలీ శనగల సాగుతో వ్యవసాయాన్ని మొదలుపెట్టానుమొదట్లో కొద్దిగానే...

ప్రధానమంత్రిఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు?

రైతునాలుగేళ్లు అవుతోందికాబూలీ శనగల ద్వారా నాకు ఎకరాకు సుమారు 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది.

ప్రధానమంత్రిపప్పు ధాన్యాల వంటి కొన్ని పంటలను అంతర పంటలుగా కూడా వేస్తుంటారు కదా?

రైతుఅవునండి.

ప్రధానమంత్రిదీనికి కొంచెం ఎక్కువ శ్రమ అవసరమే కానీ మీకు అదనపు ఆదాయం వస్తుందిఇది చూసి ఇతర రైతులు కూడా తమ భూమి మళ్లీ సారవంతం అవుతుందని భావిస్తూ పప్పు ధాన్యాల సాగు వైపు మొగ్గు చూపుతున్నారా?

రైతుఅవునండిమేమంతా అలాగే అనుకుంటున్నాంనేను ఇతర రైతులకు కూడా చెబుతాను.. మనం శనగల వంటి పప్పు ధాన్యాలను సాగు చేస్తే మనకు ఈ పంటతో పాటు వచ్చే పంటకు కూడా మేలు జరుగుతుందనిశనగలుఇతర పప్పు ధాన్యాలు నేలలో నత్రజనిని నిల్వ చేస్తాయిఇది తర్వాతి పంట దిగుబడికి నేలను సారవంతం చేస్తుంది.

రైతునా జీవితంలో ప్రధానమంత్రిని కలవడం ఇదే మొదటిసారిఆయన చాలా మంచి వారురైతులుసామాన్య ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు.

రైతునేను రైతు ఉత్పత్తిదారుల సంస్థతో (ఎఫ్‌పీఓకూడా అనుబంధం కలిగి ఉన్నానునేను వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్‌నికానీ నేను పప్పు ధాన్యాలను కూడా సాగు చేస్తానుమా కుటుంబానికి 16 బిఘాల భూమి ఉందిఅక్కడ నేను శనగలు పండిస్తానుమా గ్రామంలో 20 మంది మహిళలతో కూడిన గ్రూపులను ఏర్పాటు చేశాంమేమంతా కలిసి 'శనగ-వెల్లుల్లి పాపడ్వంటి ఉత్పత్తులను తయారు చేస్తాంమా... (ఆడియో స్పష్టంగా లేదు)... ఇందులో వెల్లుల్లి ఉంటుంది...

ప్రధానమంత్రిఓహో.. అంటే మీరు అక్కడే ఉత్పత్తిని కూడా చేస్తున్నారా?

రైతుఅవునండి.. అవునండి.. అవునండి.

ప్రధానమంత్రిమీరు మీ ఉత్పత్తికి ఏదైనా బ్రాండ్ పేరు పెట్టారా?

రైతుఅవునండిమా గ్రామం పేరు దుగారిఅందుకే మేం దానికి 'దుగారి వాలేఅని బ్రాండ్ పేరు పెట్టాం.

ప్రధానమంత్రిఓహో.. మంచిది.

రైతుఅవునండిశనగ-వెల్లుల్లి అప్పడం.. దీనిని 'దుగారి వాలే శనగ-వెల్లుల్లి పాపడ్అని బ్రాండ్ చేశాం

ప్రధానమంత్రిప్రజలు వీటిని కొంటున్నారా?

రైతుకొంటున్నారండిమేం ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ అయిన జీఈఎంలో కూడా నమోదు చేసుకున్నాంఅక్కడి నుంచి సైనికులు వీటిని కొనుగోలు చేస్తారు సర్

ప్రధానమంత్రిఅంటే ఇది రాజస్థాన్ అంతటా తెలిసిందా?

రైతుసర్ఇది భారతదేశమంతా అమ్ముడవుతోంది.

ప్రధానమంత్రినిజమా?

రైతుఅవునండి.

ప్రధానమంత్రిఇలాంటి ఉత్పత్తులనే తయారు చేసే వారు ఇంకెవరైనా ఉన్నారా?

రైతుఉన్నారండి.. మరికొందరు కూడా ఉన్నారుకానీ ప్రధానంగా మహిళలే వీటిని తయారు చేస్తారు.

ప్రధానమంత్రిఅయితే అందరూ రుచి చూసేందుకు మీరు కొన్ని తీసుకురావాలి!

రైతుతప్పకుండా సర్.. ఖచ్చితంగా!

రైతుప్రధానమంత్రిని ఎలా కలుస్తామో అని మాకు ఒళ్లు గగుర్పొడిచిందిఆయన వచ్చినప్పుడు ఆ తేజస్సును చూసి మేం మాటల్లేకుండా ఉండిపోయాంఅది వర్ణించలేని క్షణం.

రైతునేను 2013-14 నుంచి పప్పు ధాన్యాలను సాగు చేస్తున్నానునేను ఒక ఎకరంతో మొదలుపెట్టి శనగల సాగును క్రమంగా 13-14 ఎకరాలకు విస్తరించాను.

ప్రధానమంత్రిఅవునుఅంటే మొదట్లో మీరు ఒక ఎకరంలో మాత్రమే శనగలు వేసి మిగిలిన చోట్ల ఇతర పంటలు వేసేవారా?

రైతుఅవును సర్

ప్రధానమంత్రిఅలా నెమ్మదిగా మీరు సాగు విస్తీర్ణాన్ని పెంచారా?

రైతుఅవునునేను సుమారు 13-14 ఎకరాలకు విస్తరించాను....

ప్రధానమంత్రిదీని వల్ల మీ ఆదాయం ఎలా మారింది?

రైతునా ఆదాయం పెరిగిందిఎందుకంటే నేను ఏటా నాణ్యమైన విత్తనాలను ఎంచుకున్నానుతద్వారా ఉత్పాదకత పెరుగుతూ వచ్చింది.

ప్రధానమంత్రిశాకాహారులకు పప్పు ధాన్యాలే ప్రధాన ప్రోటీన్ వనరు కదా?

రైతుఅవును సర్

ప్రధానమంత్రికాబట్టి మీరు పప్పు ధాన్యాలు పండిస్తున్నప్పుడు అది కేవలం మీ లాభం కోసమే కాదుమీరు సమాజానికి కూడా గొప్ప సహకారం అందిస్తున్నారు.

రైతునిజమేనండి.

ప్రధానమంత్రిఈ రోజుల్లో మన పొలాలు చిన్నవిభూమి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయిందిదాని వల్ల  ఎవరైనా ఏదైనా ప్రయోగం చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుందికానీ ఒకసారి ఊహించుకోండి.. ఒక 200 మంది రైతులు కలిసి వస్తే...

రైతుఅవునండి.

ప్రధానమంత్రి: … ఆ 200 మంది కలిసి 400 లేదా 500 బిఘాల భూమిలో సమష్టిగా ఒకటి లేదా రెండు ఎంపిక చేసిన పంటలను పండిస్తూ వాటిని బాగా మార్కెట్ చేయాలని నిర్ణయించుకుంటే అది రైతులకు మరింత లాభదాయకంగా ఉంటుందా?

రైతుఖచ్చితంగా సర్మేం సుమారు 1,200 ఎకరాల్లో కాబూలీ శనగల కోసం రసాయన అవశేషాలు లేని  సాగు చేస్తున్నాంరైతులకు గతంలో కంటే మెరుగైన రాబడి వస్తోంది.

ప్రధానమంత్రిఅంటే ఇప్పుడు రైతులందరూ దీనికి అంగీకరించారుదీనివల్ల మీ శ్రమ కూడా తగ్గి ఉంటుంది కదా?

రైతుఅవునండి.. ఎందుకంటే మేం అటువంటి వ్యవస్థను నిర్మించాం

రైతునేను బీడ్ జిల్లా నుంచి వచ్చాను.

ప్రధానమంత్రిఎక్కడి నుంచిబీడ్ జిల్లా నుంచాఅక్కడ సాధారణంగా నీటి ఎద్దడి ఉంటుంది కదా?

రైతుఅందుకే సర్ 'ధాన్-ధాన్యపథకాన్ని ప్రారంభించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ప్రధానమంత్రిధన్యవాదాలుమనం అన్ని చోట్లా చిరుధాన్యాలను ఎలాగైతే ప్రోత్సహిస్తున్నామో… సజ్జలుజొన్నలుఇతర మన సంప్రదాయ ధాన్యాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్ ఉందినీటి కొరత ఉన్న భూముల్లో కూడా రైతులు మంచి ఆదాయాన్ని పొందొచ్చు

రైతుఅవునండి.. చిరుధాన్యాల వల్ల అది సాధ్యమవుతోంది.

ప్రధానమంత్రిమీరు కూడా చిరుధాన్యాలను సాగు చేస్తారా?

రైతుఅవునండిసాగు చేస్తాను.

ప్రధానమంత్రిమీరు ఏ రకాలను పండిస్తారు?

రైతుసజ్జలుజొన్నలువేయించిన శనగలు కూడా.

ప్రధానమంత్రిఅంటే ప్రజలు ఇంకా వీటిని తింటున్నారా?

రైతుఅవునండి.. అందరూ తింటున్నారు.

ప్రధానమంత్రిఅది మంచి విషయం.

రైతుదానితో పాటు మేం వినియోగదారులకు సరుకు సరఫరా చేస్తున్నప్పుడు కొంతమంది ముంబయిలో ఉన్నారు.

రైతుఆయనతో మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రిని కలిసినట్లు అనిపించలేదు.. మా కుటుంబంలో ఒకరిని కలిసినట్లు అనిపించింది.

రైతుమా ప్రాంతంలో నేను కంది సాగు చేస్తానుయువత దీనిపై ఆసక్తి చూపాలని నేను కోరుకుంటున్నానుఇది రైతులకు మేలు చేయడమే కాకుండా మంచి వ్యాపార అవకాశాన్ని కూడా అందిస్తుంది.

రైతునేను ఒక స్వయం సహాయక సంఘంలో సభ్యురాలినినేను 2023లో ఆ సంఘంలో చేరి నా ఐదు బిఘాల భూమిలో పెసర సాగు చేయడం ప్రారంభించానుసర్మీ 'పీఎం-కిసాన్ సమ్మాన్ నిధిపథకం మాకు నిజంగా ఒక వరంమాకు ఏటా అందుతున్న రూ. 6,000 ఎంతో సహాయపడుతున్నాయి.. విత్తనాలు కొనడానికిభూమిని దున్నడానికిఇతర వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతున్నాయిఇది మాకు నిజంగా పెద్ద సహాయం

ప్రధానమంత్రిరసాయన ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా?

రైతుఅవునండిమహిళలు...

ప్రధానమంత్రిఎందుకంటే మనం గుర్తుంచుకోవాలిభూమి మనకు తల్లి వంటిదిమనం ఆమెకు ఇలాంటి రసాయనాలను తినిపిస్తూ ఉంటే ఆమె ఎంతకాలం జీవిస్తుంది?

రైతుఅది నిజం సర్

ప్రధానమంత్రిదీని గురించి రైతులు చర్చిస్తారా?

రైతుఅవునండి.. చర్చిస్తారు.

ప్రధానమంత్రితమ పిల్లల కోసం సారవంతమైన భూమిని వదిలి వెళ్లాలి కానీ బంజరు భూమిని కాదు అని గ్రహించిన తర్వాత వారు స్వయంచాలకంగా భూమికి హాని చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తారుఈ విషయంలో రైతులు సహాయపడగలరుఉదాహరణకు ఒక వ్యక్తికి నాలుగు బిఘాల భూమి ఉందనుకోండి...

రైతుఅవునండి.

ప్రధానమంత్రి: ...అతనిని పూర్తిగా ప్రకృతి వ్యవసాయానికి మారమని మీరు చెబితే అతను భయపడతాడు.

రైతుఅవునండిఅతను సాహసించడు.

ప్రధానమంత్రి: ‘నేను ఆకలితో చచ్చిపోతాను’ అని అతను ఆలోచిస్తాడుకాబట్టి దానికి బదులుగా ఇలా చెప్పండిమమ్మల్ని గుడ్డిగా నమ్మకండిమీ భూమిని నాలుగు భాగాలుగా విభజించండిఒక బిఘాలో మా పద్ధతిని ప్రయత్నించండిమిగిలిన మూడింటిలో మీ పాత పద్ధతినే కొనసాగించండి.

రైతునిజమే.

ప్రధానమంత్రిరెండేళ్లపాటు మాతో కలిసి పనిచేయండిఅతను విజయాన్ని చూసిన తర్వాత ఒక బిఘా నుంచి ఒకటిన్నర బిఘాకు ఆపై రెండు బిఘాలకు.. ఇలా విస్తరిస్తాడుఇలాగే ఆత్మవిశ్వాసం పెరుగుతుందిఒకేసారి నాలుగు బిఘాలను మార్చమని మనం అడిగితే అతను మారడు.. జీవనోపాధి కోల్పోతానేమోనని భయపడతాడు.

రైతునేను శనగలుపప్పు ధాన్యాలుగోరు చిక్కుడు పండిస్తున్నానునా దగ్గర కేవలం రెండు ఎకరాల భూమి ఉన్నప్పటికీ నేను చిన్న తరహా వ్యవసాయాన్ని క్రమంగా నిర్వహిస్తున్నాను.

ప్రధానమంత్రిచూశారా రెండు ఎకరాలు ఉన్న రైతు కూడా అద్భుతాలు చేయగలడు.

రైతుఅవునండికొంచెం కొంచెంగా...

ప్రధానమంత్రిభూమి చిన్నది కావచ్చు.. కానీ రైతు మనస్సు చాలా గొప్పది.. ధైర్యంనిశ్చయంతో నిండి ఉంటుంది.

రైతుఅవును సర్

ప్రధానమంత్రిమీ పొలాల చుట్టూ కంచె వేయాలని ఎప్పుడైనా ఆలోచించారాసాధారణంగా పక్కన ఉన్న రైతు కూడా కంచె వేస్తారుఆ రెండింటి మధ్యలో కొంత భూమి వృథా అవుతుందికానీ దానికి బదులుగా ఇరువైపులా సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తే.. మీ ఫలకాలు ఒక వైపునకు అతనిది మరోవైపునకు వంగి ఉండేలా చూసుకుంటే మీరిద్దరూ విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు.. వాడుకోవచ్చుఇందులో మిగిలిన విద్యుత్తును అమ్మొచ్చు కూడా.

రైతుఅద్భుతమైన ఆలోచన సర్ఇది సాధ్యమే…

ప్రధానమంత్రిఅవును మనం ఆ దిశగానే సాగాలిదీని కోసం ప్రభుత్వం ఇప్పుడు నిధులు కూడా సమకూరుస్తోంది.

రైతుప్రజలు దీనిని చేపడుతున్నారు సర్.. మంచి ప్రయోజనాలు పొందుతున్నారు.

ప్రధానమంత్రిమరొక విషయం.. వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా మనం రీఛార్జ్ బావులను కూడా ప్రోత్సహించాలిదీనివల్ల భూగర్భ జల మట్టం పెరుగుతుంది.. అందరికీ మేలు జరుగుతుంది.

రైతుఅవునండి.. ఖచ్చితంగా.

ప్రధానమంత్రిమీ అందరితో మాట్లాడటం చాలా బాగుందిమీరు కొత్త పద్ధతులతో ప్రయోగాలు చేస్తున్న ధైర్యవంతులైన కష్టపడే రైతులు.. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందిచాలా మంది కేవలం ‘మా నాన్న ఇది చేశారు మా మామయ్య ఇది చేశారు కాబట్టి నేను కూడా అదే చేస్తాను అని అంటారుకానీ యువతను ఆ ఆలోచనకు అతీతంగా వెళ్లేలా మనం ప్రోత్సహించాలి.

రైతుపశుసంవర్ధకపాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలుమాకు 50 శాతం సబ్సిడీ లభించిందిగతంలో నా దగ్గర కొన్ని ఆవులు మాత్రమే ఉండేవికానీ ఇప్పుడు నా దగ్గర 250కి పైగా గిర్ ఆవులు ఉన్నాయి. 2010లో నేను ఒక హోటల్‌లో రూమ్ బాయ్‌గా పనిచేశానుఈ రోజు కోట్లాది రూపాయల విలువైన గోశాల నాకు ఉందికేంద్ర ప్రభుత్వం అద్భుతమైన మద్దతును అందించింది.

ప్రధానమంత్రిమీరు రూమ్ బాయ్ స్థాయి నుంచి ఈ స్థితికి ఎలా చేరుకున్నారు?

రైతుఇదంతా ప్రభుత్వ పథకాల వల్లే జరిగింది సర్.

ప్రధానమంత్రిఇన్ని ఆవులు ఉన్నాయి కదామీరు వాటన్నింటినీ మీ దగ్గరే ఉంచుకుంటారా లేదా ఇతరులకు ఇస్తారా?

రైతునేను 63 ఆవులను వాటి దూడలతో సహా సేంద్రియ సాగు చేస్తూ పేదరికంలో ఉన్న ఒక ఆదివాసీ మహిళకు బహుమతిగా ఇచ్చాను.

ప్రధానమంత్రిమంచిదినేను కాశీకి ఎంపీనినేను అక్కడ కూడా ఇలాంటి ప్రయోగమే చేశానుసుమారు 100 కుటుంబాలకు గిర్ ఆవులను పంపిణీ చేశానుఅయితే మొదటి దూడను నాకు తిరిగి ఇవ్వాలనే నిబంధన పెట్టానుఆ తర్వాత దానిని మరో కుటుంబానికి ఇచ్చాను.

రైతు: 2020లో ప్రపంచ లాక్‌డౌన్ సమయంలో నేను పరిశోధన చేసి ఆ తర్వాత హరిద్వార్‌లోని శాఖను సందర్శించానుఅక్కడ నేను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి తెలుసుకున్నానుఅది నా జీవితాన్ని మార్చేసిందిఈ పథకం ద్వారా లభించిన రాయితీలుసహాయం వల్ల నాకు మంచి మద్దతు లభించింది.

ప్రధానమంత్రిమీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు?

రైతుఉత్తరాఖండ్‌లోని చిన్న గ్రామాల నుంచి సుమారు 25 మంది యువకులు మాతో కలిసి పనిచేస్తున్నారు సర్వారు ఇక్కడ చాలా విషయాలు నేర్చుకుంటారు.

ప్రధానమంత్రిచాలా అద్భుతం.

రైతుకొందరు వేరే ప్రాంతాలకు వెళ్లి స్వతంత్రంగా వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.

రైతునేను అలంకారిక చేపల పెంపకంపై కూడా దృష్టి పెట్టాను.

ప్రధానమంత్రి.. ఆక్వాకల్చర్

రైతునేను ఉత్తర‌ప్రదేశ్‌లో మొదటిసారిగా దీనిని ప్రారంభించాను సర్.

ప్రధానమంత్రిఅవునా మీరు ఎలా చేశారుఎక్కడ శిక్షణ పొందారు?

రైతుసర్నేను పీహెచ్‌డీ చేశానునా సబ్జెక్ట్ కూడా ఇదేఉద్యోగం కోసం వెతికేవాడిగా కాకుండా ఉద్యోగం ఇచ్చేవాడిగా ఉండాలని నిర్ణయించుకున్నానుఅందుకే నేను ఈ సంస్థను ప్రారంభించాను.

ప్రధానమంత్రిఆక్వాకల్చర్‌కు ప్రపంచవ్యాప్తంగా అపారమైన అవకాశాలు ఉన్నాయి.

రైతునిజమే సర్.

ప్రధానమంత్రిఈ రంగంలో భారత్‌కు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయిదీనిపై దృష్టి పెడితే భారీ మార్కెట్ అవకాశాలు లభిస్తాయి.

రైతుప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే రైతులకు ఎంతో ఆశను కల్పిస్తోంది.

రైతు: ‘గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది’ అన్న మీ దార్శనికత నన్ను ఎంతగానో ప్రేరేపించిందిశరాయికేలలో నేను 125 పేద గిరిజన కుటుంబాలను దత్తత తీసుకొని అక్కడ సమగ్ర వ్యవసాయాన్ని ప్రారంభించాను.

ప్రధానమంత్రిమీ చదువు మీకు దీనికి సిద్ధం చేసిందా లేక అక్కడికక్కడే శిక్షణ పొందారా?

రైతుసర్మీరే నాకు ఆదర్శం

ప్రధానమంత్రి.. నిజమా?

రైతుఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ కల్పకులుగా మారాలని మీరు దేశానికి పిలుపునిచ్చారుటాటా స్టీల్ ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులను విక్రయిస్తుందినా ఉత్పత్తులను కూడా టాటా స్టీల్ విక్రయిస్తోంది.

ప్రధానమంత్రిఅద్భుతం.

రైతుసర్ మీరు నాకు మార్గదర్శిస్ఫూర్తిప్రదాతమీ చిన్న చిన్న సలహాలుచర్చలు నా జీవితాన్ని నిరంతరం మారుస్తున్నాయి.

రైతునేను 'సఖిసంస్థతో అనుబంధం కలిగి ఉన్నానుమా ప్రయాణం 20 మంది మహిళలతో మొదలైందిఇప్పుడు 90,000 మంది మహిళలు పనిచేస్తున్నారు.

ప్రధానమంత్రి: 90,000 !

రైతుఅవును సర్ఈ మహిళలు పాలు విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారుమేం ఇప్పటివరకు 14,000 మందికి పైగా 'లఖ్‌పతి దీదీలనుతయారు చేశాం

ప్రధానమంత్రిఇది అద్భుతం!

రైతునాకు ఇక్కడ చేపల పెంపకం కూడా ఉంది.

ప్రధానమంత్రిఅవును.

రైతుమీ పీఎంఎంఎస్‌వై పథకం వల్ల మేం ఐస్ ప్లానింగ్సరైన ఆక్వాకల్చర్ నిర్వహణను అమలు చేయగలిగాం

ప్రధానమంత్రిమీతో ఎంతమంది పనిచేస్తున్నారు?

రైతుసుమారు 100 మంది.

ప్రధానమంత్రిఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారు ఇంకెవరైనా ఉన్నారా?

రైతుఉన్నారు సర్ఇటీవల అండమాన్ నుంచి మరో బృందం వచ్చిందిఅంతకుముందు మేం వారిని సరిగ్గా చేరుకోలేకపోయాం కానీ పీఎంఎంఎస్‌వై పథకం వల్ల ఇప్పుడు పడవలు పనిచేస్తున్నాయి.. ఐస్ సరఫరా అందుబాటులో ఉందిచేపలను ఉంచడానికి స్థలం కూడా ఉంది.

ప్రధానమంత్రి.. అద్భుతం.

రైతునేను కాశ్మీర్ నుంచి వచ్చానుఒక కార్యక్రమం ద్వారా మీ పీఎంఎంఎస్‌వై పథకం గురించి తెలుసుకున్నాను.. పని ప్రారంభించానుచేపల పెంపకాన్ని మొదలుపెట్టానునాకు ఇప్పుడు 14 మంది ఉద్యోగులు ఉన్నారు.

ప్రధానమంత్రిఅర్థమైంది.

రైతుఅవును. 14 మంది ఉద్యోగులునేను ఏటా సుమారు రూ. 15 లక్షల లాభాన్ని సంపాదిస్తున్నానుమార్కెట్ బాగుందిఇతరులు కూడా లబ్ధి పొందుతున్నారు.

ప్రధానమంత్రిఇప్పుడు మీరు రైలు ద్వారా సరకును పంపొచ్చు కాబట్టి మీ ఉత్పత్తులు మార్కెట్లకు వేగంగా చేరుతాయి.

రైతుమీ మద్దతుతో అభివృద్ధి వేగంగా జరుగుతోందిమరే ఇతర ప్రధానమంత్రి హయాంలో ఇది సాధ్యమవుతుందని నేను అనుకోను.

ప్రధానమంత్రిజమ్మూ కాశ్మీర్‌లో చాలా సమర్థులైన యువత ఉన్నారు.

రైతుఅవును ఇదంతా మీ ప్రభుత్వం వల్లే సాధ్యమైంది లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.

రైతువారితో కలవడంఆక్వాకల్చర్ గురించి చర్చించడం ఒక సహజ చికిత్సలా అనిపించింది.

రైతునమస్కారం.

ప్రధానమంత్రినమస్కారం.

రైతుసర్నేను నిజానికి 2014లో అమెరికా నుంచి తిరిగి వచ్చాను.

ప్రధానమంత్రిఅమెరికా వదిలేసి వచ్చారా?

రైతుఅవును.. నా సొంత ప్రజలకు ఉపాధి కల్పించాలని అమెరికా వదిలేసి వచ్చానునేను 10 ఎకరాల చిన్న పొలంతో మొదలుపెట్టానుఇప్పుడు నేను 300 ఎకరాలకు పైగా సాగును చూసుకుంటున్నానుఅంతేకాకుండా 10,000 ఎకరాలకు పైగా విత్తనాలను ఉత్పత్తి చేసే హేచరీలను నిర్వహిస్తున్నానునేను ఎఫ్‌ఐడీఎఫ్ నుంచి సుమారు శాతం వడ్డీకి రుణ ప్రయోజనం పొందానుదీనివల్ల భారీ విస్తరణ సాధ్యమైందిప్రస్తుతం నాకు సుమారు 200 మంది ఉద్యోగులు ఉన్నారు సర్

ప్రధానమంత్రివావ్చాలా గొప్ప విషయం!

రైతునరేంద్ర మోదీ గారు మా వైపు నడుచుకుంటూ రావటం నా జీవితంలో అదొక మరపురాని క్షణంఅది నిజంగా అద్భుతమైన సందర్భం.

ప్రధానమంత్రినమస్తే సోదరా.

రైతునేను గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాకు చెందిన ధారి నుంచి వచ్చానునా పేరు భావన గొండవియామా ఎఫ్‌పీఓలో 1,700 మంది రైతులు ఉన్నారుమేం వరుసగా నాలుగు సంవత్సరాలుగా 20 శాతం డివిడెండ్ చెల్లిస్తున్నాం

ప్రధానమంత్రి: 1,700 మంది రైతులు?

రైతుఅవును సర్

ప్రధానమంత్రిమొత్తం ఎంత భూమి సాగులో ఉంది?

రైతుమేం 1,500 ఎకరాల్లో సాగు చేస్తున్నాంనాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా 20 శాతం డివిడెండ్ ఇస్తున్నాంఇది రూ. 200 కోట్లకు పైగా ఉంటుంది.

ప్రధానమంత్రివారు వేర్వేరు పంటలు పండిస్తారా లేదా నిర్ణీత ప్రణాళికను అనుసరిస్తారా?

రైతుమేం కనీస మద్దతు ధర కింద కూడా పని చేస్తాంమా ఎఫ్‌పీఓకు నిధులు లేనప్పుడు ప్రభుత్వం ఎటువంటి హామీ లేకుండా రూ. 2 కోట్లు అందించడం మా అతిపెద్ద విజయంఅది ఒక ముఖ్యమైన మైలురాయి.

రైతునమస్కారం ప్రధానమంత్రి గారునా పేరు సునీల్ కుమార్.. రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి వచ్చానుమేం ప్రధానంగా 'ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్' (ఐపీఎంపద్ధతిని ఉపయోగించి సేంద్రియ పద్ధతిలో జీలకర్రను సాగు చేస్తాం

ప్రధానమంత్రిఅర్థమైంది.

రైతుమా ఎఫ్‌పీఓలో 1,035 మంది రైతులు ఉన్నారువారు జీలకర్రఇసబ్‌గోల్ పండిస్తున్నారు.

ప్రధానమంత్రిజీలకర్ర మార్కెట్ ఎక్కడ ఉంది?

రైతుమేం గుజరాత్‌లోని వివిధ ఎగుమతిదారులకు సరఫరా చేస్తాంవారు దానిని ముందుకు తీసుకెళ్తారు.

ప్రధానమంత్రిఎవరైనా ఇసబ్‌గోల్ ఐస్‌క్రీమ్ తయారు చేయడానికి ప్రయత్నించారా?

రైతులేదు సర్

ప్రధానమంత్రిమార్కెట్ అవకాశాలను ఒక్కసారి ఊహించుకోండి!

రైతుఅవును సర్విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి ప్రధానమంత్రి గారి చిన్న ఆలోచన మమ్మల్ని ఉత్తేజపరిచిందిఐస్‌క్రీమ్ గురించి మేం ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించలేదుకానీ ఇప్పుడు దాని గురించి పరిశీలిస్తాం

రైతునేను మీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసికి సమీపంలో ఉన్న మీర్జాపూర్ నుంచి ధర్మేంద్ర కుమార్ మౌర్యనుమేం చిరుధాన్యాలపై పని చేస్తున్నాము.

ప్రధానమంత్రిచిరుధాన్యాలా?

రైతుఅవను సర్

ప్రధానమంత్రిమీరు వాటిని ప్యాక్ చేసి బ్రాండ్ పేరుతో అమ్ముతున్నారా?

రైతుఅవును సర్మేం ఒక ఎంవోయూ కింద రక్షణఎన్డీఆర్ఎఫ్‌కి సరఫరా చేస్తున్నాం

రైతునా పేరు ఫయాజ్ అహ్మద్కాశ్మీర్ నుంచి వచ్చానుమేం సేపులను ఉత్పత్తి చేస్తాం

ప్రధానమంత్రిసేపులా!

రైతుఅవును.

ప్రధానమంత్రిసేపుల కోసం రవాణా సౌకర్యం పొందారా?

రైతుఅవును వాహనాన్ని ఏర్పాటు చేశారు

ప్రధానమంత్రి: 60,000 టన్నుల పండ్లుకూరగాయలుపూలు రైలు మార్గంలో ఢిల్లీకి చేరుకున్నాయి.

రైతుఅవునుఅవి ఢిల్లీఇతర ప్రాంతాలకు చేరుకున్నాయి.

ప్రధానమంత్రిఅది చాలా అద్భుతమైన విజయం

రైతుకానీ...

ప్రధానమంత్రిట్రక్కులు చాలా సమయం తీసుకుంటాయి.

రైతుమాది మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌నా పేరు రోషిక్ సుక్లంమేం ఏరోపోనిక్స్ పద్ధతిలో బంగాళాదుంప విత్తనాలను ఉత్పత్తి చేస్తాం

ప్రధానమంత్రికచ్చితంగా.

రైతుఅవునండిమేం నిలువుఅడ్డు సాగు పద్ధతులను ఉపయోగిస్తాంఇవి బంగాళాదుంప విత్తనాలుఇవి బంగారం కాకపోయినా బంగారం అంత విలువైనవిఎందుకంటే రైతులు సాగు చేయడం కోసం మేం వీటిని అభివృద్ధి చేస్తాం

ప్రధానమంత్రిఅంటే మీరు అత్యున్నత స్థాయి అభివృద్ధిని చేస్తున్నారు...

రైతుబంగాళాదుంపలు.

రైతువేలాడే బంగాళాదుంపలు సర్

ప్రధానమంత్రిఇది జైనులకు బాగా సరిపోతుందిభూమి అడుగున పెరిగితే వారు తినరుభూమి పైన పెరిగితే తింటారు.

రైతుమేం నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడు ఆయనకు చిన్న దుంపలు చూపించాంఆయనకు అడ్డు వ్యవసాయంఏరోపోనిక్స్ గురించి తెలుసుఆయన వెంటనే వీటిని ‘జైన్ బంగాళాదుంపలు’ అని గుర్తించారుఆయన ఈ బంగాళాదుంపలను 'జైన్ పొటాటోస్అని పిలిచారు.

రైతుసర్.. నమస్కారంనా పేరు మొహమ్మద్ అస్లాంమాది రాజస్థాన్‌లోని బరాన్ జిల్లామేం వెల్లుల్లితో కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తాం.

ప్రధానమంత్రిమీరు ఎక్కడి నుంచి?

రైతురాజస్థాన్‌లోని బరాన్ జిల్లా సర్.

ప్రధానమంత్రిబరాన్రాజస్థాన్.

రైతుఅవునండిమేం వెల్లుల్లికి విలువ జోడిస్తాంపొడిపేస్టుఎగుమతి లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నాం

ప్రధానమంత్రిశనగపిండివెల్లుల్లితో అప్పడాలు తయారు చేసే ఒక యువకుడిని నేను కలిశాను.

రైతుసర్, 'మన్ కీ బాత్ద్వారా మీతో ఈ విషయం పంచుకోవడం నాకు గౌరవంగా ఉంది.

ప్రధానమంత్రిచాలా బాగుందిధన్యవాదాలు సోదరా.

 

***


(రిలీజ్ ఐడి: 2254539) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam