ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు ట్రంప్


ప్రెసిడెంట్ ట్రంప్ స్నేహపూర్వక బంధం పట్ల కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి

ఉక్రెయిన్ వివాదంపై శాంతియుత పరిష్కారానికి అధ్యక్షుడు ట్రంప్ చర్యలకు భారత్ మద్దతిస్తుందన్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2025 11:15PM by PIB Hyderabad

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు గౌరవ డొనాల్డ్ జె. ట్రంప్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ కాల్ చేశారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు చెప్పారు. ప్రెసిడెంట్ ట్రంప్ స్నేహపూర్వక బంధం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

 

భారత్-యూఎస్ సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇరువురు నేతలు నిబద్ధతను స్పష్టం చేశారు.

పలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను ఇద్దరు నేతలు పంచుకున్నారు. ఉక్రెయిన్ వివాదానికి సంబంధించి శాంతియుత పరిష్కారం దిశగా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు ప్రధానమంత్రి మద్దతు తెలిపారు.

ఇరుదేశాల నేతలు నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్ణయించుకున్నారు.


(రిలీజ్ ఐడి: 2254484) సందర్శకుల సూచీ సంఖ్య : : 24