ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 DEC 2025 11:19PM by PIB Hyderabad

2025 డిసెంబర్ 16, 17 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇథియోపియాలో తన తొలి ద్వైపాక్షిక పర్యటన చేపడుతున్నారుఅడీస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ రోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సత్కరించారుభారత్-ఇథియోపియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చేసిన విశిష్ట కృషికిప్రపంచ రాజనీతిజ్ఞుడిగా ఆయన దార్శనిక నాయకత్వానికి ఈ పురస్కారం లభించింది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన దేశం నుంచి ఈ పురస్కారాన్ని స్వీకరించడం తనకు దక్కిన గౌరవమనిదానిని వినయంగాకృతజ్ఞతతో స్వీకరిస్తున్నానని తెలిపారుఈ గౌరవాన్ని తనకు అందించినందుకు ప్రధాని డాక్టర్ అబీయ్‌కుఇథియోపియా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారుజాతీయ ఐక్యతసుస్థిర విధానాలుసమగ్రాభివృద్ధిని ప్రోత్సహిస్తున్న ప్రధాని డాక్టర్ అబీయ్‌ నాయకత్వాన్ని ప్రశంసించారుదేశ నిర్మాణంలో జ్ఞానానికున్న ప్రాధాన్యతను వివరిస్తూ.. ఇథియోపియా ప్రగతికిఅభివృద్ధికి శతాబ్దానికి పైగా తోడ్పడటం భారతీయ ఉపాధ్యాయులకు దక్కిన గొప్ప అవకాశమని ప్రధానమంత్రి మోదీ అన్నారు.

శతాబ్దాలుగా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందిస్తున్న భారతీయులుఇథియోపియన్లకు ఈ పురస్కారాన్ని ప్రధానమంత్రి అంకితం చేశారుఅలాగే ఈ గౌరవాన్ని తనకు అందించినందుకు 1.4 బిలియన్ల మంది భారతీయుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారుభారత్ఇథియోపియా మధ్య సన్నిహిత సంబంధాల్లో ఓ ముఖ్యమైన సందర్భాన్ని 
ఈ పురస్కారం సూచిస్తుందనిగ్లోబల్ సౌత్ కోసం సానుకూల అజెండాను మరింత ముందుకు తీసుకెళుతుందన్నారుప్రధానమంత్రి పూర్తి ప్రసంగం ఇక్కడ చదవొచ్చు. [Link]

 

(రిలీజ్ ఐడి: 2254326) సందర్శకుల సూచీ సంఖ్య : : 16