ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు సెంట్రల్ హాలులో రాజ్యాంగ దినోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
26 NOV 2025 9:39PM by PIB Hyderabad
రాజ్యాంగ దినోత్సవం నేపథ్యంలో ఈ రోజు ఉదయం న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనం సెంట్రల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకర్తల దార్శనికతను ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగంలో పొందుపరచిన ఆదర్శాల బలోపేతంలో దేశ ప్రజానీకానికిగల సమష్టి బాధ్యతను పునరుద్ఘాటించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇవాళ ఉదయం న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనం చారిత్రక సెంట్రల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నాను. మన రాజ్యాంగ రూపకర్తల దార్శనికతను మరోసారి స్మరించుకుంటూ రాజ్యాంగ ఆదర్శాల బలోపేతంపై మనందరి సమష్టి బాధ్యతను పునరుద్ఘాటించాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2254294)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam