ప్రధాన మంత్రి కార్యాలయం
హంగేరీ ఎన్నికల్లో గెలిచిన శ్రీ పీటర్ మగ్యర్‌కు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2026 11:40AM by PIB Hyderabad
ఎన్నికల్లో శ్రీ పీటర్ మగ్యర్, తిస్జా పార్టీ అఖండ విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హార్దిక అభినందనలను తెలియజేశారు.
భారత్, హంగేరీల మధ్య ప్రగాఢ మైత్రి, ఉమ్మడి విలువలతో పాటు చాలా కాలంగా పరస్పర గౌరవ భావం నెలకొందని ప్రధానమంత్రి అన్నారు. ద్వైపాక్షిక సహకారాన్ని ఇప్పటి కన్నా మరింత బలపరచడానికి, రెండు దేశాల ప్రజల ఉమ్మడి సమృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవడానికీ శ్రీ మగ్యర్‌తో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ :
‘‘ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన శ్రీ పీటర్ మగ్యర్‌కీ, తిస్జా పార్టీకీ హృదయపూర్వక అభినందనలు. భారత్, హంగేరీల మధ్య ప్రగాఢ మైత్రి, ఉమ్మడి విలువలతో పాటు చాలా కాలం నుంచీ పరస్పర గౌరవ భావన కూడా నెలకొంది. ద్వైపాక్షిక సహకారాన్నిమరింత బలపరిచే దిశగా, రెండు దేశాల ప్రజల ఉమ్మడి సమృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు పోయే దిశగా మీతో కలిసి పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2251462)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam