హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పూచీకత్తులేని రుణాల ద్వారా చిరువర్తకులు, అంకుర సంస్థలను సాధికారికంగా మలచిన మోదీ ప్రభుత్వం.. స్వయం ఉపాధికీ, చిన్న పరిశ్రమలకూ ఊతం: కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


· ఈ సంక్షేమ పథకం కింద గత పదకొండేళ్లలో రూ. 40 లక్షల కోట్ల విలువైన 58 కోట్ల రుణాల పంపిణీ

· 12 కోట్ల మంది యువతకు లబ్ధి... స్వావలంబన భారత నిర్మాణం దిశగా నవోత్తేజంతో పయనం

· వీటిలో మూడింట రెండు ముద్రా రుణాలు మహిళలకే.. మహిళా సాధికారత, స్వావలంబన దిశగా చరిత్రాత్మక విజయమిది

నాడు పోస్టు చేయడమైనది: 08 APR 2026 2:17PM by PIB Hyderabad

పూచీకత్తులేని రుణాలను అందించడం ద్వారా చిరువర్తకులు, అంకుర సంస్థలను మోదీ ప్రభుత్వం సాధికారికంగా నిలిపిందని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. తద్వారా ప్రభుత్వం స్వయం ఉపాధికి ఊతమివ్వడంతోపాటు, చిన్న పరిశ్రమల్లో ఉత్తేజాన్ని నింపిందన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజనకు 11 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు: -

“ముద్ర యోజన ప్రారంభమైన 11 ఏళ్లలో.. పూచీకత్తులేని రుణాలను అందించడం ద్వారా చిరువర్తకులు, అంకుర సంస్థలను శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధికారికంగా నిలిపింది. తద్వారా స్వయం ఉపాధికి ఊతమివ్వడంతోపాటు చిన్న పరిశ్రమల్లో ఉత్తేజాన్ని నింపింది. గత పదకొండేళ్లలో రూ. 40 లక్షల కోట్ల విలువైన 58 కోట్ల రుణాలను ఈ సంక్షేమ పథకం కింద ప్రభుత్వం పంపిణీ చేసింది. దీంతో 12 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూరింది. ఆత్మనిర్భర భారత్ నిర్మాణం దిశగా సాగుతున్న దేశ పయనానికి ఇది నవోత్తేజాన్నిచ్చింది. ప్రతీ మూడు ముద్ర రుణాల్లో రెండింటిని మహిళలకే అందించాం. మహిళా సాధికారత, ఆత్మనిర్భరత దిశగా సాధించిన చరిత్రాత్మక విజయమిది.”

 

*** 


(రిలీజ్ ఐడి: 2250015) సందర్శకుల సూచీ సంఖ్య : : 79
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Kannada