పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇటీవలి పశ్చిమాసియా పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ


· పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాల దృష్ట్యా ఆహార భద్రతా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోన్న ప్రభుత్వం

· ఆహార వస్తువుల ధరలు, సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరాయంగా పరస్పర చర్యలు, సమాచార మార్పిడిని సులభతరం చేయడానికి ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసిన వినియోగదారుల వ్యవహారాల శాఖ

· ప్రజా పంపిణీ వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల్లో తగినంత సరఫరాను నిర్ధారించడానికి అందుబాటులో బియ్యం, గోధుమల నిల్వలు

· దాదాపు 97 శాతానికి పెరిగిన మొత్తం ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు

· సాధారణంగా కొనసాగుతున్న గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా.. 2026 మార్చి 1 నుంచి ఇప్పటివరకు గృహాలకు 18 కోట్లకు పైగా సిలిండర్ల పంపిణీ

· దేశవ్యాప్తంగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల కోసం 550 అవగాహన కార్యక్రమాల నిర్వహణ.. వీటిలో 6,700కి పైగా సిలిండర్లు విక్రయం

· వాణిజ్య ఎల్‍పీజీ పంపిణీ ప్రణాళిక కోసం రాష్ట్ర అధికారులు, పారిశ్రామిక సంస్థలతో సమన్వయం చేసుకోవడానికి ఏర్పాటైన ముగ్గురు సభ్యుల కమిటీ

· గడచిన రెండు రోజుల్లో హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన భారతీయ జెండాతో ఉన్న రెండు ఎల్‌పీజీ నౌకలు 'గ్రీన్ సాన్వి' , 'గ్రీన్ ఆశా'

· గల్ఫ్, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తోన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. భారతీయుల భద్రత, సంక్షేమానికే అత్యున్నత ప్రాధాన్యత

నాడు పోస్టు చేయడమైనది: 06 APR 2026 6:03PM by PIB Hyderabad

పశ్చిమాసియా పరిణామాలపై మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే నిరంతర ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో ఒక సమావేశాన్ని నిర్వహించింది. పెట్రోలియం- సహజ వాయువుఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలువిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఇంధన లభ్యతసముద్రయాన కార్యకలాపాలుఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తోన్న సహాయం గురించి తాజా సమాచారాన్ని పంచుకున్నారు. వీటితో పాటు వివిధ రంగాల్లో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. వినియోగదారుల వ్యవహారాలుఆహార- ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కూడా ఆహార భద్రత విషయంలో సన్నద్ధత చర్యలునిత్యావసరాల ధరలపై తాజా నివేదికను అందించింది.

ఆహార భద్రతధరలకు సంబంధించిన తాజా సమాచారం

నిత్యావసరాల లభ్యతప్రస్తుత ధరల పరిస్థితిపై తాజా సమాచారాన్ని వినియోగదారుల వ్యవహారాలుఆహార- ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తగినంత సరఫరాను నిర్ధారించడానికిమార్కెట్ స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకుంటున్న చర్యలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా చెప్పారు. మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు:

ఆహార భద్రత విషయంలో సన్నద్ధత

·   పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆహార భద్రత పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోంది.

·   ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) కోసం తగినంత సరఫరా ఉండేలా చూసుకునేందుకుఏదైనా అత్యవసర అవసరాలను తీర్చడానికి బియ్యంగోధుమల నిల్వలు (బఫర్ స్టాక్) సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి.

·  జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) ప్రకారం బలహీన వర్గాలకు ఆహారధాన్యాలు నిరంతరం లభించేలా ప్రభుత్వం చూసుకుంటోంది. 

మార్కెట్ జోక్యం – బహిరంగ మార్కెట్ విక్రయ పథకం (దేశీయ)

·  ఆహారధాన్యాల ధరలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. అవసరమైనప్పుడల్లా 'బహిరంగ మార్కెట్ విక్రయ పథకం - దేశీయ' (ఓఎంఎస్ఎస్ – డీ) ద్వారా మార్కెట్ జోక్యానికి సంబంధించిన చర్యలను చేపడుతుంది.

·  ఓఎంఎస్ఎస్-డీ కింద సరఫరాను పెంచడానికిధరలను స్థిరీకరించడానికిద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి మిగులు గోధుమలుబియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బహిరంగ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. 

·  అవసరమైతే ఇటువంటి జోక్యానికి సంబంధించిన చర్యలను చేపట్టడానికి ఎఫ్‌సీఐ వద్ద తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

·  అదనపు అవసరాలను తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు రాయితీతో కూడిన స్థిర ధరల వద్ద బియ్యాన్ని విక్రయించడానికి కూడా ఈ పథకం వీలు కల్పిస్తుంది.

సేకరణ – ఆర్ఎంఎస్ 2026–27

·  2026–27 రబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్ఎంఎస్) కోసం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కింద గోధుమల సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనసాగుతోంది. 

·  సేకరణ సన్నద్ధతపై వినియోగదారుల వ్యవహారాల శాఖ క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తోంది. 

·  సేకరణ ప్రక్రియ సజావుగా సాగడానికి అవసరమైన ప్యాకింగ్ సామాగ్రి తగినంతగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఆహారధాన్యాల ప్యాకేజింగ్

·  ఆర్ఎంఎస్ 2026–27 సమయంలో ప్యాకింగ్ సామాగ్రి లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

·  రసాయనాలు- పెట్రోకెమికల్స్ విభాగంపెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖల సమన్వయంతో  ప్యాకింగ్ వనరులను వినియోగదారుల వ్యవహారాల శాఖ వైవిధ్యపరుస్తోంది. ప్యాకింగ్ సామాగ్రి కొరత ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. 

వంట నూనెల పరిస్థితి

·  ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా వంట నూనెల లభ్యత సంతృప్తికరంగా ఉంది.

·  ఇండోనేషియామలేషియాఅర్జెంటీనాబ్రెజిల్ వంటి కీలక భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతులు నిలకడగా కొనసాగుతున్నాయి.

·  ఆవాల ఉత్పత్తి మెరుగుపడటంతో దేశీయ సరఫరా మరింత బలోపేతం అయ్యింది.

·  మొత్తం మీద వంట నూనెల సరఫరా స్థిరంగా ఉంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.. అవసరమైతే జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.

చక్కెర రంగం

·  చక్కెర నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి. 2025–26 సంవత్సరానికి చక్కెర ఉత్పత్తి దేశీయ అవసరాలకు సరిపడా ఉంటుందన్న అంచనా వేశారు. 

·  సుమారు 15.80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) చక్కెర ఎగుమతికి అనుమతి లభించగా.. అందులో ఇప్పటికే 3.73 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర ఎగుమతి అయింది. 

·  ప్రధానంగా శ్రీలంకపశ్చిమాసియాతూర్పు ఆఫ్రికా దేశాలకు చక్కెర ఎగుమతులు అవుతున్నాయి. 

·  చక్కెర చిల్లర ధరలు స్థిరంగా ఉన్నాయి. గత మూడేళ్లుగా చక్కెర ద్రవ్యోల్బణం దాదాపు శాతం వద్దే ఉంది. 

నిత్యావసర వస్తువుల ధరలు

·  దేశవ్యాప్తంగా ఉన్న 578 కేంద్రాల నుంచి అందుతున్న సమాచారం ఆధారంగా ప్రతిరోజూ 40 రకాల ఆహార వస్తువుల ధరలను వినియోగదారుల వ్యవహారాల శాఖ పర్యవేక్షిస్తుంది.

·  మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ధరల ధోరణులను నిశితంగా గమనిస్తున్నారు.

·  ఇప్పటివరకు ధరల్లో ఎటువంటి అసాధారణ హెచ్చుతగ్గులు కనిపించలేదు. చాలా వాటి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇది తగినంత లభ్యత ఉందన్న విషయాన్ని తెలియజేస్తోంది. 

·  నిత్యావసర ఆహార పదార్థాల సరఫరాలో ఎటువంటి అంతరాయాలు గానీ లేదా ద్రవ్యోల్బణ ప్రభావం పెరిగినట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవు.

పప్పుధాన్యాల లభ్యత

·  పప్పుధాన్యాల ఉత్పత్తి గత ఏడాది కంటే ఎక్కువగా ఉంటుందన్న అంచనా వేశారు. ఇది గత ఏడాది 257 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) ఉండగా ఈసారి సుమారు 266 లక్షల మెట్రిక్ టన్నులుగా చేరుకుంటుందని భావిస్తున్నారు. 

·  ప్రభుత్వం వద్ద సుమారు 28 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల నిల్వలు ఉన్నాయి. అలాగే 'ధర మద్దతు పథకంకింద కందులురబీ పప్పుధాన్యాల సేకరణ కొనసాగుతోంది.

·  ఇప్పటివరకు సుమారు 3.21 లక్షల మెట్రిక్ టన్నుల కందులు, 5.71 లక్షల మెట్రిక్ టన్నుల శనగలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 

పప్పుధాన్యాల దిగుమతి విధానం

·  సరఫరాలో వెసులుబాటునిలకడైన లభ్యతను నిర్ధారించడానికి 2025-26 నాటి ప్రస్తుత పప్పుధాన్యాల దిగుమతి విధానమే 2026–27 సంవత్సరానికి కొనసాగుతుంది. 

·  కందులుమినుముల దిగుమతిని 2027 మార్చి 31 వరకు 'ఉచితవిభాగం కింద అనుమతించారు. అయితే శనగలుఎర్రు కందిపప్పు (మసూర్) దిగుమతులపై 10 శాతం పన్నుబఠానీలపై (పసుపు బఠానీ) 30 శాతం పన్ను వర్తిస్తుంది. 

ఉద్యానవన పంటల లభ్యత (టీఓపీ)

·  బంగాళాదుంపటమాటాఉల్లి వంటి ప్రధాన ఉద్యానవన పంటల ఉత్పత్తి దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి సరిపడే స్థాయిలో ఉంది.

·  బంగాళాదుంప ఉత్పత్తి సుమారు 584 లక్షల మెట్రిక్ టన్నులుగా (గత ఏడాది 586 ఎల్ఎంటీ)టమాటా ఉత్పత్తి సుమారు 227 లక్షల మెట్రిక్ టన్నులుగాఉల్లి ఉత్పత్తి సుమారు 273 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంటుందని అంచనా వేశారు. 

·  2026–27 సంవత్సరానికి ఉల్లి ధరల స్థిరీకరణ నిల్వల లక్ష్యాన్ని 2 లక్షల మెట్రిక్ టన్నులుగా (ఎల్ఎంటీ) కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)ఎన్‌సీసీఎఫ్ (నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్)..  సేకరణకు సంబంధించిన పనులను ప్రారంభించాయి.

·  నిల్వలు (బఫర్ స్టాకింగ్) కోసం చేస్తోన్న 2026 రబీ ఉల్లి సేకరణ.. మార్కెట్ ధరలకు మద్దతునిస్తుందనిధరల్లో వచ్చే అస్థిరతను తగ్గిస్తుందని భావిస్తున్నారు.

పర్యవేక్షణఎన్‌ఫోర్స్‌మెంట్

·  ఆహార వస్తువుల ధరలుసరఫరాపై రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతర సంప్రదింపులుసమాచార మార్పిడిని సులభతరం చేయడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది.

·  ఈ కంట్రోల్ రూం నిత్యావసరాల చట్టం- 1955 అమలును కూడా పర్యవేక్షిస్తుంది. ఇందులో భాగంగా నిత్యావసరాల అక్రమ నిల్వలునల్లబజారు క్రయవిక్రయాలపై తీసుకునే చర్యలను పర్యవేక్షిస్తుంది.

·  దేశవ్యాప్తంగా 17 భాషల్లో అందుబాటులో ఉన్న జాతీయ వినియోగదారు హెల్ప్‌లైన్-1915 ద్వారా అందుతున్న ఫిర్యాదులను కూడా వినియోగదారుల వ్యవహారాల శాఖ నిశితంగా గమనిస్తోంది. ఈ హెల్ప్‌లైన్ వాట్సాప్ఇన్-గ్రామ్ పోర్టల్ వంటి వివిధ మాధ్యమాల ద్వారా కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వినియోగదారులు తమ ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకోవచ్చు.

ఇంధన సరఫరాఇంధన లభ్యత

హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులుఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై తాజా సమాచారాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వెల్లడించిన వివరాలు:

ప్రజా సూచనలుపౌరుల అవగాహన

·  పెట్రోల్డీజిల్ఎల్‌పీజీ విషయంలో భయాందోళనతో కూడిన కొనుగోళ్లు చేయొద్దని.. సమాచారం కోసం కేవలం అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని ప్రజలకు సూచించారు. 

·  ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకోవాలని.. డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లటాన్ని నివారించాలని కోరారు. 

·  పీఎన్‌జీవిద్యుత్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. 

ప్రభుత్వ సన్నద్ధతసరఫరా నిర్వహణ చర్యలు

·  ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో కూడా గృహావసరాల ఎల్‌పీజీపీఎన్‌జీ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా ఆసుపత్రులువిద్యాసంస్థలకు సరఫరా సజావుగా సాగేలా చూస్తోంది.

·  సరఫరాడిమాండ్ రెండింటి పరంగా ప్రభుత్వం ఇప్పటికే పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. చమురు శుద్ధి కేంద్రాల నుంచి ఉత్పత్తిని పెంచడం.. గ్యాస్ బుకింగ్ మధ్య విరామ సమయాన్ని పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకుగ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం.. ప్రాధాన్యత కలిగిన రంగాలకు సరఫరాను నిర్ధారించడం వంటివి ఇందులో ఉన్నాయి.

·  ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

·  చిన్నమధ్య తరహా వినియోగదారులకు పంపిణీ చేయడానికి రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ ఇండియాసింగరేణి కాలరీస్ సంస్థలను ఆదేశించింది. 

·  గృహవాణిజ్య వినియోగదారుల విషయంలో కొత్త పీఎన్‌జీ కనెక్షన్లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. 

·  పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్‌జీ) కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో తగినంత ఎల్‌పీజీ సరఫరాను నిర్ధారించే చర్యలను ప్రముఖంగా చెప్పారు. ముఖ్యంగా గృహఅత్యవసర అవసరాల కోసం ఎల్‌పీజీ పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలని.. అదే సమయంలో అక్రమ నిల్వలుమళ్లింపుతప్పుడు సమాచారంపై కఠినమైన నిఘా ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించారు. వలస కార్మికులకు ఇచ్చే ఎఫ్‌టీఎల్ ఎల్‌పీజీ సరఫరాకు సంబంధించి వస్తున్న వార్తలపై రాష్ట్రాలు స్పందించాయి. వలస కార్మికులకు అందుతున్న ఎల్‌పీజీ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని.. సరఫరా స్థిరంగా ఉందని అవి స్పష్టం చేశాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో (ఓఎంసీ) కలిసి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల పంపిణీని క్రమబద్ధీకరించడంపై రాష్ట్రాలు దృష్టి సారించొచ్చని కార్యదర్శి సూచించారు.

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలుసంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు

·  నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలునల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.

·  అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులుఅదనపు ప్రధాన కార్యదర్శులు లేదా ప్రిన్సిపల్ సెక్రటరీలు లేదా పౌర సరఫరాల శాఖ కార్యదర్శులకు ఈ కింది చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు:

ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడంక్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.

సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలుఅవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడంతిప్పికొట్టడం.

జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటంఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులుతనిఖీలను కొనసాగించడం.

సంబంధిత రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.

రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్‌కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.

పీఎన్‌జీ వినియోగంప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.

·  అక్రమ నిల్వలునల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలతో పాటు జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.

·  తప్పుడు సమాచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి తగినంత ఎల్‌పీజీ అందుబాటులో ఉందనే విషయాన్ని ప్రజలకు భరోసాగా తెలియజేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం 27.03.2026, 02.04.2026లలో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ముందస్తుక్రమబద్ధమైన ప్రజా సంబంధాలను బలోపేతం చేయాలని ఇందులో కోరింది. తగిన ఉన్న స్థాయి అధికారులతో ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించాలని సూచించింది. సామాజిక మాధ్యమాలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని సకాలంలో అందించాలని కోరింది.

·  ప్రస్తుతం 23 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.

ఎన్‌ఫోర్స్‌మెంట్, పర్యవేక్షణ చర్యలు

·         ఎల్‌పీజీ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా చర్యలు కొనసాగుతున్నాయి.

·         లక్షకు పైగా సోదాలు నిర్వహించి... 52,000లకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

·         850కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, సుమారు 220 మందిని అరెస్టు చేశారు.

·         ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేసి... 1500లకు పైగా షో-కాజ్ నోటీసులు జారీ చేశాయి. 118 ఎల్‌పీజీ పంపిణీ సంస్థలకు జరిమానాలు విధించారు. 41 పలు పంపిణీ సంస్థలను సస్పెండ్ చేశారు.

ఎల్‌పీజీ సరఫరా

·         గృహాలకు ఎల్‌పీజీ సరఫరా స్థితి:

·         ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరా ప్రభావితమవుతోంది.

·         ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల్లో సరఫరా నిలిచిపోయినట్లు ఎటువంటి నివేదికలు లేవు.

·         పరిశ్రమ వ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 97 శాతానికి పెరిగాయి.

·         సిలిండర్ల దారి మళ్లింపును నివారించడానికి, డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీలు సుమారు 90 శాతానికి పెరిగాయి.

·         2026 మార్చి 1వ తేదీ నుంచి గృహాలకు 18 కోట్లకు పైగా సిలిండర్లు పంపిణీ చేయడంతో గృహాలకు ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోంది.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:

·         ఫార్మాస్యూటికల్స్, పశుసంవర్ధక, రసాయనాలు, పెట్రోకెమికల్స్ విభాగం, డీపీఐఐటీ మొదలైన విభాగాలకు ప్రొపిలీన్, పాలిప్రొపిలీన్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, బ్యూటాడైన్, బ్యూటైల్ అక్రిలేట్ వంటి పెట్రోకెమికల్స్ లభ్యత సంబంధిత సమస్యలను పరిశీలించడానికి ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ రంగాల కోసం రిఫైనరీ - పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ల ద్వారా నిర్దిష్ట పరిమాణంలో సీ3-సీ4 అణువులను మళ్లించాలని ఈ బృందం సిఫార్సు చేసింది. ఎల్‌డీపీఈ, ఎల్ఎల్‌డీపీఈ, హెచ్‌డీపీఈ మొదలైన సీ2 ఆధారిత ఉత్పన్నాలకు ఫీడ్‌స్టాక్ లభ్యత, డౌన్‌స్ట్రీమ్ యూనిట్లకు వాటి సరఫరా కోసం ఈ బృందం సిఫార్సులు చేసింది.

·         10 శాతం సంస్కరణ-అనుసంధాన కేటాయింపు సహా, మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును సంక్షోభానికి ముందు స్థాయిల్లో సుమారు 70 శాతానికి పెంచారు.

2026 మార్చి 23 నుంచి సుమారు 6.75 లక్షల 5-కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

·         ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, కేరళం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పీఎస్‌యూ ఓఎమ్‌సీలు 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల కోసం సుమారు 550 అవగాహన శిబిరాలను నిర్వహించారు.

·         ఈ శిబిరాల్లోనూ 6,700లకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

·         వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీకి ప్రణాళిక రూపొందించేందుకు ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లకు చెందిన కార్యనిర్వాహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ... రాష్ట్ర అధికారులు, పారిశ్రామిక సంస్థలతో సమన్వయం చేస్తోంది.

·         2026 మార్చి 14 నుంచి సుమారు 79,909 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (42 లక్షలకు పైగా 19-కేజీ సిలిండర్లకు సమానం) విక్రయించారు.

·         సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు

·         దేశీయ పీఎన్‌జీ, సీఎన్‌జీ రవాణాకు 100 శాతం సరఫరా సహా, ప్రాధాన్యతా రంగాలకు రక్షిత సరఫరాలు కొనసాగుతున్నాయి.

·         పనిచేస్తున్న యూరియా ప్లాంట్‌లకు గ్యాస్ సరఫరా ప్రస్తుతం వాటి ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 70–75 శాతంగా ఉంది. దీనిని 2026 ఏప్రిల్ 6 (ఈ రోజు) నుంచి సుమారు 90శాతానికి పెంచాలని ప్రణాళిక చేశారు.

·         సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌లు సహా ఇతర పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను 2026 ఏప్రిల్ 6 (ఈ రోజు) నుంచి అదనంగా 10 శాతం పెంచనున్నారు.

·         హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలు పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యమిచ్చేలా ప్రోత్సహించాలని సీజీడీ సంస్థలకు సూచించారు.

·         ఐజీఎల్, ఎమ్‌జీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్, వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్‌ల కోసం ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

·         సీజీడీ నెట్‌వర్క్‌ల విస్తరణకు అవసరమైన ఆమోదాలను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరారు.

·         ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక పరివర్తనలో సహాయపడే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10 శాతం కేటాయింపును భారత ప్రభుత్వం 18.03.2026 తేదీ నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.

·         పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులను పొందుతున్నాయి.

·         పైప్‌లైన్‌లు అందుబాటులో ఉన్నచోట పాఠశాలలు, హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, అంగన్‌వాడీ కిచెన్‌ల వంటి సంస్థలను ఐదు రోజుల్లోగా పీఎన్‌జీతో అనుసంధానించాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది.

·         దరఖాస్తులను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిశీలించడానికి, సీజీడి మౌలిక సదుపాయాల కోసం మూడు నెలల పాటు త్వరిత ఆమోద విధాన ప్రణాళికను రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.

·         నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్‌లు, ఇతర సౌకర్యాల ఏర్పాటు, నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వులు-2026ను భారత ప్రభుత్వం 24.03.2026 తేదీ నాటి గెజిట్ ద్వారా నోటిఫై చేసింది.

·         ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పైప్‌లైన్‌లు వేయడానికి, విస్తరించడానికి ఒక క్రమబద్ధమైన, కాలపరిమితితో కూడిన విధాన ప్రణాళికను అందిస్తాయి. ఇది అనుమతులు, భూమి లభ్యతలో జాప్యాలను పరిష్కరించడం సహా నివాస ప్రాంతాలు, సహజ వాయు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి వీలు కల్పిస్తుంది.

·         ఇది పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, మారుమూల ప్రాంతాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని, పరిశుద్ధ ఇంధనాలకు మారడానికి మద్దతునిస్తూ ఇంధన భద్రత బలోపేతం ద్వారా భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.

·         రక్షణ శాఖ నివాస ప్రాంతాల్లో పీఎన్‌జీ మౌలిక సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేయడానికి, రక్షణ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 30 వరకు ఒక స్వల్పకాలిక విధాన సవరణను జారీ చేసింది.

·         పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి జాతీయ పీఎన్‌జీ డ్రైవ్ 2.0ను పీఎన్‌జీఆర్‌బీ 2026 జూన్ 30 వరకు పొడిగించింది.

·         మార్చి 2026 నుంచి సుమారు 3.67 లక్షల పీఎన్‌జీ కనెక్షన్‌లకు గ్యాసిఫికేషన్ పూర్తయింది. అదనంగా దాదాపు 4 లక్షల మంది వినియోగదారులు కొత్త కనెక్షన్‌ల కోసం నమోదు చేసుకున్నారు.

·         ముడి చమురు స్థితి, రిఫైనరీ కార్యకలాపాలు

·         అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తుండగా... పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయి.

·         గృహ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.

·         రిటైల్ ఇంధన లభ్యత, ధరల చర్యలు

·         దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్‌లెట్‌లు యధావిధిగా పనిచేస్తున్నాయి.

·         మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరల్లో అసాధారణ పెరుగుదల నమోదైంది. వినియోగదారులకు అండగా ఉన్న భారత ప్రభుత్వం... పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.

·         దేశీయంగా తగినంత లభ్యతను నిర్ధారించడానికి డీజిల్‌పై లీటరుకు రూ. 21.5, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 29.5 చొప్పున ఎగుమతి సుంకాన్ని విధించారు.

·         రిటైల్ అవుట్‌లెట్లలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా యథాతథంగా ఉన్నాయి.

·         వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం పౌరులకు సూచించింది. పత్రికా సమావేశాల ద్వారా కచ్చితమైన సమాచారాన్ని ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు

·         సాధారణ కేటాయింపులకు అదనంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,000ల కిలోలీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.

·         2026 మార్చి 29 నాటి గెజిట్ నోటిఫికేషన్, ఎస్‌కేవో-రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్దేశిత పీఎస్‌యూ ఓఎమ్‌సీ సర్వీస్ స్టేషన్ల ద్వారా వంట, దీపాల ప్రయోజనం కోసం పీడీఎస్ సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (ఎస్‌కేవో) పంపిణీకి అనుమతిస్తుంది.

·         18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కేఓ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయగా... హిమాచల్ ప్రదేశ్, లదాఖ్‌లు దీని అవసరం లేదని సమాచారమిచ్చాయి.

·         నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు

·         పర్షియన్ గల్ఫ్‌లోని ప్రస్తుత నౌకా వాణిజ్య పరిస్థితితో పాటు భారతీయ నౌకలు, సిబ్బంది రక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. కింది విషయాలు తెలియజేశారు:

·         నౌకా వాణిజ్యం నిరంతరాయంగా కొనసాగేలా చూస్తూనే... నౌకాయాన కార్యకలాపాలు, ఓడరేవు కార్యకలాపాలు, భారతీయ నావికుల భద్రతను నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది.

·         ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి ఘటన నమోదు కాలేదు.

·         గత రెండు రోజుల్లో భారత జెండా కలిగిన రెండు ఎల్‌పీజీ నౌకలు గ్రీన్ సాన్వి, గ్రీన్ ఆశాలు హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. గ్రీన్ సాన్వి నౌకలో 25 మంది నావికులు సహా సుమారు 46,650 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ ఉండగా... గ్రీన్ ఆశా నౌకలో 26 మంది నావికులు సహా సుమారు 15,405 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ ఉంది.

·         ప్రస్తుతం, 433 మంది భారతీయ నావికులతో కూడిన 16 భారత జెండా నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్‌పీఎస్‌ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్ల సమన్వయంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.

·         డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24×7 పనిచేస్తూనే ఉంది. యాక్టివేషన్ అయినప్పటి నుంచి 5,113 కాల్‌లు, 10,647 ఈమెయిళ్లను నిర్వహించింది. ఇందులో గత 24 గంటల్లో వచ్చిన 25 కాల్‌లు, 100 ఈమెయిళ్లూ ఉన్నాయి.

·         డీజీ షిప్పింగ్ ఇప్పటివరకు 1,599 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో సహాయపడింది. వీరిలో గత 24 గంటల్లో గల్ఫ్‌లోని విమానాశ్రయాలు, వివిధ ప్రాంతీయ ప్రదేశాల నుంచి 120 మందిని సురక్షితంగా భారత్‌కు తరలించింది.

·         దేశవ్యాప్తంగా ఓడరేవు కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయి. ఎటువంటి రద్దీ నమోదు కాలేదు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్ర మారిటైమ్ బోర్డులు కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ధ్రువీకరించాయి.

·         భారతీయ నావికుల సంక్షేమాన్ని, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడానికి... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ మిషన్లు, నౌకా వాణిజ్య రంగ భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.

·         ఈ ప్రాంతంలో భారతీయ పౌరుల భద్రత

·         భారత మిషన్ల ద్వారా అందిస్తున్న సహాయం సహా, ఈ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలను బ్రీఫింగ్ సందర్భంగా పంచుకున్నారు. కింది విషయాలు తెలియజేశారు:

·         విదేశాంగ మంత్రి ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రులతో టెలిఫోన్‌లో సంభాషించి... పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై చర్చించారు.

·         విదేశీ వ్యవహారాల మంత్రికి ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి నుంచీ ఫోన్ కాల్ వచ్చింది. ఈ సందర్భంగా ఇరుపక్షాలు ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

·         టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు 1,777 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్‌బైజాన్‌లకు తరలించి... అక్కడి నుంచి భారత్ పంపేందుకు చర్యలు చేపట్టింది. వీరిలో 895 మంది భారతీయ విద్యార్థులు, 345 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు. ఈ మత్స్యకారులు ఈ నెల 4న అర్మేనియా నుంచి చెన్నైకి చేరుకున్నారు. ఈ రాయబార కార్యాలయం బంగ్లాదేశ్‌కు చెందిన ఒకరు, శ్రీలంకకు చెందిన మరొకరు... ఇద్దరు విదేశీ పౌరుల తరలింపులోనూ సహాయం చేసింది.

·         భారతీయ పౌరులు తొలుత మొత్తం 1,545 మంది అర్మేనియాలోకి, 234 మంది అజర్‌బైజాన్‌లోకి ప్రవేశించారు. అనంతరం వారిని అక్కడ నుంచి సురక్షితంగా భారత్ తరలించడంలో సహకరించిన ఇరాన్, అర్మేనియా, అజర్‌బైజాన్ అధికారులకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది.

·         భారతీయ పౌరుల భద్రత, క్షేమం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.

·         భారత పౌరులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సన్నిహిత సమన్వయం ద్వారా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉంది.

·         ఈ ప్రాంతం అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టులు నిరంతరం పనిచేస్తూ, 24×7 హెల్ప్‌లైన్‌లను నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తూ... భారతీయ కమ్యూనిటీ సంఘాలు, సంస్థలు, కంపెనీలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నాయి.

·         వీసా సౌకర్యం, కాన్సులర్ సేవలు, లాజిస్టికల్ మద్దతు, గగనతల పరిమితులు వర్తించే పొరుగు దేశాల గుండా రవాణాను సులభతరం చేయడం సహా... మిషన్లు భారతీయ పౌరులకు సహాయాన్ని కొనసాగిస్తున్నాయి. వారు స్థానిక ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు.

·         గల్ఫ్ దేశాల్లోని భారతీయ విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత కొనసాగుతోంది. వారి విద్యా షెడ్యూళ్లు, జేఈఈ, నీట్ వంటి పరీక్షలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూసేందుకు గానూ స్థానిక అధికారులు, భారతీయ పాఠశాలలు, విద్యా బోర్డులు, జాతీయ పరీక్షా సంస్థతో మిషన్లు సమన్వయం చేసుకుంటున్నాయి.

·         ఈ ప్రాంతంలోని భారతీయ నావికులకూ మిషన్లు మద్దతునందిస్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక అధికారులతో సమన్వయం, కాన్సులర్ సహాయం, కుటుంబాలతో సంప్రదింపులను సులభతరం చేయడంతో పాటు భారత్‌కు తిరిగి రావడం కోసం చేసే అభ్యర్థనలకు సహాయం చేయడం వంటివి ఈ చర్యల్లో భాగంగా ఉన్నాయి.

·         ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 7,30,000ల మంది ప్రయాణికులు భారత్‌కు వచ్చారు.

·         యూఏఈలోని విమానయాన సంస్థలు కార్యాచరణ, భద్రతాపరమైన అంశాల ఆధారంగా పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులను కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు సుమారు 90 విమానాలు భారత్‌కు నడుస్తాయని అంచనా.

·         సౌదీ అరేబియా, ఒమన్ దేశాల నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.

·         ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచే ఉంది. ఈ రోజు ఖతార్ ఎయిర్‌వేస్ సుమారు 8–10 విమానాలను భారత్‌కు నడపనుంది.

·         కువైట్ గగనతలం మూసి ఉంది. సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ షెడ్యూల్ చేయని విమానాలను భారత్‌కు నడుపుతున్నాయి.

·         బహ్రెయిన్ గగనతలం మూసి ఉంది. గల్ఫ్ ఎయిర్ సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి షెడ్యూల్ చేయని విమానాలను భారత్‌కు నడుపుతోంది.

·         విమాన ప్రయాణ ఆంక్షలు, గగనతల మూసివేతల కారణంగా ప్రత్యామ్నాయ రవాణా మార్గాల ద్వారా భారత పౌరుల రవాణా ఇలా కొనసాగుతోంది.

·         ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్, జోర్డాన్‌ల మీదుగా.

·         ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మీదుగా.

·         ఇరాక్ నుంచి జోర్డాన్, సౌదీ అరేబియాల మీదుగా.

·         కువైట్, బహ్రెయిన్‌ల నుంచి సౌదీ అరేబియా మీదుగా.

 

***


(రిలీజ్ ఐడి: 2249486) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam