భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు 2026: రూ.650 కోట్లకు పైగా సొమ్ము స్వాధీనం

నాడు పోస్టు చేయడమైనది: 05 APR 2026 2:53PM by PIB Hyderabad
 
  • 2026 ఫిబ్రవరి 26న ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) పనిచేయడం ప్రారంభించినప్పటి నుంచి 2026 ఏప్రిల్ 5 వరకు సమాచారం దిగువ పేర్కొన్న విధంగా  ఉంది.

  1. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు సాధారణ ఎన్నికలు, మరో ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని 2026 మార్చి 15న ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కమిషన్ ఆదేశించింది.

  2. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, వాటికి సరిహద్దుగా ఉన్న 12 రాష్ట్రాలు/యూటీల ప్రధాన కార్యదర్శులు, సీఈవోలు, డీజీపీలు, ఉన్నతాధికారులు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధిపతులతో పలు పర్యాయాలు సమీక్ష సమావేశాలను కమిషన్ నిర్వహించింది. వారికి అహింసాయుతంగా, బెదిరింపులు లేని, ప్రలోభాలు లేని ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించింది.

  3. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫిర్యాదులను 100 నిమిషాల లోపే పరిష్కరించేలా చూసేందుకు 5,173కి పైగా ఫ్లయింగ్ స్క్వాడ్లను మోహరించారు. అదనంగా వివిధ ప్రదేశాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు 5,200కు పైగా స్థిర నిఘా బృందాల(ఎస్ఎస్‌టీ)ను సైతం ఏర్పాటు చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2249251) సందర్శకుల సూచీ సంఖ్య : : 96
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , Malayalam , Bengali , Bengali-TR , English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Gujarati