భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు 2026: ఈసీఐఎన్‌ఈటీ వేదిక ద్వారా అభ్యర్థి విద్యార్హతలు, నేర చరిత్ర వివరాలపై స్పష్టత

నాడు పోస్టు చేయడమైనది: 04 APR 2026 1:53PM by PIB Hyderabad
  1. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్ శాసనసభలకు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను.. గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపురలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసింది.

  2. అస్సాం, కేరళ శాసనసభలు, యూటీ అయిన పుదుచ్చేరితో పాటు మరో 4 రాష్ట్రాల్లో ఏప్రిల్ 9, 2026న జరగనున్న ఉప ఎన్నికల బరిలో మొత్తం 1,955 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

  3. పశ్చిమబెంగాల్ (ఫేజ్- I, II), తమిళనాడు శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్ (ఫేజ్-I)లో అభ్యర్థుల దరఖాస్తుల ఉపసంహరణకు ఏప్రిల్ 9వ తేదీ, పశ్చిమబెంగాల్ (ఫేజ్-II)లో ఏప్రిల్ 13వ తేదీ చివరి గడువు.

  4. అభ్యర్థుల నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వంటి వివరాలను తెలుసుకునేందుకు పౌరులు ఈసీఐనెట్‌లోని "మీ అభ్యర్థిని తెలుసుకోండి (కేవైసీ)” మాడ్యూల్‌ను ఉపయోగించుకోవచ్చు.

  5. వినియోగదారులు ఈసీఐనెట్‌లోని "కండక్ట్‌ ఆఫ్‌ ఎలక్షన్స్‌" ట్యాబ్ కిందనున్న కేవైసీ (మీ అభ్యర్థిని తెలుసుకోండి) మాడ్యూల్‌ను యాక్సెస్ చేయవచ్చు. అభ్యర్థులు సమర్పించిన పూర్తి అఫిడవిట్ (ఫామ్ 26)ను కూడా ఈసీఐనెట్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  6. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల సేవల వేదిక ఈసీఐనెట్‌, భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన 40కి పైగా యాప్‌లు, పోర్టళ్లను అనుసంధానించడం ద్వారా అన్ని ఎన్నికల సేవలను ఒకేచోట అత్యంత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

  7. ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో పేరు వెతకటం, దరఖాస్తుల స్థితిగతులను తెలుసుకోవటం, ఎన్నికల అధికారులతో సంప్రదింపులు, బీఎల్‌ఓతో కాల్ బుక్ చేసుకోవటం, ఈ-ఎపిక్ డౌన్‌లోడ్‌, పోలింగ్ సరళి, ఫిర్యాదుల పరిష్కారం వంటి సేవలను సురక్షితమైన వేదిక ద్వారా ఈసీఐనెట్‌ ఓటర్లకు అందిస్తుంది.

  8. ఇది తాజా సమాచారాన్ని పొందటానికి, ఫిర్యాదుల పరిష్కారానికి ఒకేచోట అన్ని సదుపాయాలు లభించే వేదికను అందిస్తుంది. ఇందులో ఎన్నికల ఉల్లంఘనలను నివేదించటానికి సీవిజిల్, దివ్యాంగులకు సులభంగా ఎన్నికల సేవలు అందేలా చూసేందుకు సక్షమ్ వంటి సాధనాలూ ఉన్నాయి.

 

****


(రిలీజ్ ఐడి: 2248948) సందర్శకుల సూచీ సంఖ్య : : 154
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Punjabi , Malayalam , Bengali , Bengali-TR , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati , Tamil