ప్రధాన మంత్రి కార్యాలయం
నక్సలిజంపై భారత్ నిర్ణయాత్మక పోరాటంపై లోక్‌సభలో శ్రీ అమిత్ షా ప్రసంగాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 9:53PM by PIB Hyderabad
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా చేసిన అద్భుత ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. ముఖ్యమైన వాస్తవాలు, చారిత్రక నేపథ్యం, గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ కృషికి సంబంధించిన వివరాలన్నీ అందులో ఉన్నాయన్నారు. తిరోగమన మావోయిస్టు భావజాలం కొన్ని దశాబ్దాలుగా అనేక ప్రాంతాల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని, వామపక్ష అతివాదం ఎందరెందరో యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
గత పదేళ్ల కాలంలో ఈ ముప్పును సమూలంగా పెకిలించివేయడానికి ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేసిందని, అదే సమయంలో అభివృద్ధి ఫలాలు నక్సలిజం ప్రభావిత ప్రాంతాలకు అందేలా చర్యలు తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. సుపరిపాలనను మరింత బలోపేతం చేయడంతోపాటు అందరికీ శాంతి, సౌభాగ్యాలను అందించేలా చూడడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“హోం మంత్రి శ్రీ అమిత్ షా చేసిన అద్భుత ప్రసంగమిది. ముఖ్యమైన వాస్తవాలు, చారిత్రక నేపథ్యం, గత దశాబ్ధ కాలంగా ప్రభుత్వం చేసిన కృషికి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి.
తిరోగమన మావోయిస్టు భావజాలం కొన్ని దశాబ్ధాలుగా అనేక ప్రాంతాల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. వామపక్ష అతివాదం ఎందరెందరో యువత భవిష్యత్తును నాశనం చేసింది.
గత దశాబ్ధ కాలంలో ఈ ముప్పును సమూలంగా పెకిలించివేసేందుకు మా ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. అదే సమయంలో అభివృద్ధి ఫలాలు నక్సలిజం ప్రభావిత ప్రాంతాలకు చేరేలా చర్యలు తీసుకుంది. సుపరిపాలనను ముందుకు తీసుకెళ్తూ.. అందరికీ శాంతి, సౌభాగ్యాలను అందించడంపై మేం నిరంతరం దృష్టి సారిస్తాం.”
***
(రిలీజ్ ఐడి: 2247228)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5