ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని పోరుబందరులో మాధవపూర్ మేళా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 MAR 2026 10:23AM by PIB Hyderabad

గుజరాత్‌లోని పోరుబందరులో జరుగుతున్న మాధవ్‌పూర్ మేళా సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సాహభరితమైన వేడుక మన ఘనమైన సంస్కృతిని చాటిచెబుతుందనీ... గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల మధ్య గల శాశ్వత సాంస్కృతిక బంధాన్ని మరింత బలపరుస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. " 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, ఈ పండుగ విభిన్న సంప్రదాయాలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. ప్రజలందరూ ఈ మేళాను సందర్శించాలని నేను పిలుపునిస్తున్నాను!" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

2022 ఏప్రిల్ నెలలో జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాధవపూర్ మేళా ప్రాముఖ్యత, మన సంస్కృతిలో దాని విశిష్ట స్థానం గురించి ప్రధానమంత్రి మాట్లాడారు.

‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“గుజరాత్‌లోని పోరుబందరులో జరుగుతున్న మాధవపూర్ మేళా సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు.

ఈ ఉత్సాహభరితమైన వేడుక మన ఘనమైన సంస్కృతిని చాటిచెప్పడంతో పాటు... గుజరాత్, ఈశాన్య ప్రాంతాల మధ్య గల శాశ్వత సాంస్కృతిక బంధాన్ని మరింత బలపరుస్తుంది.

ఈ పండుగ ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, విభిన్న సంప్రదాయాలను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. ప్రజలందరూ ఈ మేళాను సందర్శించాలని నేను పిలుపునిస్తున్నాను!

ఏప్రిల్ 2022 నాటి మన్ కీ బాత్ కార్యక్రమంలో నేను మాధవపూర్ మేళా ప్రాముఖ్యత, మన సంస్కృతిలో దాని విశిష్టత గురించి మాట్లాడాను. తప్పకుండా వినండి…”

 

***


(రిలీజ్ ఐడి: 2246632) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Kannada