పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎల్పీజీ సిలిండరు బుకింగ్ కాల పరిమితిపై వచ్చిన వార్తలపై వివరణ

प्रविष्टि तिथि: 25 MAR 2026 11:30AM by PIB Hyderabad

పీఎంయూవై కనెక్షన్లకు 45 రోజులుపీఎంయూవై కాని సింగిల్ బాటిల్ కనెక్షన్లకు 25 రోజులుపీఎంయూవై కాని డబుల్ బాటిల్ కనెక్షన్లకు 35 రోజులకు ఎల్పీజీ బుకింగ్ కాలపరిమితిని సవరించినట్టుగా కొన్ని వార్తా కథనాలుసామాజిక మాధ్యమాల్లో పేర్కొంటున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

అయితేఅలాంటి మార్పులు ఏమీ చేయలేదని స్పష్టం చేస్తున్నాంప్రస్తుతమున్న రీఫిల్లింగ్ కాలపరిమితులు ఏవిధమైన కనెక్షన్‌కైనా దిగువ పేర్కొన్న విధంగా యధాతథంగా కొనసాగుతాయి.

  • పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు

  • గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు

అసత్య సమాచారాన్ని నమ్మవద్దనీప్రచారం చేయవద్దనీఅనవసరంగా లేదా ఆందోళనతో ఎల్పీజీ కోసం బుకింగ్స్ చేయవద్దని పౌరులకు సూచిస్తున్నాం.

దేశంలో తగినంత ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయనిఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాం.

 

***


(रिलीज़ आईडी: 2245062) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali-TR , Bengali , Odia , Tamil , Kannada