ప్రధాన మంత్రి కార్యాలయం
షహీద్ దివస్ సందర్భంగా భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 MAR 2026 8:29AM by PIB Hyderabad
షహీద్ దివస్ సందర్భంగా గొప్ప స్వాతంత్ర్య సమరయోధులైన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు.
భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆ మహనీయులు చేసిన ప్రాణత్యాగం భారతీయులందరి గుండెల్లో చెరగని ముద్ర వేసిందని ప్రధానమంత్రి అన్నారు. దేశ విముక్తికి చిన్న వయసులోనే అసాధారణమైన నిబద్ధతను ప్రదర్శించారని కొనియాడారు. వలస పాలన శక్తికి బెదరకుండా దేశానికి ప్రాధాన్యతనిస్తూ దృఢ నిశ్చయంతో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యాయం, దేశభక్తి, అలుపెరుగని పోరాట పటిమ వంటి ఆదర్శాలు నేటికీ కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తిని కలిగిస్తూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"భరతమాత వీర పుత్రులైన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు నేడు మనం ప్రణామాలు అర్పిస్తున్నాం. దేశం కోసం వారు చేసిన ప్రాణత్యాగం అందరి జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది.
భారతదేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే వారు అంచంచలమైన ధైర్యాన్ని, అసాధారమైన నిబద్ధతను ప్రదర్శించారు. వలస పాలన శక్తికి భయపడకుండా, దేశమే మిన్నగా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. న్యాయం, దేశభక్తి, పోరాట పటిమ వంటి ఆదర్శాలు నేటికీ కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తిని రగిలిస్తాయి"
***
(రిలీజ్ ఐడి: 2243865)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14