ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్ బలమైన ఇంధన వ్యవస్థ, సుస్థిర భవిష్యత్తుపై ప్రచురితమైన ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 1:25PM by PIB Hyderabad

భారత ఇంధన రంగ పరిణామాన్ని వివరిస్తూ  కేంద్రమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ రాసిన ఓ ప్రత్యేక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.

భారత్ ఒక పటిష్టమైన ఇంధన  వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తోందో,  భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సుస్థిరమైన వాతావరణాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో  కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ తన వ్యాసంలో వివరించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వికసిత్ భారత్‌కు భరోసానిచ్చే దేశ ఇంధన విధానాల గురించి ఖచ్చితమైన అవగాహన పొందడానికి ఈ వ్యాసాన్ని చదవాలని పాఠకులను ప్రధానమంత్రి ప్రోత్సహించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ భారత్ పటిష్టమైన ఇంధన వ్యవస్థను ఎలా అభివృద్ధి చేస్తుందో, భవిష్యత్తు అవసరాల కోసం సుస్థిరమైన వాతావరణాన్ని ఎలా రూపొందిస్తుందో కేంద్రమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ తన వ్యాసంలో వివరించారు.

వికసిత్ భారత్ కు భరోసానిచ్చే దేశ ఇంధన విధానాలపై కచ్చితమైన అవగాహన పొందడానికి ఈ వ్యాసాన్ని చదవండి.’’

 

***


(రిలీజ్ ఐడి: 2241746) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Kannada