హోం మంత్రిత్వ శాఖ
ఎన్‌సీబీ వ్యవస్థాపక దినోత్సవం.. ఆ సంస్థ సిబ్బందికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హృదయపూర్వక శుభాకాంక్షలు
మన యువతను మత్తుమందుల బారి నుంచి కాపాడడానికి అంకితమైన ప్రధాన సంస్థ ఇది.. బాధ్యతను ఎంతో నేర్పుతో నిర్వహిస్తున్న ఎన్‌సీబీ
మత్తుమందుల ఆనవాలు ఉండని భారత్‌ను ఆవిష్కరించాలన్న మోదీ జీ దార్శనికతను శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న ఎన్‌సీబీ
ఎన్‌సీబీ సిబ్బంది అంకిత భావానికీ, దేశభక్తికీ వందనం చేస్తున్న ప్రజానీకం
प्रविष्टि तिथि:
17 MAR 2026 11:21AM by PIB Hyderabad
మాదకద్రవ్యాల నియంత్రణ మండలి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. ఎన్‌సీబీ) వ్యవస్థాపకదినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ఎన్‌సీబీ సిబ్బందికి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ‘‘ఎన్‌సీబీ సిబ్బందికి వారి సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇవే హార్దిక శుభాకాంక్షలు. మన దేశ యువతను మత్తుమందుల బారి నుంచి కాపాడటానికి అంకితమైన ప్రముఖ సంస్థ ఎన్‌సీబీ. తనకు అప్పగించిన బాధ్యతను ఎంతో నేర్పుగా నెరవేరుస్తూ, మత్తుమందుల ఆనవాలు ఉండని భారత్‌ను ఆవిష్కరించాలన్న మోదీ జీ దార్శనికతను శరవేగంగా సాకారం చేస్తోంది. ఎన్‌సీబీ సిబ్బంది అంకిత భావానికీ, దేశభక్తికీ ప్రజలు నమస్కరిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2241099)
आगंतुक पटल : 63
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Kannada