ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇరాన్ అధ్యక్షునితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఇరాన్‌తో పాటు ఆ ప్రాంతంలో స్థితిపై తన దృష్టికోణాన్ని వెల్లడించిన అధ్యక్షుడు శ్రీ పెజెశ్కియన్

అన్ని అంశాల్నీ చర్చ, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలన్న భారత్ వైఖరిని పునరుద్ఘాటించిన ప్రధాని

భారత జాతీయుల భద్రత, క్షేమంతో పాటు ఇంధనం, వస్తువుల నిరంతరాయ రాకపోకలకు భారత్ ప్రాధాన్యాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి స్పష్టీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 11:41PM by PIB Hyderabad

ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెశ్కియన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ  రోజు టెలిఫోన్లో మాట్లాడారు.

అధ్యక్షుడు శ్రీ పెజెశ్కియన్‌ ఇరాన్‌లో ప్రస్తుత స్థితితో పాటు ఆ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలపై తన దృష్టికోణాన్ని ప్రధానమంత్రికి వివరించారు.
ఆ ప్రాంతం భద్రత స్థితిలో మార్పులు చోటుచేసుకుంటున్న మార్పుపై ప్రధాని తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారుఅన్ని అంశాల్నీ చర్చదౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్ స్థిర వైఖరి అని ఆయన పునరుద్ఘాటించారు.
ఇరాన్ సహా ఆ ప్రాంతంలోని భారత జాతీయుల భద్రతకీక్షేమానికీఇంధనంతో పాటు వస్తువుల నిరంతరాయ రాకపోకలకు కూడా భారత్ ప్రాధాన్యాన్ని ఇస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.

తరచూ సంప్రదింపులు నిర్వహించుకోవాలని నేతలు ఇద్దరూ పరస్పరం అంగీకారాన్ని వ్యక్తం చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2239661) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Kannada , Malayalam