ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆట్టుకల్ పొంగాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2026 6:54PM by PIB Hyderabad

పవిత్రమైన ఆట్టుకల్ పొంగాల సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా శక్తిని ప్రతిబింబించే ఈ పండుగ రోజుకు ఎంతో ప్రాముఖ్యం ఉందని ప్రధానమంత్రి చెబుతూ, ఈ శుభదినాన సమాజంలో సమృద్ధి, ఉత్తమమైన ఆరోగ్యం, సద్భావన, ఐకమత్యం వెల్లివిరియాలని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘పవిత్రమైన ఆట్టుకల్ పొంగాల  సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పర్వదినం మన నారీ శక్తికి ఎంతో ముఖ్యమైంది. ఈ శుభ దినం అందరి జీవితాల్లో సమృద్ధిని, ఉత్తమమైన ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. సమాజంలో సద్భావనతో పాటు ఐకమత్యం వర్ధిల్లాలని నేను కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2235265) సందర్శకుల సూచీ సంఖ్య : : 54
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam