ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కువైట్ యువరాజుతో సంభాషించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 03 MAR 2026 6:59PM by PIB Hyderabad

గౌరవ కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ ముబారక్ అల్ సబాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు.

ఈ సందర్భంగా కువైట్ సార్వభౌమాధికారంప్రాంతీయ సమగ్రత ఉల్లంఘనను భారత్‌ ఖండిస్తుందని.. ఈ కష్టకాలంలో కువైట్ ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు.

ప్రాంతీయ శాంతిస్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో చర్చలుదౌత్యం ముఖ్యమని ఇరు నేతలు పేర్కొన్నారు.

కువైట్‌లోని భారత ప్రజల భద్రతసంక్షేమం విషయంలో కువైట్ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతును ప్రధానమంత్రి అభినందించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా అన్నారు.

‘‘గౌరవ కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ ముబారక్ అల్ సబాతో నేడు ఫలప్రదమైన టెలిఫోన్ సంభాషణ జరిగిందికువైట్ సార్వభౌమాధికారంప్రాంతీయ సమగ్రత ఉల్లంఘనను భారత్ ఖండిస్తోందిఈ కష్టకాలంలో అక్కడి ప్రజలకు అండగా నిలుస్తుంది.

ప్రాంతీయ శాంతిస్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో చర్చలుదౌత్యం ముఖ్యమని తెలిపాంకువైట్‌లోని ప్రవాస భారతీయుల భద్రతసంక్షేమాన్ని నిర్ధారించడంలో కువైట్ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతును అభినందించాను’’.

 

***


(रिलीज़ आईडी: 2235177) आगंतुक पटल : 103
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam