ప్రధాన మంత్రి కార్యాలయం
ఎంటియోక్, సమస్త ప్రాచ్యానికీ ప్రధాన గురువు పరమ పూజ్య మోరన్ మోర్ ఇగ్నాటియస్ అఫ్రేమ్ - II తో ప్రధానమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
27 FEB 2026 4:36PM by PIB Hyderabad
ఎంటియోక్, సమస్త ప్రాచ్యానికీ ప్రధాన గురువు, యూనివర్సల్ సిరియాక్ ఆర్థోడాక్స్ చర్చికి చెందిన సర్వోన్నత అధిపతి మోరన్ మోర్ ఇగ్నాటియస్ అఫ్రేమ్ - II తో సమావేశం కాావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున అన్నారు.
పరమ పూజ్యునితో ప్రధానమంత్రి సమావేశమైన సందర్భంగా, వివిధ అంశాలపై ఉభయులూ చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ఎంటియోక్, సమస్త ప్రాచ్యానికీ ప్రధాన గురువు, యూనివర్సల్ సిరియాక్ ఆర్థోడాక్స్ చర్చికి చెందిన సర్వోన్నత అధిపతి పరమ పూజ్య మోరన్ మోర్ ఇగ్నాటియస్ అఫ్రేమ్ - II తో సమావేశం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
ఈ సందర్భంగా వివిధ అంశాలపై మేం లోతుగా చర్చించాం’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2233758)
సందర్శకుల సూచీ సంఖ్య : : 66
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam