ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 ప్రారంభోత్సవ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 3:28PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 ప్రారంభోత్సవంలో తన ప్రసంగానికి సంబంధించిన ముఖ్యాంశాలను  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అనేక సందేశాలను శ్రీ మోదీ పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘మానవ జాతి చరిత్రలోనే అతి పెద్ద మార్పుల్లో ఒకటి కృత్రిమ మేధ.’’
‘‘కృత్రిమ మేధకు (ఏఐ) సంబంధించినంతవరకు భారత దార్శనికత మానవ్  (MANAV) పదంలో ఇమిడిపోయింది. ఈ మాటకు మనిషి అని అర్థం.’’

‘‘కృత్రిమ మేధ మానవ జాతి శక్తిని కొత్త శిఖరాలకు చేరుస్తుంది.’’
‘‘ప్రపంచ ఉమ్మడి హితాన్ని దృష్టిలో పెట్టుకొని కృత్రిమ మేధకు పదును పెడతామనే సంకల్పాన్ని చెప్పుకొందాం.. రండి.’’
‘‘ఏఐ డీప్‌ఫేకులు, కల్పిత కంటెంటు బహిరంగ సమాజాల్ని అస్థిరపరుస్తూ ఉండటం దురదృష్టకరం.
వాటర్‌మార్క్‌లను ఉంచడం, మూలాన్ని స్పష్టంగా పేర్కొనే ప్రమాణాల ప్రాధాన్యం నానాటికీ తప్పనిసరిగా మారుతోంది.
బాలల సురక్ష విషయంలో కూడా మనం మరింత అప్రమత్తంగా ఉండక తప్పదు.’’
‘‘డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా (భారత్‌లో రూపురేఖలు తీర్చిదిద్ది, అభివృద్ధి చేయాలి).
డెలివర్ టు ది వరల్డ్ (ప్రపంచానికి అందించాలి).
డెలివర్ టు హ్యుమానిటీ. (మానవాళి చెంతకు చేర్చాలి).’’ 
‘‘ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్.. కృత్రిమ మేధోజగతిలోని ప్రముఖులనందరినీ ఒక చోటుకు తీసుకు వచ్చింది.
దీనిలో 100కు పైగా దేశాలు పాల్గొంటున్నాయి.
ప్రపంచం నలు మూలల నుంచీ విశిష్ట వ్యక్తులు దీనిలో పాలుపంచుకుంటున్నారు.
మన ధ్యేయం ఒకటే - అది.. కృత్రిమ మేధ శక్తిని మన భూగ్రహం మేలు కోసం వినియోగించడమే.’’
‘‘ప్రపంచంలో అతి పెద్దదీ, అత్యంత చరిత్రాత్మకమైందీ అయిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరుగుతోంది!

@LulaOficial

@anuradisanayake

@ParmelinG

@KBM_ALNAHYAN’’


(రిలీజ్ ఐడి: 2230285) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Malayalam