ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఏఐ ఇండియా ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026 ప్రారంభంలో ముఖ్యమైన అంశాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 10:47AM by PIB Hyderabad

ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల సంగమంగా భారత్ ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు.

ప్రారంభోత్సవానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పంచుకొంటూ.. ప్రపంచ క్షేమం కోసం కృత్రిమ మేధ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారతీయ ప్రతిభకున్న అసాధారణ సామర్థ్యాన్ని ఈ ఎక్స్‌పో తెలియజేస్తుందని శ్రీ మోదీ అన్నారు.

అన్నింటికీ మించి, మానవ ప్రగతికి బాధ్యతాయుతంగా, సమ్మిళిత్వంతో, విస్తృత స్థాయిలో ఏఐను ఉపయోగించుకోవడంలో భారత దేశ నిబద్ధతను ఈ కార్యక్రమం పునరుద్ఘాటించిందన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ పోస్టు:

‘‘ఆలోచనలు, ఆవిష్కరణలు, సంకల్పాల శక్తిమంతమైన సంగమమే ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో-2026. ప్రపంచ క్షేమం కోసం కృత్రిమ మేధ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారతీయ ప్రతిభకున్న అసాధారణ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

అన్నింటికీ మించి, మానవ ప్రగతికి సంబంధించి బాధ్యతాయుతంగా, సమ్మిళిత్వంతో, విస్తృత స్థాయిలో ఏఐను ఉపయోగించుకోవడంలో మా చిత్తశుద్ధిని ఇది పునరుద్ఘాటిస్తుంది. కొన్ని ముఖ్యాంశాలు...’’

 

 ***


(రిలీజ్ ఐడి: 2229072) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam