ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని 154.635 కిలోమీటర్ల పొడవైన ఎన్ హెచ్ -160 ఏ ఘోటి – త్రయంబక్ (మోఖడ) – జవహర్ – మనోర్ – పాల్ఘర్ సెక్షన్‌ను రూ. 3320.38 కోట్ల వ్యయంతో 2 /4 లేన్ల పేవ్డ్ షోల్డర్ అనుసంధాన మార్గంగా పునరుద్ధరణ, అభివృద్ధికి క్యాబినెట్ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 14 FEB 2026 1:05PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని ఎన్ హెచ్ -160 ఏ లో గల ఘోటి-త్రయంబక్ (మోఖడ)-జవహర్-మనోర్-పాల్ఘర్ సెక్షన్ పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన  సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిన్న ఆమోదం తెలిపింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసి)  విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 154.635 కిలోమీటర్లు కాగా, దీని అంచనా వ్యయం రూ.3,320.38 కోట్లు.

నాసిక్ పశ్చిమ ప్రాంతంలో, ముఖ్యంగా అంబాద్, సాత్పూర్ పరిసరాల్లో మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన పారిశ్రామిక యూనిట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీనివల్ల భారీ స్థాయిలో సరుకు రవాణా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ట్రాఫిక్ ఎన్ హెచ్ -848 ద్వారా నాసిక్ నగరం మీదుగా వెళ్తుండటంతో, పట్టణ రహదారులపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రధాన మార్గాలు ఇప్పటికే 'లెవల్ ఆఫ్ సర్వీస్' (ఎల్ఓఎస్) - సీ స్థాయికి చేరువలో కొనసాగుతున్నాయి:

ముంబై నుంచి ఎన్ హెచ్ -848 (6 లేన్ల రహదారి): రోజుకు 50,000–60,000 పీసీయూ  (ఎల్ఓఎస్- సీ పరిమితి: 55,000)

పుణె నుంచి ఎన్ హెచ్ -60 (4 లేన్ల రహదారి): రోజుకు 40,000–50,000 పీసీయూ  (ఎల్ఓఎస్- సీ పరిమితిపరిమితి: 36,000)

ఎన్ హెచ్-160ఏ అభివృద్ధి ద్వారా త్రయంబక్ మీదుగా ఈ పారిశ్రామిక ప్రాంతాల నుంచి  ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. ఇది నగరం లోపలికి వెళ్లకుండానే ప్రయాణాన్ని సులభతరం చేస్తూ రద్దీని తగ్గిస్తుంది. ముంబై (పశ్చిమ వైపు), దక్షిణ ప్రాంతాల నుంచి న వచ్చే ట్రాఫిక్ ఎన్ హెచ్ -848 పై గల ఇగత్‌పురి ఇంటర్‌ఛేంజ్ ద్వారా సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత, ట్రాఫిక్ ఎన్ హెచ్ -848 ద్వారా ఘోటి వరకు సాగి, అక్కడ నుంచి త్రయంబక్, నాసిక్ వెళ్లడానికి ఎన్ హెచ్-160 ఏ మార్గాన్ని ఉపయోగిస్తుంది. 2028 నుంచి  రోజువారీ ట్రాఫిక్ 10,000 పీసీయూల  కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేయడం వల్ల, ఈ కారిడార్‌ను 4 లేన్లుగా మార్చేందుకు అర్హత లభించింది.

త్రయంబక్ నుంచి  పశ్చిమంగా మనోర్, పాల్ఘర్ వైపు విస్తరించిన ఎన్ హెచ్ -160ఏ విభాగం, ఈ రహదారిని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే (ఎన్ఈ - 4), ఎన్ హెచ్ -48,  పశ్చిమ తీర ప్రాంతాలతో పాటు పాల్ఘర్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు అనుసంధానిస్తుంది. ప్రస్తుతం ఈ మార్గంలో 4,500 పీసీయూల ట్రాఫిక్ మాత్రమే ఉన్నప్పటికీ, ఉన్న ఇంటర్మీడియట్-లేన్ రహదారిని పేవ్డ్ షోల్డర్లతో కూడిన రెండు లేన్లుగా అభివృద్ధి చేయడం వల్ల సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు మరింత సాఫీగా సాగుతాయి. మనోర్ నుంచి  పాల్ఘర్ వరకు ఉన్న ఈ రహదారి పట్టణ ప్రాంతాల మీదుగా  వెడుతోంది.  ఇక్కడ సుమారు 12,000 పీసీయూల ట్రాఫిక్ ఉండటంతో, ఈ పట్టణ విభాగంలో రాకపోకలు సాఫీగా సాగేందుకు నాలుగు లేన్ల విస్తరణను ప్రతిపాదించారు.

ఈ ప్రాజెక్టును పీఎం గతిశక్తి సూత్రాలకు అనుగుణంగా ప్రతిపాదించారు. ఇది మహారాష్ట్రలోని 6 పీఎం గతిశక్తి ఆర్థిక, 1 సామాజిక,  8 రవాణా మార్గాలను  అనుసంధానిస్తుంది. దీనివల్ల దేశ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఎల్పీఐ) పై సానుకూల ప్రభావం ఉంటుంది.

ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, ట్రాఫిక్ సాఫీగా,  సురక్షితంగా సాగుతుంది.  దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, వాహన నిర్వహణ ఖర్చు (వీఓసీ)  కూడా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు అమలు వల్ల గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడి, సమగ్ర ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 19.98 లక్షల మందికి ప్రత్యక్షంగా, 24.86 లక్షల మందికి పరోక్షంగా పనిదినాల ఉపాధి లభిస్తుందని అంచనా. వీటితో పాటు, ఈ కారిడార్ వెంబడి అదనపు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయి.

రూట్ మ్యాప్ 

 

ప్రాజెక్టు వివరాలు 

ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ , కన్స్ట్రక్షన్ (ఈపీసి) పద్ధతిలో మహారాష్ట్రలోని ఎన్ హెచ్ -160ఏ లోని ఘోటీ -  త్రయంత్బక్ (మొఖడా) - జవహర్ – మనోర్ – పాల్ఘర్ సెక్షన్‌ పేవ్డ్ షోల్డర్‌లతో 2  / 4 లేన్‌గా పునరుద్ధరణ, అభివృద్ధి

 

ముఖ్యాంశాలు

వివరాలు 

ప్రాజెక్టు పేరు

ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ , కన్స్ట్రక్షన్ (ఈపీసి) పద్ధతిలో మహారాష్ట్రలోని ఎన్ హెచ్ -160ఏ లోని ఘోటీ -  త్రయంత్బక్ (మొఖడా) - జవహర్ – మనోర్ – పాల్ఘర్ సెక్షన్‌ పేవ్డ్ షోల్డర్‌లతో 2  / 4 లేన్‌గా పునరుద్ధరణ, అభివృద్ధి

కారిడార్

సిన్నర్ నుంచి పాల్గార్ ఎన్ హెచ్ 160ఏ.

పొడవు (కి మీ)

154.635

మొత్తం సివిల్ వ్యయం (రూ. కోట్లు)

2594.49

భూ సేకరణ వ్యయం ( రూ. కోట్లు)

725.89

మొత్తం మూలధన వ్యయం (రూ. కోట్లు)

3320.38

విధానం 

ఇంజనీరింగ్ , ప్రొక్యూర్మెంట్,   కన్స్ట్రక్షన్ (ఈపీసి) పద్ధతి 

ప్రధాన అనుసంధాన రహదారులు 

ఎక్స్ప్రెస్ మార్గాలు: ఢిల్లీ - ముంబై -  ఎక్స్‌ప్రెస్ వే (ఎన్ఈ-4),  ముంబై - నాగపూర్ సమృద్ధి  మహామార్గ్

 

జాతీయ రహదారులు: ఎన్ హెచ్-848,  ఎన్ హెచ్-48.

 

 రాష్ట్ర రహదారులు:  ఎస్ హెచ్-04, ఎస్ హెచ్-73, ఎస్ హెచ్-76, ఎస్ హెచ్-77, ఎస్ హెచ్-78,     ఎస్హెచ్-30

అనుసంధానం అయ్యే ఆర్థిక/ సామాజిక/ రవాణా మార్గాలు

06 ప్రధానమంత్రి గతిశక్తి మార్గాలు 

02 ఎస్ఈజడ్లు - తారాపూర్, బోయిసార్ రెండు ఇండస్ట్రియల్ పార్కులు - పాల్ఘర్ మొఖడా.రెండు ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ ఎస్టేట్‌లు - వాడా, తారాపూర్.

 7 సామాజిక మార్గాలు . 1 గిరిజన జిల్లా - పాల్ఘర్, 6 పర్యాటక ప్రదేశాలు - త్రయంబకేశ్వర్, జవహర్ రాజ్వాడా, వైతర్ణ నది, కెవ్లా బీచ్, అర్నాలా కోట, తుంగేశ్వర్ అభయారణ్యం

08  రవాణా మార్గాలు. 03 ప్రధాన రైల్వే స్టేషన్లు: పాల్ఘర్, నాసిక్,  షిర్డీ.  03 విమానాశ్రయాలు: ఓజర్, షిర్డీ, ముంబై. 02 ఓడరేవులు: వధావన్, జెఎన్పీటీ

అనుసంధానం అయ్యే ప్రధాన నగరాలు/ పట్టణాలు 

త్రయంబక్ (మొఖడా), జవహర్, మనోర్, పాల్ఘర్, ముంబై,నాసిక్

ఉపాధి కల్పన సామర్ధ్యం 

~19.98 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధి

~24.86 లక్షల పనిదినాల పరోక్ష ఉపాధి

ఆర్థిక సంవత్సరం- 2025 లో వార్షిక సగటు రోజువారీ ట్రాఫిక్ 

ఘోటీ- త్రయంబక్ సెక్షన్:

6,700 పీసీయూ/ రోజుకు

 త్రయంబక్(మొఖడ) – మనార్ సెక్షన్:


(రిలీజ్ ఐడి: 2228225) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Odia , Kannada , Malayalam