ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘పరీక్షా పే చర్చ 2026’ రెండో ఎపిసోడ్లో కోయంబత్తూర్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, అస్సాం విద్యార్థులతో తన సంభాషణ వివరాలను పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 10 FEB 2026 5:06PM by PIB Hyderabad

తొమ్మిదో సంచిక ‘పరీక్షా పే చర్చ (పీపీసీ)-2026’లో విద్యార్థులతో తన సంభాషణకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారుపీపీసీ-2026 రెండో ఎపిసోడ్‌లో కోయంబత్తూర్ఛత్తీస్‌గఢ్గుజరాత్అస్సాంలకు చెందిన ఎగ్జామ్ వారియర్స్‌తో ప్రధాన మంత్రి ముచ్చటించారు. ‘పరీక్షా పే చర్చ’ ప్రత్యేక ఎడిషన్‌కు విద్యార్థులను ఆహ్వానిస్తూఈసారి ఈ కార్యక్రమం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించామని శ్రీ మోదీ చెప్పారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ:

‘‘తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన #ParikshaPeCharcha26 లో విద్యార్థులతో ముచ్చటించడం గొప్ప అనుభవంఅంకుర సంస్థలుఏఐ నుంచి క్రమశిక్షణవికసిత భారత్‌ను సాధించాలనే ఆకాంక్షల వరకునేటి యువతకున్న ఆసక్తిస్పష్టత అసాధారణమైనవి.’’

‘‘కుతూహలంఆలోచనఅవగాహన కలిగిన ఓ తరాన్ని #ParikshaPeCharcha26లో భాగంగా ఛత్తీస్‌గఢ్ విద్యార్థులతో జరిపిన సంభాషణలు పరిచయం చేశాయిచదువుక్రీడలను సమతౌల్యం చేసుకోవడం నుంచి పర్యావరణంపై శ్రద్ధ వహించడంనాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం వరకువారికున్న స్పష్టతను వారి ప్రశ్నలు ప్రతిబింబించాయి.’’

"పరీక్షల సన్నద్ధతకు సంబంధించిన అంశాలకే గుజరాత్‌లో జరిగిన #ParikshaPeCharcha26 పరిమితం కాలేదునేర్చుకోవాలన్నఆత్మవిశ్వాసంతో ఎదగాలన్న ఆకాంక్షను వారి ప్రశ్నలు ప్రతిబింబించాయిక్లిష్టమైన పరిస్థితుల్లో ఒత్తిడిని ఎదుర్కోవడంఉపాధ్యాయులు పోషించే ప్రధాన పాత్రతో పాటు అనేక అంశాల గురించి విద్యార్థులు మాట్లాడారుఅద్భుతమైన వర్లీపిథోరాలిప్పన్ కళలను కూడా వారు ప్రదర్శించారు."

"ఒత్తిడినిఇతరులతో పోలికలను ఎదుర్కోవడం నుంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడంఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవడం వరకు అన్ని అంశాలను అస్సాం విద్యార్థులతో జరిగిన #ParikshaPeCharcha26లో చర్చించాంఇది పరీక్షల్లో రాణించాలనే వారి ఆకాంక్షలను ప్రతిబింబింస్తుందిఅదే సమయంలో తమ మూలాలతోసంస్కృతితో అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఎదగాలనే వారి తపనను కూడా చాటిచెప్పింది."

 

***


(రిలీజ్ ఐడి: 2226126) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Kannada , Malayalam