ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచకప్‌ గెలిచిన భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టును అభినందించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 FEB 2026 9:33PM by PIB Hyderabad

అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్‌ జట్టు అద్భుత ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

భారత అండర్-19 క్రికెట్ జట్టు టోర్నమెంట్ పొడవునా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. చాలా బాగా ఆడిందని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ విజయం ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘భారత క్రికెట్ ప్రతిభ ప్రకాశిస్తోంది!

ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్న మన అండర్-19 జట్టును చూసి గర్విస్తున్నాను. ఈ టోర్నమెంట్ మొత్తం జట్టు అద్భుతంగా ఆడి, అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ విజయం చాలా మంది యువ క్రీడాకారులకు కూడా స్ఫూర్తినిస్తుంది. ఆటగాళ్ల భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు.’’

 

***


(రిలీజ్ ఐడి: 2224881) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Odia , Kannada , Malayalam