ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై రాజ్యసభలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌మాధానం

నాడు పోస్టు చేయడమైనది: 05 FEB 2026 9:19PM by PIB Hyderabad

గౌరవ అధ్యక్షా,

రాష్ట్రపతి గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేయదలచుకున్నాను.

గౌరవ అధ్యక్షా,

ఈ ధన్యవాద తీర్మానానికి మద్దతుగా నా భావాలను ఈ సభ ముందు ఉంచడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

గౌరవ అధ్యక్షా,

అభివృద్ధి చెందిన భారత్ దిశగా ప్రయాణంలో గత ఏడాది వేగవంతమైన పురోగతివృద్ధిని నమోదు చేసిందిజీవితంలోని ప్రతి రంగంసమాజంలోని ప్రతి విభాగం ఒక పరివర్తనాత్మక దశను చూశాయిదేశం సరైన దిశలో అత్యంత వేగంగా ముందుకు సాగుతోందిగౌరవ రాష్ట్రపతి గారు అత్యంత సున్నితత్వంస్పష్టతతో ఈ విషయాలను మన ముందు ఉంచారు.

గౌరవ అధ్యక్షా,

నాదొక చిన్న విన్నపంగౌరవ ఖర్గే గారి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూర్చొని నినాదాలు చేసే అవకాశం ఇస్తే బాగుంటుందిఆయన వెనుక చాలా మంది యువసభ్యులు ఉన్నారుదయచేసి ఖర్గే గారిని తన సీటులోనే కూర్చుని నినాదాలు చేయడానికి అనుమతించండి.

గౌరవ అధ్యక్షా,

రాష్ట్రపతి గారు తన ప్రసంగంలో మధ్యతరగతిదిగువ మధ్యతరగతి ప్రజలుపేదలుగ్రామాలురైతులుమహిళలుశాస్త్ర విజ్ఞానంవ్యవసాయ రంగాల గురించి సవివరంగా మాట్లాడారుదేశ ప్రగతి ఆమె మాటల్లో పార్లమెంట్ అంతటా ప్రతిధ్వనించాయియువత భారతదేశ శక్తిని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ఆమె వివరించారుసమాజంలోని ప్రతి విభాగం సామర్థ్యాలను ఆమె ప్రధానంగా చెప్పారుఅన్నింటికంటే గొప్పగా భారత ఉజ్వల భవిష్యత్తుపై ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారుఇది మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.

గౌరవ అధ్యక్షా,

21వ శతాబ్దపు మొదటి పావు భాగం ముగిసిందిగత శతాబ్దపు రెండో పావు భాగం భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎలాగైతే నిర్ణయాత్మకమైనదో ఈ రెండో పావు భాగం కూడా అంతే శక్తివంతమైందన్న స్పష్టతతో నేను ఉన్నానుఇది భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి వేగంగా ముందుకు నడిపిస్తుంది.

 

కాబట్టి గౌరవ అధ్యక్షా,

మనం ఒక కీలకమైన ఘట్టానికి చేరుకున్నామని ప్రతి ఒక్కరు భావిస్తున్నారుమనం ఆగకూడదు వెనుదిరిగి చూడకూడదుమనం ముందుకు చూడాలిమరింత వేగంగా కదలాలిమన లక్ష్యాలను సాధించిన తర్వాతే విశ్రమించాలిఈ దిశగానే మనం అడుగులు వేస్తున్నాం.

గౌరవ అధ్యక్షా,

ఒకేసారి అనేక అనుకూల పరిస్థితుల ఆశీర్వాదం ప్రస్తుతం భారతదేశానికి ఉందిఇది నిజంగా అరుదైనఅదృష్టకరమైన కలయికఅత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రపంచంలోని ధనిక దేశాలన్నీ వృద్ధాప్యం వైపు వెళ్తుంటే మన దేశం మాత్రం కొత్త అభివృద్ధి శిఖరాలను అధిరోహిస్తోందిఅంతేకాకుండా మరింత యువ శక్తితో విరాజిల్లుతోందిభారత్‌ యువత ఉన్న దేశంఇది మనకు ఉన్న గొప్ప సానుకూలత.

గౌరవ అధ్యక్షా,

మరోవైపు భారత్‌ పట్ల పెరుగుతున్న ప్రపంచ ఆకర్షణనుభారతీయ ప్రతిభకు లభిస్తున్న గుర్తింపును నేను చూస్తున్నానుయువకులుప్రతిష్ఠాత్మక లక్ష్యాలు కలవారుపట్టుదల గలవారుసమర్థులతో కూడిన ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ప్రతిభావంతుల సమూహం నేడు మన దగ్గర ఉందిఇది మనకు లభించిన మరొక వరం.. ఒక నిజమైన బలం.

గౌరవ అధ్యక్షా,

నేడు భారతదేశం ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను చూపే ఒక ఆశాకిరణంలా నిలుస్తోందిమరో అనుకూలమైన పరిస్థితి ఏమిటంటే.. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత వృద్ధి రేటు అత్యధికంగా ఉండటంతో పాటు ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటంఈ విశిష్టమైన కలయిక మన ఆర్థిక వ్యవస్థకు ఉన్న బలాన్ని చాటిచెబుతోంది.

గౌరవ అధ్యక్షా,

ఈ దేశ ప్రజలు మాకు సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు భారత్ 'ఫ్రాజైల్ ఫైవ్జాబితాలో ఉండేదిస్వాతంత్ర్య సమయంలో మనం ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేవాళ్లంకానీ గత నాయకత్వంలో మనం 11వ స్థానానికి పడిపోయాంనేడు మనం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా వేగంగా ముందుకు సాగుతున్నాం.

గౌరవ అధ్యక్షా,

విజ్ఞాన శాస్త్రంఅంతరిక్షం లేదా క్రీడలు ఇలా ఏ రంగాన్ని చూసినా నేడు భారతదేశం ఆత్మవిశ్వాసంఆత్మస్థైర్యంతో నిలబడిందికోవిడ్ తర్వాత ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతోందిప్రపంచం ఒక కొత్త ప్రపంచ క్రమం దిశగా పయనిస్తోందనే విషయం స్పష్టంగా కనిపిస్తోందిరెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక రకమైన ప్రపంచ క్రమం ఏర్పడిందిఇప్పుడు అంతే వేగంగా ఒక కొత్త వ్యవస్థ రూపుదిద్దుకుంటోందిఈ పరిణామాలను నిష్పాక్షికంగా విశ్లేషిస్తే.. ప్రపంచం ఇప్పుడు స్పష్టంగా భారత్‌ వైపు మొగ్గు చూపుతుండటం మనందరికీ గర్వకారణంఒక నమ్మకమైన భాగస్వామిగామిత్రుడిగా భారత్‌ నేడు అనేక దేశాలకు అత్యంత విశ్వసనీయమైన మిత్రదేశంగా మారిందిప్రపంచ శ్రేయస్సు కోసం మన వంతు శక్తితో తోడ్పాటునందిస్తూ ఇతర దేశాలతో భుజం భుజం కలిపి నిలబడుతున్నాం.

 

గౌరవ అధ్యక్షా,

నేడు ప్రపంచమంతా 'గ్లోబల్ సౌత్గురించి మాట్లాడుతోందిఅంతర్జాతీయ వేదికలపై ఈ దేశాల గొంతుకగా భారత్‌ మారిందిఅనేక దేశాలతో మనం భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండే వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటున్నాంఇటీవల మనం కీలకమైన దేశాలతో తొమ్మిది ప్రధాన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాంఇందులో భాగంగా 27 దేశాలతో కూడిన ఐరోపా సమాఖ్యతో 'అన్ని ఒప్పందాలకు తలమానికంఅయిన చారిత్రాత్మక ఒప్పందాన్ని కూడా చేసుకున్నాంఒకప్పుడు ఏ దేశం కూడా మనతో వ్యాపారం చేయడానికి సిద్ధంగా లేని స్థితిలో ఈ దేశాన్ని ఎందుకు వదిలేశారో.. ‘అలసిపోయి మధ్యలోనే వేదికను వీడి వెళ్లిన వారు’ సమాధానం చెప్పాల్సి ఉంటుందిబహుశా వారు ప్రయత్నించారు కావచ్చు.. ప్రపంచ దేశాల చుట్టూ తిరిగారు కావచ్చుకానీ అప్పట్లో ఎవరూ వారి వైపు చూడలేదుఅటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందినేడు దేశాలు భారత్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నాయంటే అది ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదుభారత్ బలంఅంతర్జాతీయ స్థాయిని చూసే అవి ముందుకు వస్తున్నాయి.

గౌరవ అధ్యక్షా,

ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అభివృద్ధి చెందిన దేశాలు ఒక అభివృద్ధి చెందుతున్న దేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు అది ప్రపంచ ఆర్థిక రంగానికి ఒక శక్తిమంతమైన సందేశాన్ని పంపుతుందిఇది నాకు కొత్తేమీ కాదునేను గుజరాత్‌లో సేవ చేసే అవకాశం పొందినప్పుడు 'వైబ్రెంట్ గుజరాత్సదస్సును నిర్వహించానుఅప్పట్లో ఒక భారతీయ రాష్ట్రం జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాన్ని తన భాగస్వామిగా పొందినందుకు నేను గర్వపడ్డానుఒక రాష్ట్రం అప్పట్లోనే ఆ సామర్థ్యాన్ని నిరూపించుకుందినేడు నా దేశం జాతీయ స్థాయిలో దీనిని నిరూపిస్తోందిమన వద్ద ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పుడుమన పౌరులు ఉత్సాహంగా ఉన్నప్పుడుతయారీ రంగానికి సంబంధించిన బలమైన వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచం మీతో ఒప్పందాల కోసం ముందుకు వస్తుందిఓటు బ్యాంకు రాజకీయాల్లో మునిగిపోయిన వారు దేశాన్ని ఇటువంటి అంశాల్లో బలోపేతం చేయడానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదుదాని ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందికాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే నేను ఒక మాట స్పష్టంగా చెబుతున్నానునా మాటలపై మీకు నమ్మకం లేకపోతే ఈ దేశ ప్రజలు ఒక్కసారి ఎర్రకోట నుంచి కాంగ్రెస్ ప్రధాన మంత్రులు చేసిన ప్రసంగాలను విశ్లేషించాలని కోరుతున్నానువారి వద్ద ఎటువంటి దార్శనికతఆలోచనలు లేదా సంకల్ప బలం లేవని మీకు స్పష్టంగా అర్థమవుతుందిదీనివల్ల దేశం ఎంతో నష్టపోయింది.

గౌరవ అధ్యక్షా,

నాకు సేవ చేసే అవకాశం కల్పించిన ఈ దేశ ప్రజలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానునేడు మా శక్తిలో ఎక్కువ భాగం వారు చేసిన తప్పులను సరిదిద్దడానికే ఖర్చవుతోందిప్రపంచం దృష్టిలో ఆనాడు భారత్‌కు ఉన్న పేరును మార్చడానికి ఎంతో కృషి చేయాల్సి వస్తోందివారు దేశాన్ని శిథిలావస్థలో వదిలిపెట్టారుదానిని సరిచేయడానికి మేం భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విధానాలకు ప్రాధాన్యత ఇచ్చాంనేడు మీరు చూడొచ్చు.. దేశం విధానాల ద్వారా నడుస్తోంది తప్ప అప్పటికప్పుడు తీసుకునే తప్పుడు నిర్ణయాల ద్వారా కాదుఇదే ప్రపంచవ్యాప్తంగా నమ్మకాన్ని పెంచిందిమేం 'సంస్కరణప్రదర్శనపరివర్తనఅనే మంత్రంతో ముందుకు సాగాంనేడు దేశం 'సంస్కరణల ఎక్స్‌ప్రెస్'పై పయనిస్తోందిమేం నిర్మాణాత్మక సంస్కరణలువిధానపరమైన సంస్కరణలను అమలు చేశాంభారత్ ఉత్పత్తి చేసే ప్రతి వస్తువుకు విలువను జోడించేలా మన తయారీ రంగాన్నిపారిశ్రామికవేత్తలను బలోపేతం చేయడానికి పనిచేశాంనేడు భారత్‌ ప్రపంచంతో పోటీ పడటానికి పూర్తి సిద్ధంగా ఉందని నేను విశ్వాసంతో చెప్పగలనునేను గ్లోబల్ సీఈఓల ఫోరమ్‌లకు హాజరైనప్పుడు ప్రపంచం మన పారిశ్రామికవేత్తలను తమతో సమానంగా చూడటాన్ని గమనిస్తున్నానుఇటీవల అన్ని పార్టీల ప్రతినిధులు విదేశాలకు వెళ్లినప్పుడు భారతదేశానికి సమాన గౌరవం లభిస్తోందని గౌరవ సభ్యులు నాతో గర్వంగా చెప్పారుఇది ఒక గొప్ప విజయం.

గౌరవ అధ్యక్షా,

మన దేశంలోని విస్తారమైన ఎంఎస్ఎంఈ నెట్‌వర్క్ మన ఆర్థిక వ్యవస్థకు ఒక దీర్ఘకాలిక బలంమేం ఈ రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక సంస్కరణలు తీసుకువచ్చాంనేడు మన ఎంఎస్ఎంఈల పట్ల ప్రపంచవ్యాప్తంగా నమ్మకం పెరుగుతోందిమనం విమానం మొత్తాన్ని తయారు చేయకపోవచ్చు కానీ విమానాల్లో వాడే అనేక విడిభాగాలను భారత్‌లోని చిన్న చిన్న ఎంఎస్ఎంఈలే తయారు చేస్తున్నాయి.

 

గౌరవ అధ్యక్షా,

ఈ కృషి ద్వారా వస్తోన్న ఫలితాలు అందరికీ కనిపిస్తున్నాయిప్రపంచంలోని అగ్ర దేశాలు భారత్‌తో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయిఐరోపా సమాఖ్యతో కుదిరిన వాణిజ్య ఒప్పందం కావచ్చు లేదా ఇటీవల అమెరికాతో కుదిరిన ఒప్పందం కావచ్చు.. ప్రపంచమంతా ఈ ఒప్పందాలను బహిరంగంగా ప్రశంసిస్తోందిఅమెరికా ఒప్పందం గురించి దీని గురించి మన సహచరులు పీయూష్ గారు ఈ సభలో సవివరంగా తెలియజేశారుఈయూ ఒప్పందంపై సంతకాలు జరిగినప్పుడు ప్రపంచ స్థిరత్వం పెరుగుతుందన్న నమ్మకం కలిగిందిఅమెరికాతో ఒప్పందం తర్వాత ప్రపంచం కేవలం స్థిరత్వాన్ని మాత్రమే కాకుండా ఒక కొత్త వేగాన్ని కూడా పొందిందిఇది ప్రపంచానికి ఒక సానుకూల సంకేతం.

 

గౌరవ అధ్యక్షా,

దీనివల్ల అత్యధికంగా లబ్ధి పొందేది మన దేశ యువతనేను యువత అని అన్నప్పుడు అది మధ్యతరగతినగరాలు లేదా గ్రామాల నుంచి వచ్చిన యువతీయువకులందరినీ ఉద్దేశించి చెబుతున్నానుమనం వారిని విడివిడిగా చూడకూడదుభారత యువత శక్తిని చూసి మనం గర్వపడాలినేడు ప్రపంచ మార్కెట్ వారి కోసం తలుపులు తెరిచి ఉంది.. అనంతమైన అవకాశాలను అందిస్తోందినేను వారికి చెబుతున్నానుమిత్రులారాముందుకు రండినేను మీకు భుజం భుజం కలిపి నిలబడతానుధైర్యంగా ముందుకు సాగండిదేశం మీకు అండగా ఉంది.. ప్రపంచం మిమ్మల్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంది.

 

గౌరవ అధ్యక్షా,

ప్రపంచవ్యాప్తంగా మన యువ నిపుణుల కోసం గిరాకీ పెరుగుతోందిచివరికి సంరకక్షులకు కూడా డిమాండ్ ఉందినేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు మాకు ఇటువంటి ప్రతిభావంతులు కావాలని అడుగుతున్నారుకొంతమంది అయితే అర్హత కలిగిన నిపుణులను వెతకడానికి ఇక్కడే ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారుదీని అర్థం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయ నిపుణులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయి.

 

గౌరవ అధ్యక్షా,

పార్లమెంట్‌లోని ఈ ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుందిఇక్కడ జరుగుతున్న చర్చల స్థాయిని గమనిస్తుంటే ఇది ఇంకా ఉన్నతంగా ఉండాల్సిందని నాకు అనిపిస్తోందిముఖ్యంగా ఇన్ని ఏళ్లపాటు పాలించిన వారి నుంచి చర్చా ప్రమాణాలు ఇంకా మెరుగ్గా ఉండాలికానీ వారు ఈ అవకాశాన్ని వృథా చేశారుదేశం వారిని ఎలా నమ్ముతుంది?

 

గౌరవ అధ్యక్షా,

నిన్న నేను ఒక గౌరవ సభ్యుడి ప్రసంగం విన్నానుఆయన తనను తాను గర్వంగా 'రాజుఅని పిలుచుకుంటారుఅటువంటి వ్యక్తి ఆర్థిక అసమానతల గురించి మాట్లాడుతున్నారుతనను తాను రాజు అని పిలుచుకునే వ్యక్తి అసమానతల మీద మాట్లాడటం గురించి ఆలోచించండిమనం ఇలాంటివి కూడా చూడాల్సి వస్తుందా అనిపిస్తోంది.

 

గౌరవ అధ్యక్షా,

టీఎంసీ సహచరులు ఇక్కడ చాలా సేపు మాట్లాడారుకానీ వారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలివారిది కనికరం లేని ప్రభుత్వంపతనానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ కొత్త రికార్డులను సృష్టిస్తోందిఅయినప్పటికీ వారు ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెబుతున్నారుఅటువంటి ప్రభుత్వ పాలనలో ప్రజల భవిష్యత్తు చీకటిలోకి వెళ్తోందికానీ వారికి ఇది పట్టదుకేవలం అధికార దాహమే వారి ఏకైక ఆశయంప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు కూడా అక్రమ వలసదారులను బహిష్కరిస్తాయికానీ మన దేశంలో చొరబాటుదారులను రక్షించడానికి న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిడి తెస్తున్నారుతమ హక్కులనుజీవనోపాధినిగిరిజనుల భూములను లాక్కుంటూ తమ బిడ్డల ప్రాణాలకు ముప్పుగా మారిన చొరబాటుదారులను సమర్థించే వారిని భారత యువత ఎలా క్షమిస్తుందిమహిళలపై అకృత్యాలు జరుగుతున్నా వారు ఉదాసీనంగానే ఉంటున్నారుఅధికార రాజకీయాలు తప్ప వారు ఏమీ చేయరుఇటువంటి తీవ్రమైన అంశాలపై వారు కళ్లు మూసుకుని కూర్చుంటారుమరొక గౌరవ సభ్యుడు చాలా సేపు మాట్లాడారునిజానికి ఆయన ప్రభుత్వం మొత్తం మద్యంలో మునిగిపోయిందివారి గాజు భవనాలు ప్రతి ఇంట్లోనూ ద్వేషానికి చిహ్నాలుగా మారాయిబహుశా అందుకే వారు 'నలుపుఅనే పదాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారేమోఅందరికీ ఒక గతం ఉంటుంది.. 'నలుపు'తో వారికి ఉన్న పాత అనుబంధం ఏమిటో ఎవరికి తెలుసు!

 

గౌరవ అధ్యక్షా,

అటువంటి సహచరులందరికీ నేను ఈరోజు ఒకటే చెబుతున్నానుమీరు ఇంకెంత కాలం ప్రపంచాన్ని మోసం చేస్తారుఅద్దంలో చూసుకున్నప్పుడు మీ నిజాన్ని ఎక్కడ దాచుకుంటారుకాంగ్రెస్టీఎంసీడీఎంకేవామపక్షం.. వీరంతా దశాబ్దాల తరబడి కేంద్రంలో అధికారంలో భాగస్వాములుగా ఉన్నారురాష్ట్రాల్లో కూడా పాలించే అవకాశాలు పొందారుకానీ నేడు వారి గుర్తింపు ఏమిటిఇప్పుడు ఒప్పందాల గురించి చర్చ జరుగుతుంటే మనం గర్వంగా మాట్లాడుకుంటున్నాంకానీ వారి కాలంలో ఒప్పందాల గురించి చర్చ వస్తే అందరికీ 'బోఫోర్స్ఒప్పందమే గుర్తొచ్చేదిఅవే వారి ఒప్పందాలువారు కేవలం తమ జేబులు నింపుకున్నారు తప్ప ప్రజల జీవితాలను మెరుగుపరచాలన్నది వారికి ఎన్నడూ ప్రాధాన్యత కాలేదు.

 

గౌరవ అధ్యక్షా,

చర్చలో ఈ అంశాలు వచ్చాయి కాబట్టి నేను కొన్ని ఉదాహరణలు ఇవ్వాలిఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకింగ్ రంగం గురించి మాట్లాడుకుందాం. 2014 కంటే ముందు అది 'ఫోన్ బ్యాంకింగ్యుగంఅప్పట్లో నాయకులు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చేసేవారుకానీ పేద ప్రజలను మాత్రం బ్యాంకుల వద్ద చులకనగా చూసేవారుదేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు అసలు బ్యాంకు గుమ్మం కూడా తొక్కలేదుకాంగ్రెస్ నాయకుల ఫోన్ కాల్స్‌పై బిలియన్ల కొద్దీ నిధులు ఇచ్చారుఆ డబ్బు తీసుకున్న వారు దానిని తమ సొంత ఆస్తిలా భావించేవారుకాంగ్రెస్యూపీఏ పాలనలో ఆడిన ఆట ఇదినేడు ఈ 'ఇండియాకూటమిలోని రాష్ట్రాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలే స్థితికి చేరుకున్నాయినేను మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఒక దేశాధినేతతో మాట్లాడానుమనం బ్యాంకింగ్‌లో ముందుకు సాగాలని నేను చెబితే ఆయన.. 'సర్ మీరు కొత్తగా వచ్చారు.. మీరు పురోగతి గురించి ఆలోచించే ముందు మీ బ్యాంకింగ్ వ్యవస్థను ఒక్కసారి అధ్యయనం చేయండిదానిని మేం ఎలా నమ్మగలం?' అని బదులిచ్చారుఆ నాయకుడికి అసలు వాస్తవం తెలుసుకానీ ఇక్కడ ఉన్నవారికి అది పట్టలేదుఎన్‌పీఏలు కొండల్లా పేరుకుపోయాయిఎక్కడ చూసినా ఎన్‌పీఏల పరిస్థితి ఏంటిమనం ఎలా బతుకుతాంఅనే చర్చలే జరిగేవి.

 

గౌరవ అధ్యక్షా,

ఆ సమస్య చాలా పెద్దదికానీ మేం విజ్ఞతతో వ్యవహరించాంబ్యాంకింగ్ వ్యవస్థలోని భాగస్వాములను విశ్వాసంలోకి తీసుకున్నాంసంస్కరణలు అవసరమని గుర్తించి ధైర్యంతో వాటిని అమలు చేశాంమేం పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాంఅనేక బ్యాంకింగ్ సంస్కరణలను ప్రవేశపెట్టాంబలహీనంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను బలమైన బ్యాంకులతో విలీనం చేశాంతనను తాను చాలా మేధావిగా భావించే ఒక వ్యక్తి.. 'ఒకవేళ మోదీ ప్రభుత్వం బ్యాంకులను సంస్కరించగలిగితే అది భారత్ సాధించిన గొప్ప సంస్కరణలలో ఒకటి అవుతుందిఅని ఒకప్పుడు రాశారునేను పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ పనిని పూర్తి చేశాను.

 

గౌరవ అధ్యక్షా,

ఈ ప్రయత్నాల ఫలితంగా మన బ్యాంకుల్లో వేళ్లూనుకున్న వ్యాధి పూర్తిగా తొలగిపోయిందిబ్యాంకుల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడి ఇప్పుడు అవి పరుగులు తీస్తున్నాయిబ్యాంకుల పరిస్థితి మెరుగుపడటంతో లావాదేవీలు పెరిగాయి.. సామాన్య ప్రజలకు రుణాలు అందడం ప్రారంభమైందిఒకప్పుడు బ్యాంకుల తలుపులు మూసుకుపోయిన పేదవారికి కూడా ఇప్పుడు రుణాలు అందుతున్నాయినేడు 'ముద్ర యోజనదేశ యువత తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తోందిఇది స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోందిస్వయం ఉపాధి అనేది కేవలం ప్రసంగాలతో రాదుదీనికి మద్దతుమార్గదర్శకత్వంసహాయం అవసరంముద్ర యోజన ద్వారా మేం ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ. 30 లక్షల కోట్లకు పైగా రుణాలను నేరుగా యువత చేతుల్లో పెట్టాంవారు తమ వ్యాపారాలను విస్తరించుకున్నారుఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు లబ్ధిదారులుగా ఉండటం గర్వకారణంస్వయం సహాయక సంఘాల మహిళలుగొప్ప కలలు ఉన్న గ్రామీణ మహిళలు స్వతంత్రంగా ఎదగడానికి ఈ పథకం బలాన్ని ఇచ్చిందిమేం ఈ సంఘాల పరిధిని విస్తరించి 10 కోట్ల మంది మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించాంమన ఎంఎస్ఎంఈ రంగానికి కూడా పుష్కలంగా రుణాలు అందాయి. 2014 కంటే ముందు కొండల్లా ఉన్న ఎన్‌పీఏలను నేడు శాతం కంటే తక్కువకు తగ్గించామని నేను ఈ గౌరవప్రదమైన సభలో పూర్తి బాధ్యతతో ప్రకటిస్తున్నానుబ్యాంకింగ్ ఆరోగ్యానికి ఇది ఒక అద్భుతమైన విజయంఅంతేకాకుండా మన బ్యాంకులు ఇప్పుడు చారిత్రాత్మక లాభాలను నమోదు చేస్తున్నాయిబలమైన బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందిఈ పనిని మేము పూర్తి చేశాం.

 

గౌరవ అధ్యక్షా,

నేను మరొక ఉదాహరణ ఇస్తానుమన పీఎస్‌యూలు విఫలమవడానికోకుప్పకూలడానికో లేదా మూతపడడానికో పుట్టినవనే బలమైన అభిప్రాయం ఒకప్పుడు ఉండేదికానీ మేం వాస్తవాలతో ఈ ఆలోచనా విధానాన్ని మార్చగలిగాంకొందరు వ్యక్తులు ఈ సంస్థల గురించి అసత్యాలను ప్రచారం చేశారు. 'అర్బన్ నక్సల్స్మాదిరిగా వ్యవహరిస్తూ గేట్ల వద్ద కార్మికులను రెచ్చగొట్టారు.. వారిని తప్పుదోవ పట్టించారుఎల్‌ఐసీభారతీయ స్టేట్ బ్యాంక్హెచ్ఏఎల్ వంటి సంస్థలను అత్యంత దారుణంగా కించపరిచారువారు అధికారంలో ఉన్నప్పుడు ఆ సంస్థలను సరిగ్గా నిర్వహించలేకపోయారు.. సంస్కరించలేకపోయారు.

 

గౌరవ అధ్యక్షా,

 

మేం ఇక్కడ కూడా ధైర్యాన్ని ప్రదర్శించాంప్రభుత్వ రంగ సంస్థల్లో నిరంతర సంస్కరణల సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాంనేడు ఎల్‌ఐసీ తన చరిత్రలోనే అత్యుత్తమ పనితీరును కనబరుస్తోందికాంగ్రెస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని మూతపడే స్థితికి నెట్టేసిన సంస్థలు ఇప్పుడు చారిత్రాత్మక లాభాలను గడిస్తున్నాయిఅవి 'మేక్ ఇన్ ఇండియా'కు వెన్నుముకగా నిలుస్తూ ఈ కలను నిజం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయిఈ సంస్థలు రికార్డు స్థాయిలో ఉద్యోగాలను సృష్టిస్తున్నాయిమన ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ సత్తా చాటుతున్నాయిఅనేక దేశాల అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములవుతూ స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారీ ఆర్డర్లను సాధిస్తున్నాయిభారత్ ఒక కీలకమైన మైలురాయికి చేరుకుందనిరాబోయే 25 ఏళ్లు దేశ రూపురేఖలను మార్చేలా ఉంటాయని ఇది సంకేతం ఇస్తోంది.

 

గౌరవ అధ్యక్షా,

 

కాంగ్రెస్ తన ద్రోహపూరిత రాజకీయాల్లో ఈ దేశ రైతులను కూడా వదిలిపెట్టలేదుమన దేశంలో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న చిన్న రైతులు 10 కోట్ల మంది ఉన్నారువారిని గతంలో ఎప్పుడూ పట్టించుకోలేదుకొందరు పెద్ద రైతులతో కలిసి ఉంటూ వ్యవస్థ నడుస్తుందని భావించడం వారి రాజకీయ శైలిఅందుకే చిన్న రైతుల ప్రాముఖ్యతను వారు గుర్తించలేదు.

 

గౌరవ అధ్యక్షా,

 

మేం చిన్న రైతుల బాధను అర్థం చేసుకున్నాంమాకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుఅందుకే మేం 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధిపథకాన్ని ప్రవేశపెట్టాంచాలా తక్కువ కాలంలోనే రూ. 4 లక్షల కోట్లను నేరుగా చిన్న రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశాంగౌరవ అధ్యక్షా.. రూ. 4 లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదుఇది మన చిన్న రైతులకు కొత్త బలాన్నికొత్త కలలనుకొత్త సామర్థ్యాలను ఇచ్చిందిమన రైతులు దేశ ఆశయాలకు అనుగుణంగా ఫలితాలను అందిస్తారనే నమ్మకం నాకుంది.

 

గౌరవ అధ్యక్షా,

 

పథకాల అమలు గురించి కొందరు సహచరులు చాలా మాట్లాడారుబహుశా వారు ఇలా మాట్లాడాలని ముందే సిద్ధమై వచ్చినట్లున్నారువారి కూటమి బంధం ఇక్కడ కనిపిస్తోంది కానీ మరెక్కడా కనిపించడం లేదు.

 

గౌరవ అధ్యక్షా,

 

అమలు గురించి వారు గొప్పగా చెబుతున్నారునేనొక ఉదంతాన్ని పంచుకుంటాను.. ఎవరినీ విమర్శించడానికి కాదు వాస్తవాలను చెప్పడానికి మాత్రమేవాస్తవాలు కొందరికి ఇబ్బంది కలిగించొచ్చుకానీ నిజం ఎప్పుడూ నిజమేగతంలో మన దేశానికి చెందిన ఒక నాయకురాలు హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించారుతిరిగి వచ్చాక ఆమె స్వయంగా ఈ విషయాన్ని చెప్పారుఇది రికార్డుల్లో కూడా ఉందిఆమె ఏమన్నారంటే.. 'పర్వత ప్రాంతాల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించడానికి ప్రణాళిక సంఘం నిరాకరించడంతో నేను చాలా కాలం పోరాటం చేయాల్సి వచ్చిందినేను హిమాచల్ వెళ్లి వచ్చాక ప్రణాళిక సంఘంతో మా కార్యకర్తలకు జీపులు కాదు బరువులు మోయడానికి కంచర గాడిదలు కావాలని చెప్పానుఅప్పుడు ఆమెకు వచ్చిన సమాధానం ఏంటంటే.. 'మేం కేవలం జీపులకే నిధులు ఇస్తాం ఎందుకంటే కంచర గాడిదల కోసం మా వద్ద ఎటువంటి పాలసీ లేదు.' అదే ప్రసంగంలో ఆమె.. 'అక్కడ అప్పట్లో రోడ్లు కూడా లేవుఅని చెప్పారురోడ్లే లేని చోట జీపులు ఎందుకురోడ్లు లేని చోట జీపును ఎవరు నడుపుతారుఅయినప్పటికీ ప్రణాళిక సంఘం మాత్రం 'ఇస్తే జీపులు ఇస్తాం లేదంటే ఏమీ ఇవ్వంఅని మొండికేసింది.

 

గౌరవ అధ్యక్షా,

ఈ మాటలు అన్నది మరెవరో కాదు.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలుఅప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారుకాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో ఉన్న పని సంస్కృతి ఇదిఇటువంటి తప్పుడు పద్ధతులు జరుగుతున్నాయని ఇందిరా గారికి తెలిసినప్పటికీ ఆమె వాటిని సరిదిద్దడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదుఆమె విమర్శించిన ఆ ప్రణాళిక సంఘాన్ని స్వయంగా ఆమె తండ్రి గారే ఏర్పాటు చేశారుఅది ఏర్పడినప్పటి నుంచి ఆమె ఈ ప్రసంగం చేసే సమయానికి రెండు దశాబ్దాలు గడిచినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. 2014 వరకు అందరూ అసంతృప్తిగానే ఉన్నారు.. అందరూ తప్పులను చూశారు.. కానీ ఎవరూ సంస్కరణలకు సిద్ధపడలేదు. 2014లో మాకు అవకాశం లభించినప్పుడు మేం ఆ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి 'నీతి ఆయోగ్'ను ఏర్పాటుచేశాంనేడు నీతి ఆయోగ్ అత్యంత వేగంగా పనిచేస్తోంది. 'ఆకాంక్షిత జిల్లాలకార్యక్రమమే దీనికి ఒక శక్తిమంతమైన ఉదాహరణఅభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక గొప్ప నమూనా అని నేడు అంతర్జాతీయ సంస్థలు సైతం ప్రశంసిస్తున్నాయిఒకప్పుడు వెనుకపడ్డవిగా ముద్రపడి లక్షలాది మంది ప్రజల ప్రాథమిక అవసరాలు నిర్లక్ష్యానికి గురైన జిల్లాలు ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నాయిగతంలో ఇటువంటి జిల్లాలకు అధికారులను పంపడాన్ని ఒక 'శిక్ష'గా భావించేవారుదీనివల్ల అక్కడి పరిస్థితులు మరింత దిగజారేవిఅప్పట్లో ఉన్న పని సంస్కృతి అదిమేం దీనిని మార్చాంమేం అక్కడ సమర్థులైన యువ అధికారులను నియమించాంవారికి పని చేయడానికి మూడేళ్ల సమయం ఇచ్చాంఒకదాని తర్వాత ఒకటిగా కీలక నిర్ణయాలు తీసుకున్నాంనేడు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ను చూడండిఒకప్పుడు అది ఆకాంక్షిత జిల్లానేడు 'బస్తర్ ఒలింపిక్స్ద్వారా ఆ జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోందిఅభివృద్ధి ప్రతి గ్రామానికి చేరుతోందికొన్ని గ్రామాలకు మొదటిసారి బస్సు సౌకర్యం రావడంతో ఆ ప్రాంత ప్రజలంతా పండుగలా జరుపుకున్నారుమేం తీసుకువచ్చిన పరివర్తన ఇదికానీ దేశాన్ని అటువంటి దుస్థితిలో వదిలేసిన వారు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు.

 

 

గౌరవ అధ్యక్షా!

వాస్తవానికి ఆచరణాత్మకత అంటే ఏమిటో చెప్పడానికి ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమమే తిరుగులేని నిదర్శనంఉదాహరణఇలాంటివి వందల సంఖ్యలో ఉన్నప్పటికీఉటంకింపు నిమిత్తం దీన్ని ఉదాహరించానుఈ ప్రగతిశీల పరిణామాలకు దన్నుగా ఉన్న ఆచరణాత్మక సామర్థ్యం మా కాంగ్రెస్ మిత్రులకు కానరావడం లేదుపాతకాలపు ప్రణాళిక సంఘ విధానం... అంటే- “జీప్ కంచర గాడిద” వారి ఏకైక నమూనా కావడమే ఇందుకు కారణంఅంతకుమించి వారికేమీ తెలియదుఆచరణాత్మకత గురించి ఒక్కసారి యోచిద్దాం... నర్మదా నదిపై ఒక ఆనకట్టను నిర్మించాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేను పుట్టక ముందే సంకల్పించారుఅందుకు ప్రణాళిక కూడా సిద్ధమైంది... కానీ,  సర్దార్ పటేల్ మరణించారుఅటుపైన శ్రీ నెహ్రూ శంకుస్థాపన చేశారుదశాబ్దాలు గడిచినా అతీగతీ లేదునేను ప్రధానమంత్రిని అయ్యాక దాన్ని ప్రారంభించే గౌరవం నాకు దక్కిందినా రైతుల ప్రయోజనాలు లక్ష్యంగా సర్దార్ సరోవర్ ఆనకట్ట కోసం ముఖ్యమంత్రి హోదాలో నా ప్రతిష్టను పణంగా పెట్టిమూడు రోజుల నిరాహార దీక్ష చేయాల్సి వచ్చిందిదాంతో కేంద్ర ప్రభుత్వం దిగి రాగానిర్మాణం ఊపందుకుందిఇవాళ ‘బీఎస్‌ఎఫ్‌’ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న కచ్‌లోని ఖావడా సరిహద్దు వరకూ స్వచ్ఛ నర్మదా జలాలు ప్రవహిస్తున్నాయిఆచరణాత్మకత అంటే ఇదే... కానీకాంగ్రెస్‌ పార్టీ తద్విరుద్ధంగా రాజకీయ లబ్ధి కోసం ప్రకటనలు చేసిలాంఛనప్రాయంగా జ్యోతి వెలిగించిపునాది రాళ్లు వేయడంతో సరిపెట్టింది తప్పఆ తర్వాత చేసింది శూన్యంఈ సంస్కృతిని మార్చే లక్ష్యంతోనే నేను ‘ప్రగతి’ పేరిట సరికొత్త సాంకేతిక పర్యవేక్షణ వేదికను సృష్టించానుఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెబుతానుహిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక రైల్వే ప్రాజెక్టు చేపడతామని పార్లమెంటులో ఒక ప్రకటన చేశారుఅది బహుశా ‘ఊనా’ ప్రాజెక్టు అనుకుంటానుకానీనేను అధికార బాధ్యతలు స్వీకరించే నాటికి కనీసం దానికి సంబంధించిన రేఖాచిత్రం కూడా గీసిన దాఖలాలు లేవుఅప్పట్లో ఎన్నికలను దృష్టి పెట్టుకుని ఒక ప్రకటతో సరిపెట్టారుఅయితే, ‘ప్రగతి’ వేదిక ద్వారా అలాంటి మరెన్నో ప్రాజెక్టులను నేను సమీక్షించిపర్యవేక్షిస్తూ వచ్చానుప్రతి ప్రాజెక్టు ఎందుకు స్తంభించిందోఅది ఏదైనా శాఖ తప్పిదమోచట్టపరమైన అడ్డంకులున్నాయో లేక అంచనా వ్యయం ఎందుకు పెరిగిందో... వంటి ఎన్నో అంశాలను మేం నిశితంగా పరిశీలించాంఓ ప్రాజెక్టు ₹900 కోట్లతో పూర్తికావాల్సి ఉండగాదాని వ్యయం ₹90,000 కోట్లకు పెరిగిపోయిందిమేం నెలవారీ సమీక్ష ప్రారంభించాక ఇప్పటివరకూ నేను 50వ విడత ‘ప్రగతి’ సమావేశాన్ని ఇటీవలే పూర్తి చేశానురాష్ట్రాలతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో ఇలా ₹85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మార్గం సుగమం చేశాంఅంటే జాతీయ స్థాయిలో ఎంతటి శక్తిసామర్థ్యాలను మేం వెలికితీశామో గమనించండిరైల్వేలురహదారులునీటిపారుదలగ్రామీణ మౌలిక సదుపాయాలువగైరాల పనులన్నీ వేగిరపరచాంమూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన జమ్మూ-ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం ఇప్పుడు పూర్తయిందిమంచుతో కమ్ముకుపోయిన లోయల గుండా వందే భారత్ రైలు ప్రయాణిస్తున్న వీడియో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడమే కాదు... “ఇది విదేశాల్లోని దృశ్యం కాదు... ఇది సాక్షాత్తూ భారత్‌” అంటూ ప్రజలు అందులో వ్యాఖ్యానించారుఆచరణాత్మకత అంటే ఇదీ!

గౌరవ అధ్యక్షా!

నేనిప్పుడు అస్సాం గురించి ప్రస్తావిస్తున్నానుఇందుకు కారణం ఎన్నికలు కానేకాదు... కాంగ్రెస్ వైఫల్యాలేకాంగ్రెస్ ఆచరణాత్మకత కేవలం ఊహలకే పరిమితం తప్ప అమలువైపు ఎన్నడూ ఉండదుఈ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్అస్సాం రాష్ట్రాలను కలిపే బోగిబీల్ వంతెననే ఉదాహరణగా తీసుకోండిఈ కీలక ప్రాజెక్టు ఏళ్ల తరబడి స్తంభించిందిమేం ‘ప్రగతి’ ద్వారా దీన్ని సమీక్షించిపర్యవేక్షించడంతో ఇవాళ అది పూర్తయిందిఇప్పుడు అస్సాం సహా ఈశాన్య భారతం మొత్తానికీ అపార ప్రయోజనాన్ని చేకూరుస్తోంది.

గౌరవ అధ్యక్షా!

ఆచరణాత్మక విషయానికొస్తేఏ ప్రాజెక్టునైనా నిర్దేశిత వ్యవధిలో... అనేకమార్లు గడువుకు ముందుగానే పూర్తి చేశామనడానికి మా వద్ద వాస్తవ ఆధారాలు ఉన్నాయిసౌర విద్యుత్‌ సామర్థ్యానికి సంబంధించి 2030 నాటికి కొన్ని లక్ష్యాలను సాధించగలమని ప్రతినబూనగా, 2025 నాటికే గమ్యం చేరాంఇథనాల్ లక్ష్యాన్ని కూడా రెండు మూడేళ్లు ముందుగానే చేరుకున్నాముమా వాస్తవిక ఆచరణాత్మక సామర్థ్యం బలమైనది మాత్రమేగాక గడువుకు ముందే గమ్యం చేర్చగలదని ఈ ఉదంతాలు నిరూపిస్తున్నాయి.

గౌరవ అధ్యక్షా!

బీజేపీఎన్డీఏ ప్రభుత్వాల విధానాలు కాంగ్రెస్ విధానాలకు పూర్తి భిన్నంమా దృక్పథం.. సమస్యలను పరిష్కరించే మా ధోరణి పూర్తి భిన్నందేశంలోని 140 కోట్ల మంది పౌరుల సమస్యలను పరిష్కరించగలమని మేం విశ్వసిస్తాం... మన ప్రజానీకాన్నివారి శక్తిని విశ్వసిస్తాం.. ఇదే ప్రజాస్వామ్యం వాస్తవిక శక్తికానీకాంగ్రెస్ పార్టీకి ప్రజలే పెద్ద సమస్యఇప్పుడు నేనొక ఉదాహరణ  చెబుతానుఇందిరాగాంధీ ఒకసారి ఇరాన్‌లో మాట్లాడుతూనెహ్రూజీతో ఓ సంభాషణను గుర్తు చేసుకున్నారుమీకెన్ని సమస్యలు ఎదురయ్యాయిఅని ప్రశ్నిస్తే- “35 ఐదు కోట్లు” అని ఆనాడు ఆయన బదులిచ్చినట్లు ఆమె ఉటంకించారుఎందుకంటేఅప్పటికి భారత జనాభా 35 కోట్లు కాగా,  ఆయన దృష్టిలో ప్రతి పౌరుడూ ఒక సమస్యేఅటుపైన జనాభా 57 కోట్లకు పెరగడంతో తన సమస్యలు రెట్టింపయ్యాయని ఇందిరాగాంధీ కూడా వ్యాఖ్యానించారుఇలా సొంత ప్రజలనే సమస్యగా పరిగణించిన నాయకుల ధోరణికిమా మనస్తత్వానికిగల ఈ తేడా గురించి ఇప్పుడు ఒకసారి ఆలోచించండిమాకు ప్రతి పౌరుడూ ఒక పరిష్కారం.. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఒక భాగస్వామిమరి వారికోపౌరులంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సమస్య!

గౌరవ అధ్యక్షా!

ఈ మాట నేనెన్నో సార్లు చెప్పాను... అది వాచాలత్వంతో కాదు... దృఢ విశ్వాసంతో అన్న మాటసమస్యలు ఎంత పెద్దవైనామా దగ్గర 140 కోట్ల పరిష్కారాలున్నాయిమన ప్రజలే మనకు ఎనలేని సంపదప్రతి పౌరుడూ ఒక సృష్టికర్త.. ఒక నిర్మాత.. భారత ఉజ్వల భవిష్యత్తుకు సంరక్షకుడుఅలాంటప్పుడు మనం వారిని సమస్యలుగా పరిగణించగలమాఈ తరహా ఆలోచన ధోరణిగల వారు తమ కుటుంబాలకు మాత్రమే సేవకులుగా ఉంటారు తప్ప దేశానికి కానేకాదు!

గౌరవ అధ్యక్షా!

భారత ప్రజలను అవమానించడం కాంగ్రెస్ స్వభావంలో.. సంస్కృతిలో అంతర్భాగమై పోయిందిఇటీవలే వారు మన రాష్ట్రపతిని అవమానించారుఎన్నికల తర్వాత వారు వాడిన పదజాలం మనందరికీ సిగ్గుచేటుపేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిఅత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన గిరిజన మహిళను అవమానించడమంటేయావత్‌ గిరిజన సమాజాన్నీ అవమానించడమే.. మహిళలను అవమానించడమే... చివరకు సాక్షాత్తూ రాజ్యాంగాన్ని కూడా అవమానించడమే.

గౌరవ అధ్యక్షా!

కాంగ్రెస్ ఏమనుకున్నా... ఇది వారి తీవ్ర తప్పిదమేనాకు అదనపు సమయం కేటాయించినందుకు మీకుఈ సభకు ధన్యవాదాలు.

గౌరవ అధ్యక్షా!

లోక్‌సభలో కొన్ని సంఘటనలు నన్ను తీవ్రంగా బాధించాయినిరాశనిస్పృహలు అర్థం చేసుకోదగినవే కానీప్రజాస్వామ్య పవిత్ర ఆలయాన్ని ఇలా అపవిత్రం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదుఆ సమయంలోఅస్సాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడొకరు అధ్యక్ష స్థానంలో ఉన్నారుఆయనపై కాగితాలు చింపి విసిరారు.. బల్లల మీదికెక్కారు.. ఇది ఈశాన్య ప్రాంతాన్ని అవమానించడం కాదాఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించే దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి అధ్యక్ష స్థానంలో ఉండగాఆయననూ అవమానించారుఈశాన్య ప్రాంతంతోపాటు దళితులను అవమానించడం అన్నది వారిపట్ల కాంగ్రెస్ చిన్నచూపును ప్రస్ఫుటం చేస్తుందిఅస్సాం ప్రజలు ఇక కాంగ్రెస్‌కు మద్దతివ్వరన్న కారణంతోనే వారిపై ద్వేషం పెంచుకున్నట్లు అనిపిస్తుందిప్రజాస్వామ్యం పనిచేసే తీరు ఇదేనా?

గౌరవ అధ్యక్షా!

భారతరత్న భూపేన్ హజారికా గారిని గుర్తుచేసుకుని నేనెంతో వేదనకు గురయ్యానుఆయన గీతాలుగాత్రం దేశాన్ని ఏకం చేశాయిఅటువంటి మహనీయుడికి భారతరత్న పురస్కార ప్రదానం చేసే గౌరవం మాకు దక్కిందిఅయితేదీన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించింది... ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా శ్రీ ఖర్గే వ్యవహరించిన తీరు వీడియోల్లో నిక్షిప్తమైందిఆయన హావభావాల్లో చిన్నచూపు స్పష్టంగా కనిపిస్తుందిహజారికా గారిని “కేవలం ఒక గాయకుడు” అని కొట్టిపారేయడం అస్సాంనుభారత కళాభిమానులను అవమానించడమేకాంగ్రెస్ ఆయనకు భారతరత్న ప్రకటించడాన్ని వ్యతిరేకించింది.. అస్సాంతోపాటు దేశ ప్రతిష్ఠను వ్యతిరేకించిందిఈ అవమానాలను అస్సాం ఎన్నటికీ మరువజాలదని నేను కచ్చితంగా చెప్పగలను.

గౌరవ అధ్యక్షా!

నిన్న ఇదే సభలోకాంగ్రెస్ సభ్యుడువారి యువరాజులలో ఒకరుసాటి ఎంపీని “దేశద్రోహి”గా నిందించారువారి అహంకారం పరాకాష్ఠకు చేరిందనడానికి ఇదే నిదర్శనంఆ పార్టీ నుంచి చాలా మంది నిష్క్రమించారు.. ఆ పార్టీ చీలిపోగానాయకులు ఇతర పార్టీలలో చేరారుఅయినా వారిలో ఎవరినీ దేశద్రోహులుగా ముద్ర వేయలేదుకానీ నిన్నఒక ఎంపీ సిక్కు అయినందుకే ఆయనను దేశద్రోహిగా నిందించారుఇది సిక్కులకుగురువులకు అవమానంకాంగ్రెస్ ఆమూలాగ్రం సిక్కులపైగల ద్వేషాన్ని ఇది బట్టబయలు చేసిందిఈ సభలో ఆ మాట అన్న సదరు సభ్యుడు కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించ లేదుఇవాళ అతడు లేచి నిలబడి “నిన్నటి సంఘటన పార్లమెంటు గౌరవానికి భంగం కలిగించేదే... ఇందుకు మేం చింతిస్తున్నాం” అని చెప్పగలిగే వీలుందికానీఅలా చేయలేదు... దేశం కోసం రక్తతర్పణం చేసిన ఒక కుటుంబం దాని సభ్యులలో ఒకరు రాజకీయ అభిప్రాయాన్ని మార్చుకున్న కారణంగా ఇలా అవమానించారుఆయనను దేశద్రోహిగా ముద్ర వేయడం ఆషామాషీ విషయం కాదుఏ పౌరుడినైనా దేశద్రోహి అనడాన్ని దేశం ఎలా సహిస్తుంది... ముఖ్యంగా ఒక సిక్కునుఇదెంతో దురదృష్టకరం.. అలాంటి ప్రవర్తన కాంగ్రెస్‌ను మరింతగా ఊబిలోకి దించుతుంది.

గౌరవ అధ్యక్షా!

ఒకవైపు మనం ఈ పరిణామాలను చూస్తున్నాం.. మరోవైపు సదానంద్ మాస్టర్‌ గారి ఉదాహరణ మన కళ్లముందు కనిపిస్తోందిరాజకీయ కక్షల ఫలితంగా ఆయన యవ్వన ప్రాయంలోనే రెండు కాళ్లను నరికివేశారుఇప్పుడాయన కృత్రిమ కాళ్లతో జీవనం కొనసాగిస్తున్నారుఅయినాఆయన మాటల్లో ఆగ్రహం కనిపించదు.. ఆయన ప్రవర్తనలో కఠినత్వం కానరాదుఇది మనకు ఎంతో గర్వంగా ఉంటుందినిన్నఆయన ఈ సభలో తన తొలి ప్రసంగం చేసిన సమయంలో మీ అనుమతితో తన కృత్రిమ కాలును సగౌరవంగా తన పక్కనే ఉంచుకున్నారుఆ దృశ్యం దేశాన్ని కలత పెట్టింది... కేవలం సైద్ధాంతిక విభేదాలతో ఒక యువ ఉపాధ్యాయుడి కాళ్లను నరికివేయడంపై ఈ ‘ఇండియా  కూటమే’ బాధ్యత వహించాలిఅయినాఆయనలో ఎలాంటి కోపంద్వేషం కనిపించ లేదుఈ సందర్భంగా మాస్టర్‌ గారికి నా హృదయపూర్వక నమస్సులుఇంత క్రూరమైన దాడికి గురైనాదేశ సేవపై తన అంకిత భావాన్ని ప్రదర్శిస్తూఇవాళ విధాన రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారుఇది మనందరికీ ఎంతో గర్వకారణం... ఇలాంటి వారి బలమే రాజకీయాల్లో మన మనుగడకు కారణంవారి త్యాగం దేశం కోసం జీవించడానికే కాదు... మరణించడానికైనా మనకు స్ఫూర్తినిస్తుంది.

గౌరవ అధ్యక్షా!

కాంగ్రెస్ సహచరులు నాపై ఇటీవల ప్రత్యేక ప్రేమను ప్రదర్శిస్తున్నారుబాధ్యత లేకపోయినా మేం దేశం కోసం జీవించడం నేర్చుకున్నాంవికసిత భారత్‌కు మేం పునాది వేస్తూదాన్ని బలోపేతం చేస్తున్నాంనేను యువత కోసం పటిష్ఠ పునాది వేస్తుంటేకాంగ్రెస్ వారు మోదీ సమాధి తవ్వడానికి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారుప్రేమ సౌధాలు నిర్మిస్తామంటున్న వారు “మోదీనీకు సమాధి తవ్వుతాం” అని నినదిస్తున్నారుసాటి పౌరుడి సమాధి తవ్వాలని కలలుగనే ఆ ప్రేమ సౌధం ఎలాంటిదిఇలాంటి మాటలు మాట్లాడమని ఏ రాజ్యాంగ సూత్రం వారికి బోధించిందిఇది రాజ్యాంగానికిమానవత్వానికిప్రజా జీవన గౌరవానికి అవమానం కాదాఅయినావారికెలాంటి పశ్చాత్తాపం లేదుఇక “ప్రధానమంత్రి రాజ్యసభలో విలపిస్తున్నారు” అని కూడా అన్నారుఎలాంటి పెంపకం ఇలాంటి ప్రవర్తనకు దారితీస్తుంది?

గౌరవ అధ్యక్షా!
నాకు సుదీర్ఘ అనుభవం ఉంది... 2002 నుంచి వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, 2004 నుంచి వారు అధికారంలోకి వచ్చినప్పుడు, 2014 నుంచి నేనీ సభలో ప్రవేశించినప్పటి నుంచి... ఇలా 25 ఏళ్లకు పైగా మోదీపై కాంగ్రెస్‌ దూషణలేని ఒక్క సమావేశాన్ని కూడా నేను చూడలేదుఒకసారి ఎవరో నా ఆరోగ్య రహస్యం ఏమిటని అడిగితే- “నిత్యం రెండు కిలోల తిట్లు తింటాను” అని నేను జవాబిచ్చాను.

గౌరవ అధ్యక్షా!
వారు మోదీ సమాధి ఎందుకు తవ్వాలనుకుంటున్నారుఇది కేవలం వాక్చాతుర్యంతో కూడిని నినాదం కాబోదుఇది వారిలోని ద్వేషాన్ని ప్రతిబింబిస్తుందిమేము ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్లనే వారు మోదీ సమాధి తవ్వాలని భావిస్తున్నారుఒకప్పుడు బాంబు పేలుళ్లతోతుపాకీల నీడలో భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమనే ఈశాన్య భారతంతో శాంతికిప్రగతికి బాటలు వేయడమే వారు మోదీ సమాధి తవ్వాలని భావించడానికి కారణంపాక్‌ ఉగ్రవాదులను వారి భూభాగం మీదనే మట్టి కరిపించినందుకు వారు మోదీ సమాధి తవ్వుతామని చెబుతున్నారుమేం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు వారు మోదీ సమాధి తవ్వుతామని ప్రకటిస్తున్నారుదేశాన్ని మావోయిస్టు ఉగ్రవాద విముక్తం చేయడానికి మేం సాహసోపేత చర్యలు తీసుకున్నందుకే వారు మోదీ సమాధి తవ్వాలని భావిస్తున్నారునెహ్రూ సంతకం చేసిన అన్యాయమైన సింధు జల ఒప్పందం స్తంభింపజేసినందుకే వారు మోదీ సమాధి తవ్వాలనుకుంటున్నారు.

గౌరవ అధ్యక్షా!
కాంగ్రెస్ సమస్య భిన్నమైనది... మోదీ ఈ స్థాయికి చేరుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారువారిలో నిరాశ పెరుగుతోంది... ఎందుకంటేమోదీ రావడమే కాదు... ఆయన అన్నిటినీ భరించాడు కాబట్టేవారు “మోదీనీకు సమాధి కడతాం” అనే ఏకైక నినాదం ఎన్నుకున్నారు.

గౌరవ అధ్యక్షా!
ప్రధానమంత్రి కుర్చీ తమ కుటుంబ వారసత్వమని అని వారు విశ్వసిస్తున్నారుఅక్కడ మరెవరూ కూర్చోలేరు... వారిలోని ఈ ద్వేషంవారి ప్రేమ సౌధంలో మండుతున్న నిప్పు మోదీ సమాధిని తవ్వాలని వారిచేత నినాదాలు చేయిస్తున్నాయి.

గౌరవ అధ్యక్షా!

కాంగ్రెస్ రాజవంశానికి దశాబ్దాలుగా అవకాశం లభించింది... తద్వారా దేశం తన భవిష్యత్తును పణంగా పెట్టిందివారు “గరీబీ హఠావో” (పేదరిక నిర్మూలననినాదం చేశారు కానీప్రజలను అలా తప్పుదోవ పట్టించారుకాంగ్రెస్‌లో ప్రతి ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి పేదరిక నిర్మూలన గురించి మాట్లాడటమే తప్ప ఆచరణ శూన్యంవారివి శుష్క నినాదాలు... కానీపేదల సాధికారత దిశగా మోదీ తనదైన మార్గాన్ని ఎంచుకున్నారునా దేశంలోని పేదలకు వందనం... వారు మా విధానాలనుఉద్దేశాలను విశ్వసించారుఅలాగేతమనుతాము బలోపేతం చేసుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేశారుకాబట్టే, 25 కోట్ల కుటుంబాలవారు పేదరిక విముక్తులై స్వీయ సముద్ధరణను సాధించారుఅందుకే వారందరికీ నా వందనం... ఒకప్పుడు నిరాశలో మునిగిన వారంతా ఆశాకిరణం వైపు పయనిస్తూ ఇప్పుడు మనదో పదం కలిపి కదం తొక్కుతున్నారు.

గౌరవ అధ్యక్షా!

దేశంలో 2014కు మానవ రహిత రైల్వే క్రాసింగ్‌ల వద్ద వందలాదిగా జనం మరణించారురైళ్లు స్కూలు బస్సులను ఢీకొట్టగా ఎందరో బాలలు ప్రాణాలు కోల్పోయారుఅయినాఆ క్రాసింగ్‌లను అలాగే వదిలేశారు... కాంగ్రెస్ దీన్ని కూడా సరిదిద్దలేక పోయిందిమేం వాటన్నిటినీ తొలగించాం... ప్రాణాలను కాపాడాం.. అందుకే మరి.. వారు మోదీకి సమాధి తవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు.

గౌరవ అధ్యక్షా!

దేశంలో 2014కు 18,000 గ్రామాలు అంధకారంలో మునిగి ఉండేవిఅక్కడి ప్రజలకు వైర్లుబల్బులంటే ఏమిటో తెలియవుఆ తర్వాత ప్రజలు మామీద విశ్వాసం ప్రకటించడంతో ఆ 18,000 గ్రామాలకు మేం వెలుగునిచ్చాంఈ కారణంగానూ వారు మోదీ సమాధి తవ్వాలని చూస్తున్నారు.

గౌరవ అధ్యక్షా!

ఒకప్పుడు “సైనికులకు మందుగుండు సామగ్రిబుల్లెట్‌ ప్రూఫ్ జాకెట్లుమంచులో నడిచే బూట్లు కూడా లేవు” అని వార్తా పత్రికల ప్రధాన శీర్షికలు ఘోషించేవికానీమన సైనికుల కోసం మేం ఖజానాను తెరిచాం.. వారికి అవసరమైనవన్నీ సమకూర్చాలని నిర్ణయించాంకాంగ్రెస్‌ వారు మోదీ  సమాధిని తవ్వాలని భావించడానికి ఇదీ ఒక కారణమే!

గౌరవ అధ్యక్షా!

ఉత్తరప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అంతకుముందు ఒకనాడు ఈ సభలో మెదడువాపు వ్యాధితో మరణిస్తున్న బాలల అంశాన్ని ప్రస్తావిస్తూ కంటనీరు పెట్టారుకానీఈ వ్యాధి నుంచి దేశాన్ని విముక్తం కాంగ్రెస్ ఎన్నడూ తలపోసింది లేదు.

గౌరవ అధ్యక్షా!

ట్రకోమా అనే కంటి వ్యాధి చాలా మందిని అంధులుగా మార్చిందిశాస్త్రవిజ్ఞాన పురోగమనంతో ఈ వ్యాధి నివారణ సాధ్యమైందిగానీకాంగ్రెస్ చేసిందేమీ లేదుఅయితేదేశాన్ని మేం మెదడువాపు వ్యాధి నుంచి విముక్తం చేయడంతోపాటు ట్రకోమా నుంచి నయనాలకు రక్షణనిచ్చాంఇన్ని విజయాలుఈ అవగాహనసమాజం కోసమే జీవన్మరణాలనే మా సంకల్పంఇవన్నీ వారికెంతో ఇబ్బంది కలిగిస్తున్నాయిఅందుకే వారు ప్రజాస్వామ్యంప్రేమ గురించి మాట్లాడుతూ- “మోదీ.. నీకు సమాధి తవ్వుతాం” అంటూ నినదిస్తారునాయకుల ప్రజా జీవనం తీరు ఇదేనా?

గౌరవ అధ్యక్షా!

కాంగ్రెస్‌ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్‌తో నడుస్తుంది... నా ప్రభుత్వం నడిచేదీ 140 కోట్ల భారతీయులనే రిమోట్ కంట్రోల్ ద్వారానే... వారి కలలుఆకాంక్షలుసంకల్పమే మమ్మల్ని నడిపిస్తున్నాయి.  అధికారమంటే మాకు ఆనందానికి మార్గం కాదు.. సేవకు అదొక మాధ్యమం మాత్రమేముద్రా యోజన ద్వారా కోట్లాది యువత స్వయం ఉపాధి మద్దతు పొందారుకాంగ్రెస్ అంకుర సంస్కృతిని ఎన్నడూ ప్రోత్సహించ లేదుఅసలు వారికి తెలిసింది కొన్ని వందల అంకుర సంస్థల గురించి మాత్రమేకనీసం తమ సొంత కుటుంబ అంకురాన్ని కూడా వారు ఆదుకోలేకపోయారుకానీఇవాళ మా ప్రభుత్వ హయాంలో 2,00,000కుపైగా అంకుర సంస్థలు దేశంలో గుర్తింపు పొందాయిఈ వరుస విజయాలు ప్రజల హృదయాలను గెలుచుకుంటుంటేకాంగ్రెస్ మాత్రం “మోదీనీ సమాధి తవ్వుతాం” అని నినదిస్తుందిదేశంలో ఒకనాడు బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ ఒక హస్యోక్తిగాకార్టూన్లకు పరిమితమైనదిగా ఉన్న రోజులను ఓసారి గుర్తుతెచ్చుకోండిఈ రోజున మేం స్వదేశీ 4జి శ్టాక్‌ను రూపొందించాంప్రపంచంలోని ఏ దేశంతో పోల్చినా అత్యంత వేగంగా 5జి సాంకేతికతను తెచ్చాంకొత్త సాంకేతికతలుసరికొత్త ఆలోచనలతో కమ్యూనికేషన్‌ సదుపాయాలను మేం అభివృద్ధి చేశాంకాబట్టేవారిలో గూడు కట్టుకున్న బాధ “మోదీనీ సమాధి తవ్వుతాం” అంటూ ప్రతిధ్వనిస్తూంటుంది!

గౌరవ అధ్యక్షా!

పేదలకు సేవ చేయగలగడం నాకు దక్కిన అదృష్టం... దేశవ్యాప్తంగా కోట్ల పేద కుటుంబాలకు శాశ్వత గృహవసతి కల్పించడం నా జీవితంలో ఎంతో శాంతినిచ్చిందిదేవుడు నన్ను ఆశీర్వదించి విద్యుత్తునీరుగ్యాస్  సిలిండర్లుమరుగుదొడ్లువంటివన్నీ ప్రజలకు అందించాల్సిందిగా ప్రేరణ ఇచ్చినట్లు నేను భావిస్తున్నానుగ్రామీణ మహిళలు సగర్వంగా “అవును.. నేను లక్షాధికారి సోదరినయ్యాను” అని ఇవాళ తొలిసారిగా అంటున్నారుమరికొందరు, “ఈ ఏడాదిలోగా నేను కూడా అవుతాను” అంటూ ఆత్మవిశ్వాసం ప్రకటిస్తున్నారుఇప్పటికే లక్షాధికారులుగా మారినవారు ఇక “ఇక్కడితో ఆగం.. కోటీశ్వరులం కావాలని ఇప్పుడు ఆలోచిస్తున్నాం” అంటున్నారుఆలోచనా విధానంలో ఈ మార్పుఆత్మవిశ్వాసం పెరుగుదలవంటి లక్షలాది పౌరుల ఆశీర్వాదాలతోపాటు తల్లులుఅక్కచెల్లెళ్ల అండదండలు రక్షణ కవచంలా ఉన్నాయికాబట్టిఎవరెన్ని నినాదాలు చేసినాఎంత పలవరించినా సదరు వ్యక్తికి ఏ సమాధినీ తవ్వలేరుఎవరినైతే ఎవరూ పట్టించుకోలేదో... మోదీ ఎవరినైతే గౌరవిస్తాడోతల్లులకు-అక్కచెల్లెళ్లకు నేనెంత భక్తిశ్రద్ధలతో సేవ చేశానో అదే వారి ఆశీర్వాదాలన్నిటికీ కారణంనా ప్రత్యర్థులను కలవరపెడుతున్నది వారి శుభాశీస్సులే.. అందుకే,  వారు సమాధి తవ్వడం గురించి మాట్లాడుతున్నారు.

గౌరవ అధ్యక్షా!

కొందరికి దొంగతనం వంశపారంపర్య వృత్తి... అందుకేవారు గుజరాతీ వ్యక్తి అయిన మహాత్మా గాంధీ ఇంటిపేరును కూడా దొంగిలించారుకానీదేశ ప్రజలు తెలివైనవారు గనుక ఆ మోసానికి గట్టిగా బుద్ధి చెప్పడం ఎలాగో వారికితెలుసు.

గౌరవ అధ్యక్షా!

వికసిత భారత్‌ స్వప్నంతో మేం మా ప్రయాణం ప్రారంభించాంఆ కల నేడు ప్రజాశక్తితో మమేకమై జాతీయ సంకల్పంగా మారిందిఇవాళ ఎక్కడికెళ్లినా “2047కల్లా భారత్‌ అభివృద్ధి చెందిన దేశం కావాలి” అంటున్నారుఅయినప్పటికీఈ సభలోని కొందరు సహచరులు ఎంతో నిరాశావాదంతోవాస్తవానికి ఎంతో దూరంగా ఉంటూ మారుతున్న ప్రపంచంపై ఇంతటి అజ్ఞానం ప్రదర్శించడం చూసి నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. “మోదీ 2047 గురించి ఎందుకు మాట్లాడుతున్నారుఆ రోజును ఎవరు చూడొచ్చారు?” అని ప్రశ్నిస్తున్నారుస్వాతంత్ర్యం కోసం నాడు పోరాడిన యువతరంఉరికొయ్యను కౌగలించుకున్న వీరులుబుల్లెట్లు-లాఠీ దెబ్బలుఅండమాన్‌లోని సెల్యులార్ జైలులో భయానక పరిస్థితులను అనుభవించిన త్యాగధనులు “మా జీవితకాలంలో స్వాతంత్ర్యం రాదేమో... మేమెందుకు పోరాడాలి?” అని ఆలోచించారాఒకవేళ వారు అలా ఆలోచించి ఉంటేఈ నాటికైనా దేశ దాశ్య శృంఖలాలు తెగి ఉండేవాఇక నేను డిజిటల్ ఇండియాఫిన్‌టెక్యూపీఐ గురించి మాట్లాడిన సందర్భాల్లో ఈ నిరాశావాదులు నన్ను హేళన చేశారు. “ఒక పేదవాడు మొబైల్ ఫోన్‌తో నగదు లావాదేవీలు చేయడం సాధ్యమా?” అని ప్రశ్నించారుకానీఅదంతా సాధ్యమేనని కేవలం మూడేళ్లలోనే దేశం నిరూపించిందిపార్లమెంటులో దీనిపై వారిలా ప్రసంగించడం నాకింకా గుర్తుందిఆ రోజున “మోదీకి గట్టి జవాబిచ్చాం” అని వారు సంబరాలు చేసుకున్నారుకానీమోదీ మౌనంగా ఉండిపోయినాఇవాళ మీ చేతిలోని మొబైల్ ఫోన్యూపీఐ ద్వారా అదే మీకు సమాధానమిచ్చింది.

గౌరవ అధ్యక్షా!

కాంగ్రెస్ హయాంలో “భారత్‌ తానెక్కాల్సిన బస్సు తప్పిపోయింది” అనే ఒక సాధారణ పదబంధం ప్రజల్లో విశేష ప్రాచుర్యం పొందిందిఎలాగంటే తీవ్రమైన చర్చల్లోచలోక్తులలో కూడా అదొక సామెతలా మిగిలిపోయిందిఅవకాశాలు చేజారాయి... సమయం మించిపోయింది... భారత్‌ బస్సందుకోలేక పోయింది.

గౌరవ అధ్యక్షా!

భారత్‌ ఇవాళ ఏ అవకాశాన్నీ చేజారనివ్వడం లేదు... బస్సు తప్పిపోయే ప్రసక్తే లేదు.

గౌరవ అధ్యక్షా!

వర్తమాన పరిస్థితులను ప్రకాశవంతం చేస్తూ దేశ భవిష్యత్తును ఉజ్వలం చేయడానికి మనం అవిరళ కృషి చేయాల్సిఉందివికసిత భారత్‌ దిశగా పయనానికివార్షిక బడ్జెట్‌లకు దిశానిర్దేశానికి మేం పంచవర్ష ప్రణాళికలను రూపొందిస్తాంమా లక్ష్యం తదుపరి ఎన్నికలు కాదుఅది 2047 నాటికి వికసిత భారత్‌ సాకారమేఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీనా దేశం శాశ్వతంసుసంపన్న భారత్‌ను యువత చేతిలో పెట్టడమే మా స్వప్నంఈ రోజున ఇళ్లలో పిల్లలను చూసినప్పుడునా కృషి ద్వారా వారు సంతృప్తి చెందగలిగేంత బలమైన దేశాన్ని వారి కోసం సృష్టించాలని శపథం పూనుతానుఅందుకేఇవాళ మేం 2047 గురించి మాట్లాడుతున్నాం.

గౌరవ అధ్యక్షా!

మేం చేపట్టిన కార్యక్రమాలను చూడండిఅంతరిక్షంసైన్స్టెక్నాలజీమహాసముద్రాల లోతులుభూమిఆకాశంబాహ్య అంతరిక్షం వంటి ప్రతి అంశంపైనా నిశితంగా దృష్టి సారించాంనవ సంకల్పంనవ్యోత్తేజంకొత్త బాటసరికొత్త విజయాలుఇలా భారత్‌ అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తోందిమేమిప్పుడు గ్రీన్ హైడ్రోజన్‌పై కృషి చేస్తున్నాం.. భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్నాంక్వాంటం కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నాం.. ఏఐ మిషన్‌ను ముందుకు తీసుకెళ్తున్నాంఇవాళ భారత్‌ ‘ఏఐ’కి గొప్పగా దోహదం చేస్తున్నదని ప్రపంచం విశ్వసిస్తోందికీలక ఖనిజాలుఅరుదైన లోహాలు భౌగోళిక రాజకీయ ఆయుధాలుగా మారాయిఇక భారత్‌ దేనికోసమైనా ఇతరుల ముందు చేయిజాచే అవసరం లేకుండా వాటిపై నిశితంగా దృష్టి సారిస్తున్నాం.

గౌరవ అధ్యక్షా!

విదేశీ పెట్టుబడులను ఆకర్షించగల అసంఖ్యాక ప్రాజెక్టులు నేడు మనకున్నాయిఎందుకంటేప్రతి పెట్టుబడిదారు ఇవాళ భారత గడ్డపై తమ భవిష్యత్తును చూడగలుగుతున్నారుతమ భవిష్యత్తు భారత యువ ప్రతిభతో భద్రంగా ఉంటుందని నమ్ముతున్నారుతమ భవిష్యత్తు భారత ఉజ్వల భవిష్యత్తుతో ముడిపడి ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారుఅందుకేమనం వికసిత భారత్‌ గురించి మాట్లాడటాన్ని ప్రపంచం అర్థం చేసుకోగలదుభారత్‌ సరైన దిశలోనే పయనించడాన్ని ప్రపంచం గ్రహించిందనే సత్యాన్ని ఇక తెలివిడి కొరవడిన వారు తెలుసుకోవాల్సి ఉందిఒకప్పుడు  “భారత్‌ ఎక్కాల్సిన బస్సు తప్పిపోయిందిఅనే మాట... ఇప్పుడు భారత్‌తో సమానంగా ప్రయాణానికి ఆలస్యం అవుతోందన్న ప్రపంచ భయంగా మారిందిఅన్ని దేశాలు ఇప్పుడు మన సరసన నడవడానికి పోటీ పడుతున్నాయి.

గౌరవ అధ్యక్షా!

రాబోయేది భారత్‌తోపాటు మన యువతరం ఉజ్వల భవిష్యత్‌ అవకాశాలు నిండిన శకంఈ అవకాశాలేమిటో నేను స్పష్టంగా వివరించగలను.. ఆ దిశగా మా విధానాలను కూడా రూపొందిస్తున్నాంఈ సందర్భంగా నా సహచరులందరికీ ఇదే నా సూచనఅలాగేఈ సభలోని గౌరవ సభ్యులు కూడా తమతమ నియోజకవర్గాల్లో ప్రజలకు ఈ సంగతి చెప్పాలని కోరుతున్నానుప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందివచ్చినప్పుడు మనం అత్యుత్తమ నాణ్యత ద్వారా వాటిని కొనసాగించగలంనాణ్యతపై మనమెన్నడూ రాజీపడరాదులాభం తక్కువైనానాణ్యత అత్యున్నతం కావాలిమనం ఆవిష్కరణలు చేయాలి... పరిశోధనలు సాగించాలి... అవసరమైతే ముడి పదార్థాలను మార్చాలికానీఏదేమైనా భారత్‌ అత్యుత్తమ నాణ్యతకు మారుపేరుగా నిలవాలిఅప్పుడు ప్రపంచం ‘మేడ్ ఇన్ ఇండియామేడ్ ఇన్ భారత్’ గురించి మాత్రమే గానం చేస్తుంది.

గౌరవ అధ్యక్షా!

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రులకూ నా కృతజ్ఞతలువారింతకుముందుగత దశాబ్దంలో ఐదు లేదా ఆరు సార్లు నేను ప్రసంగం ప్రారంభించాక ఆగనని తెలిసి కూడా నన్ను మాట్లాడకుండా ఆపే ప్రయత్నం చేశారుకానీఆ ప్రయత్నాలు ఫలించవని వారికిప్పుడు అనుభవపూర్వకంగా అర్థమైందిఆ జ్ఞానం ఇప్పుడైనా వారిలో పొటమరిస్తుందని నేను ఆశిస్తున్నాను.

గౌరవ అధ్యక్షా!

రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సహకరించిన సభ్యులందరికీ నా కృతజ్ఞతలు.. ఇక్కడ వెలిబుచ్చిన విలువైన ఆలోచనలు దేశ పురోగమనానికి కచ్చితంగా తోడ్పడతాయిఈ స్ఫూర్తిదాయక ప్రసంగంపై గౌరవ రాష్ట్రపతికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు!

గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే...

 

****


(రిలీజ్ ఐడి: 2224755) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati