ఆర్థిక మంత్రిత్వ శాఖ
2030-31 కల్లా జీడీపీలో రుణ నిష్పత్తి 50±1 శాతం స్థాయిలో ఉండే దిశగా భారత్ పయనం
2025-26 సవరించిన అంచనాల (ఆర్ఈ) ప్రకారం, జీడీపీలో 4.4 శాతం స్థాయిలోనే ద్రవ్యలోటు
బడ్జెటు అంచనా (బీఈ)లో పేర్కొన్న ప్రకారం, 2026-27 ఆర్థిక లోటు జీడీపీలో 4.3 శాతంగా ఉండవచ్చు
2025-26 సవరించిన అంచనాలు (ఆర్ఈ) ప్రకారం, మొత్తం రూ.49.6 లక్షల కోట్ల వ్యయంలో మూలధన వ్యయం రూ.11 లక్షల కోట్లు
కేంద్రం నికర పన్ను వసూళ్లు రూ.26.7 లక్షల కోట్లకు చేరే అవకాశం
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 12:42PM by PIB Hyderabad
‘‘ప్రభుత్వం సామాజిక అవసరాలతో రాజీ పడకుండా నిరంతరంగా ఆర్థిక నిబద్ధతల్ని నెరవేరుస్తోంది’’ అని 2026-27 కేంద్ర బడ్జెటును ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటుకు సమర్పిస్తూ స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా, 2026-27 బడ్జెట్ అంచనాలు (బీఈ)లో జీడీపీలో రుణ నిష్పత్తి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 55.6 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. 2025-26 బడ్జెటు తాలూకు సవరించిన అంచనాలు (ఆర్ఈ)లో ఇది జీడీపీలో 56.1 శాతంగా ఉంది. జీడీపీలో రుణం నిష్పత్తి తగ్గుతున్నందువల్ల వడ్డీ చెల్లింపులకు చేస్తున్న ఖర్చు దిగివస్తుంది. దీంతో ప్రాధాన్య రంగాలకు చేయదగ్గ వ్యయానికి వనరులు మెల్లిమెల్లిగా అందుబాటులోకి వస్తాయి.
ఆర్థిక లోటు

రుణ నిర్వహణలో ముఖ్య సాధనాల్లో ఒకటైన ఆర్థిక లోటును గురించి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రస్తావిస్తూ, 2021-22లో పార్లమెంటుకు ఇచ్చిన వాగ్దానం మేరకు 2025-26 కల్లా జీడీపీలో 4.5 శాతానికి విత్త లోటును పరిమితం చేస్తామని చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చామన్నారు. 2025-26 ఆర్ఈలో, ఆర్థిక లోటు జీడీపీలో 4.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. రుణ స్థిరీకరణకు సంబంధించిన ఆర్థిక వివేకపూర్వక చర్యలకు అనుగుణంగా, 2026-27 బీఈలో ఆర్థిక లోటును జీడీపీలో 4.3 శాతంగా అంచనా వేశారు.
2025-26కు సవరించిన అంచనాలు (ఆర్ఈ)
ఆర్థిక మంత్రి తెలియజేసిన ప్రకారం ‘‘రుణేతర వసూళ్ల (నాన్-డెట్ రిసీట్స్) సవరించిన అంచనాలు (ఆర్ఈ) రూ.34 లక్షల కోట్లుగా ఉంది. దీన్లో కేంద్ర నికర పన్ను వసూళ్లు రూ.26.7 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం వ్యయం తాలూకు సవరించిన అంచనా రూ.49.6 లక్షల కోట్లుంది. ఇందులో మూలధన వ్యయం సుమారు రూ.11 లక్షల కోట్లు’’.
2025-26కు బడ్జెట్ అంచనాలు (బీఈ)
కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన ప్రకారం ‘‘రుణేతర వసూళ్లు రూ.36.5 లక్షల కోట్లుగాను, మొత్తం వ్యయం రూ.53.5 లక్షల కోట్లుగాను ఉండొచ్చని అంచనా. కేంద్రం నికర పన్ను వసూళ్లు రూ.28.7 లక్షల కోట్ల మేరకు ఉంటాయని అంచనా’’.
స్థూల మార్కెట్ రుణాలు
కేంద్ర మంత్రి చెప్పిన ప్రకారం ‘‘ఆర్థిక లోటును భర్తీ చేయడానికి, హామీపత్రాల (డేటెడ్ సెక్యూరిటీస్) రూపంలో నికర మార్కెట్ రుణాలు రూ.11.7 లక్షల కోట్ల మేరకు ఉండొచ్చు. మిగతా ఆర్థిక వనరుల్ని చిన్న పొదుపు మొత్తాలతో పాటు ఇతరత్రా మార్గాల నుంచి సమీకరించేందుకు వీలుంది. స్థూల మార్కెట్ రుణాలు రూ.17.2 లక్షల కోట్లుగా ఉండొచ్చని భావిస్తున్నారు’’.
***
(రిలీజ్ ఐడి: 2221703)
సందర్శకుల సూచీ సంఖ్య : : 120
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
Malayalam
,
Tamil
,
Kannada
,
Manipuri
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati