ఆర్థిక మంత్రిత్వ శాఖ
పన్నుల సరళీకరణ, దేశీయ తయారీ రంగానికి మద్దతు లక్ష్యంగా కస్టమ్స్, కేంద్ర ఎక్సైజ్‌పై బడ్జెట్ ప్రతిపాదనలు: కేంద్ర ఆర్థిక మంత్రి
ఇంధన మార్పు, భద్రతను ప్రోత్సహించేందుకు అనేక ప్రాథమిక కస్టమ్స్ సుంకాలపై
మినహాయింపును ప్రతిపాదించిన 2026-27 కేంద్ర బడ్జెట్
పౌర, రక్షణ విమానయాన రంగాల్లో తయారీ, ఎంఆర్ ఓ అవసరాపై బీసీడీ మినహాయింపులు
సెజ్ లలో అర్హత పొందిన ఉత్పత్తి యూనిట్లు.. దేశీయ మార్కెట్లకు,
రాయితీ ధరలకే విక్రయాలు జరిపేలా బడ్జెట్‌లో ప్రతిపాదన
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 1:04PM by PIB Hyderabad
పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026-27ను నేడు ప్రవేశపెడుతూ.. కస్టమ్స్, కేంద్ర ఎక్సైజ్ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశాలను కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ వివరించారు. సుంకాల నిర్మాణాన్ని మరింత సరళీకృతం చేయడానికి, దేశీయ తయారీ రంగానికి మద్దతు ఇవ్వడానికి, ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందించడానికి, పన్నుల నిర్మాణంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ ప్రతిపాదనలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
చాలా కాలంగా కొనసాగుతున్న కస్టమ్స్ సుంకం మినహాయింపులను తొలగించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తూ.. దేశంలో తయారవుతున్న వస్తువులు లేదా దిగుమతులు చాలా స్వల్పంగా ఉన్న వస్తువులపై ఇస్తున్న కొన్ని మినహాయింపులను తొలగించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. అదేవిధంగా ఏదైనా ఒక నిర్దిష్ట వస్తువుపై వర్తించే సుంకం రేటును తెలుసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు.. వివిధ కస్టమ్స్ నోటిఫికేషన్లలో ఉన్న ప్రభావవంతమైన రేట్లను నేరుగా టారిఫ్ షెడ్యూల్‌లోనే చేర్చాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
ఎగుమతులను ప్రోత్సహించే ఉద్దేశంతో.. ఎగుమతి చేసే సముద్ర ఆహార ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే నిర్దిష్ట ముడి సరుకులపై సుంకం లేని దిగుమతుల పరిమితిని పెంచాలని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. గత ఏడాది ఎగుమతి టర్నోవర్ ఎఫ్ఓబీ విలువలో ప్రస్తుతం ఉన్న 1 నుంచి 3 శాతానికి ఈ పరిమితిని పెంచాలని ఆమె సిఫార్సు చేశారు. ప్రస్తుతం తోలు లేదా సింథటిక్ పాదరక్షల ఎగుమతులకు అందుబాటులో ఉన్న నిర్దిష్ట ముడి సరుకులపై సుంకం లేని దిగుమతులను ఇకపై షూ అప్పర్స్(షూ పైన ఉండే భాగం) ఎగుమతులకు కూడా వర్తింపజేయాలని బడ్జెట్ ప్రతిపాదించింది. తోలు లేదా వస్త్ర దుస్తులు, తోలు లేదా సింథటిక్ పాదరక్షలు, ఇతర తోలు ఉత్పత్తుల ఎగుమతిదారుల కోసం.. తుది ఉత్పత్తిని ఎగుమతి చేయడానికి ఇచ్చే కాలపరిమితిని ప్రస్తుతమున్న 6 నెలల నుంచి 1 సంవత్సరానికి పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.
శక్తి మార్పు, ఇంధన భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో బడ్జెట్‌లో పలు కీలక ప్రతిపాదనలు చేశారు. లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి ఉపయోగించే ముడి సరకులకు ఉన్న ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయింపును.. ఇకపై బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థల కోసం వాడే లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి కూడా విస్తరించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. సౌరశక్తి రంగానికి సంబంధించి సోలార్ గ్లాసు తయారీలో ఉపయోగించే సోడియం యాంటిమోనేట్ దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని కేంద్రమంత్రి ప్రతిపాదించారు.

అణుశక్తి రంగాన్ని మరింత ప్రోత్సాహిస్తూ.. అణు విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన వస్తువుల దిగుమతిపై ప్రస్తుతం ఉన్న ప్రాథమిక కస్టమ్స్ సుంకం మినహాయింపును 2035 సంవత్సరం వరకు పొడిగించాలని శ్రీమతి నిర్మలా సీతారామన్ సిఫార్సు చేశారు. అంతేకాకుండా ఈ మినహాయింపును వాటి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా అన్ని అణు ప్లాంట్లకు వర్తింపజేయాలని ఆమె ప్రతిపాదించారు. దేశంలో కీలక ఖనిజాల శుద్ధికి అవసరమైన ముడి వస్తువుల దిగుమతికి కూడా ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ ప్రతిపాదించింది. సీఎన్ జీలో బయోగ్యాస్ మిశ్రమాన్ని ప్రోత్సహించేందుకు బయోగ్యాస్ మిశ్రమ సీఎన్ జీపై పై చెల్లించాల్సిన కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని లెక్కించేటప్పుడు అందులోని బయోగ్యాస్ విలువను పూర్తిగా మినహాయించాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
విమానయాన రంగానికి సంబంధించి.. పౌర, శిక్షణ, ఇతర విమానాల తయారీకి అవసరమైన విడిభాగాలు, పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. రక్షణ రంగంలోని యూనిట్లు నిర్వహించే నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర పునరుద్ధరణ అవసరాల కోసం వాడే విమాన విడిభాగాల తయారీకి దిగుమతి చేసుకునే ముడి సరుకులపై కూడా ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయించాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
వినియోగదారు ఎలక్ట్రానిక్స్ రంగంలో విలువను మరింత పెంచే లక్ష్యంతో.. మైక్రోవేవ్ ఓవెన్ల తయారీలో ఉపయోగించే కొన్ని నిర్దిష్ట విడిభాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సంకాన్ని మినహాయించాలని బడ్జెట్ ప్రతిపాదించింది.
ప్రపంచ వాణిజ్య అంతరాయాల కారణంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) తయారీ యూనిట్లు తమ పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను బడ్జెట్ పరిగణనలోకి తీసుకుంది. దీని పరిష్కారం కోసం సెజ్ లలో అర్హత పొందిన తయారీ యూనిట్లు ఒకేసారి వర్తించే వెసులుబాటుతో తమ ఉత్పత్తులను దేశీయ మార్కెట్లకు రాయితీ పన్ను రేట్లపై విక్రయించేలా ఆర్థిక మంత్రి ఒక ప్రత్యేక ప్రతిపాదన చేశారు. ఇలా దేశీయ మార్కెట్లో నిర్వహించే విక్రయాల పరిమాణం, ఆయా యూనిట్లు చేసే ఎగుమతులు ఒక నిర్ణీత శాతానికి మాత్రమే పరిమితం అవుతాయి. స్థానిక మార్కెట్లోని ఇతర యూనిట్లకు సమానమైన పోటీ వాతావరణాన్ని కల్పిస్తూనే.. ఈ చర్యలను అమలులోకి తీసుకురావడానికి అవసరమైన నియంత్రణ మార్పులు చేపట్టనున్నట్లు శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2221660)
సందర్శకుల సూచీ సంఖ్య : : 106
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam