డీ జ్ఞానసుందరం మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తమిళ సంస్కృతికి, సాహిత్యానికి శ్రీ డీ జ్ఞానసుందరం చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ప్రధానమంత్రి అన్నారు. ఆయన రచనలు, అంకితభావం సమాజంలో సాంస్కృతిక స్పృహను సుసంపన్నం చేశాయి. పాఠకులకు, పండితులకు ఆయన రచనలు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
2024 జనవరిలో శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో ఆయనతో జరిగిన సంభాషణను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. కంబ రామాయణంపై ఆయనకున్న అవగాహన విలక్షణమైనదని కొనియాడారు.
ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రధానమంత్రి సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:
‘‘శ్రీ డీ జ్ఞానసుందరం మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తమిళ సంస్కృతికి, సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. తన రచనలు, అంకితభావం ద్వారా సమాజంలో సాంస్కృతిక స్పృహను సుసంపన్నం చేశారు. పాఠకులు, పండితులకు ఆయన రచనలు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
2024 జనవరిలో తిరుచురాపల్లిలో శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆయనతో సంభాషించాను. కంబ రామాయణంపై ఆయనకున్న అవగాహన అసామాన్యమైనది.
ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’